పేగుబంధాన్ని మరిచిన ఓ తల్లి తన కుమారుడిని కర్కశంగా హింసించింది. మల, మూత్ర విసర్జన నిక్కరులో చేసుకుంటున్నావంటూ దారుణంగా చితకబాదింది.
నెక్కొండ, న్యూస్‌లైన్ : పేగుబంధాన్ని మరిచిన ఓ తల్లి తన కుమారుడిని కర్కశంగా హింసించింది. మల, మూత్ర విసర్జన నిక్కరులో చేసుకుంటున్నావంటూ దారుణంగా చితకబాదింది. నేపాల్ దేశానికి చెందిన గూర్ఖా రాము, అమృత దంపతులు కొద్ది నెలలుగా వరంగల్ జిల్లా నెక్కొండలో నివసిస్తున్నారు. వారి పెద్ద కుమారుడు అర్జున్ నిక్కరులోనే మల, మూత్రం విసర్జిస్తున్నాడు. ఆగ్రహించిన ఆమె, బాలుడి కాళ్లుచేతులు తాళ్లతో కట్టి పడేసింది. రెండు రోజులుగా తిండి పెట్టకుండా చిత్రహింసలకు గురిచేసింది. దీంతో బాలుడు రెండు చేతులు, కాళ్లు గాయాలతో బొబ్బలెక్కడమే కాక స్పర్శను కూడా కోల్పోయాడు. విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. బాలుడికి వైద్యం చేయించి చైల్డ్‌లైన్‌కు అప్పగించారు.