అందుబాటులో 26 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా | available-26-thousand-metric-tuns-uriya | Sakshi
Sakshi News home page

అందుబాటులో 26 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా

Published Sat, Jul 16 2016 8:31 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM

available-26-thousand-metric-tuns-uriya

– అధిక ధరలకు ఎరువులు అమ్మితే లైసెన్స్‌ రద్దు
– జిల్లా వ్యవసాయ ఉపసంచాలకుడు బైరెడ్డి సింగిరెడ్డి
మరికల్‌(ధన్వాడ): ఖరీఫ్‌ సిజన్‌ను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో యూరియా కొరత రాకుండా 26 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉంచినట్లు జిల్లా వ్యవసాయ శాఖ ఉపసంచాలకుడు బైరెడ్డి సింగిరెడ్డి అన్నారు. శుక్రవారం మరికల్‌లో ప్రయివేట్‌ ఫర్టీలైజర్‌ దుకాణాలకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.298 గల యూరియా బస్తాను రైతులకు రూ.320లకు విక్రయిస్తునట్లు తమ దృష్టికి వచ్చిందని అధిక ధరలకు ఎరువులు అమ్మినా, రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు రశీదులు ఇవ్వకపొయిన దుకాణాల లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు.
 
ఖరీఫ్‌లో యూరియా కొరత లేకుండా ఉండేందుకు 26వేల మేట్రిక్‌ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచామని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. రైతులకు మరిన్ని సేవలను అందించేందుకు జిల్లాలో మూడు ఉపసంచాలకుల పోస్టులను భర్తీ చేశామన్నారు. ప్రయివేట్‌ ఫర్టిలైజర్‌ దుకాణదారులు అధిక ధరలకు ఎరువులు అమ్మినా, బిల్లులు ఇవ్వకపొయిన, పంటలకు సబంధించిన సమస్యలు, సలహాలు, సూచనల కోసం 7288894286 నంబర్‌కు ఫోన్‌ చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ సక్రియానాయక్, ఇంచార్జ్‌ ఏఓ రాజేష్, సిబ్బంది లక్ష్మన్‌సింగ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement