మరుగుదొడ్డితో విప్లవం!
దేశాన్ని పరిశుద్ధంగా ఉంచాలంటే, వీధుల్లో చెత్త లేకుండా చేయాలి. గోడల పక్కన మూత్ర విసర్జన చేయకూడదు. ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయకుండా ఉండాలి. ఇవన్నీ సాధ్యపడితే, ఇది విప్లవానికి ఏమాత్రం తీసిపోదు.
అవి చౌక రకం ఎయిర్‌లైన్స్ కు ప్రజాదరణ పెరుగుతున్న రోజులు. 2002లో ఢిల్లీ నుంచి ముంబై వెళుతున్న విమానం లో టాయ్‌లెట్‌కు వెళుతున్న ఒక వ్యక్తిని నేను చూడటం తటస్థించింది. అతడు దాని తలుపు తెరిచాడు, లోపలికి చూశాడు, దాన్ని వాడకుండానే మహాశ్చర్యంతో వెనుదిరి గాడు. టాయ్‌లెట్ లోపల మురికిగా ఉందేమోనని నేననుకున్నాను. కేబిన్ సిబ్బందికి తెలియపర్చవలసిం దిగా అతనికి సూచించాను. కానీ నాది ఎంత తప్పు సూచనో!
నా సహ ప్రయాణికుడు దిగ్భ్రాంతితోనే, ఆ టాయ్‌లెట్ మురికిగా లేదని, చాలా పరిశుభ్రంగా ఉంద ని వివరించాడు. అంత చిన్న, పరిశుభ్రమైన టాయ్ లెట్‌ను ఎలా ఉపయోగించాలో తెలియకున్నదని అతడి ఉద్దేశం. ఆ మాటలు విన్న ఇతర ప్రయాణికులు కొందరు ముందు వెనుక వరుసల లోంచి లేచి, టాయ్‌లెట్‌ని చూడాలని దాని నడవా వద్దకు వచ్చారు. సీన్ కట్ చేస్తే, అది 1990ల నాటి కాలం. మహా రాష్ట్రలోని లాతూర్‌లో ఘోర భూకంపం తర్వాత కుప్పకూలిన అన్ని ఇళ్లను పునర్నిర్మించారు. ప్రతి ఇంటికీ సమీపంలో ఒక విడి కుటుంబ టాయ్‌లెట్ కలిగి ఉండే లా వాటిని రూపొందించారు. గ్రామీణ మనస్తత్వం గురించి తెలుసు కాబట్టి పట్టణాల్లోని ఇంటిలోనే భాగమై ఉండే అటాచ్డ్ టాయ్‌లెట్ లా కాకుండా ఇంటి బయటే వాటిని నిర్మించారు. కానీ ప్రజలు మాత్రం వాటిని మరొ కలా అంటే నిల్వ గదిలా, (దయచేసి నన్ను నమ్మండి) చివరకి పూజ గదుల్లా కూడా వాటిని ఉపయోగించారు. ఎప్పటిలాగే కాలకృత్యాలకు బహిరంగ స్థలాలను సంద ర్శించసాగారు కూడా.
ఈ వాస్తవాన్ని గుర్తించని ప్రభుత్వం 1990ల చివర లో కూడా ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.450 కోట్లను అందించింది. అయితే వీటిలో కూడా 40 శాతం మరుగుదొడ్లను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించా రని తెలిపిన గణాంకాలు దిగ్భ్రాంతిపర్చాయి. టాయ్ లెట్‌కు అత్యంత కీలకమైన స్క్వాట్ పాన్ (విసర్జనకు ఉపయోగించే మూకుడు గుంట) ని కూడా కాంట్రాక్టర్లు అమర్చలేదు. ప్రజలు ఆ గదిని దేనికి ఉపయోగిస్తారో అందరికీ తెలుసు మరి.
ఇలాంటి పరిస్థితుల్లో బహిరంగ మల విసర్జన మాటను అలా ఉంచి.. ఉమ్మి వేయడం, బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం కూడా తప్పేనంటూ ఒక టాయ్‌లెట్ ఈ దేశానికి, దాని ప్రజలకు ఎలా శిక్షణ ఇవ్వగలదు? దీన్ని దృష్టిలో ఉంచుకునే, నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ అభియాన్ బహిరంగ విసర్జనకు వ్యతిరేక ప్రచారంతోనే మొదలైంది. ఎందు కంటే ఈ పథకం కేవలం టాయ్‌లెట్‌లపై మాత్రమే కాకుండా దేశాన్ని పరిశుద్ధంగా ఉంచడానికి సంబంధించింది.
నిజానికి దోమల సంతతి అధికం కావటం వల్లే ఢిల్లీ ప్రజలు డెంగ్యూ వ్యాధికి గురవుతున్నారన్న వాస్తవం బట్టి స్వచ్ఛ భారత్ అభియాన్ ఏ మేరకు విజయం సాధించిందో మనందరం గ్రహించవచ్చు. రెండోది ఏమి టింటే, డెంగ్యూ వ్యాధి బారిన పడి బాధితులు చికిత్స కోసం పోటెత్తిన ప్రభుత్వ వైద్యశాలలే తమకు తాముగా మురికిగా ఉండటంతో అక్కడ తమకు రోగం నయమవు తుందా లేక ఇతర వ్యాధులు కూడా అంటుకుంటాయా అని తేల్చుకోవలసిన పరిస్థితి తయారైంది. ఇదంతా మోదీకి తెలియని విషయం కాదు. ముంబైతో సహా ఇతర భారతీయ నగరాలు కూడా దీనికి ఏమాత్రం భిన్నంగా లేవు.
దేశాన్ని పరిశుద్ధంగా ఉంచాలంటే, మనం కనీసం గా అయినా కొన్నింటిని పాటించాలి. 1. వీధుల్లో చెత్త లేకుండా చేయాలి. 2. గోడల పక్కన మనుషులు మూత్ర విసర్జన చేయకూడదు. 3. మహిళలు తమ కాలకృత్యాల కోసం పొదల చాటుకు వెళ్లకుండా ఉండాలి. 4. ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయకుండా ఉండాలి. నిజంగా ఇవన్నీ సాధ్యమైనట్ల యితే, ఇది విప్లవానికి ఏమాత్రం తీసిపోదు.
ఇక్కడ విప్లవం అని నేను మాట్లాడుతున్నది ప్రభుత్వాన్ని కూలదోయడం వంటిది కాదు కానీ, ఒక సమాజంగా మనం మారవలసిన పరిణామం అది. అన్ని స్థాయిల్లో (గ్రామ పంచాయతీల నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు) ఈ విప్లవంలో పాలుపంచుకోవలసిన ఇద్దరు ఆటగాళ్లు ఎవరంటే అటు పౌరులూ, ఇటు ప్రభుత్వమూనూ. ఈ లక్ష్య సాధనకు ఈ ఇరువురూ నిబద్ధతతో పనిచేయాలి. ఒకరు లేకుండా మరొకరు ఈ లక్ష్యాన్ని సాధించటం అసాధ్యం.
పౌర అధికారులు తమ విధులను సరిగా నిర్వహిం చకపోవడం వల్లే దోమల సంతతి పెరుగుతోంది. నిధుల నుంచి మానవశక్తి వరకు అనేక రకాల అవరోధాలు వారికి అడ్డు తగులుతుండవచ్చు.
కానీ క్షమించరాని ఉదాశీనత భారంతో వీరు నలిగిపోతున్నారు. ప్రజలు సైతం ఇది కావాలి, అది కావాలి అని పోరు పెట్టడమే తప్ప తమ పరిసరాలను తామే జాగ్రత్తగా చూసుకో వాలని భావించడం లేదు. సందుల్లోనే వారు చెత్త పడేస్తారు. దానిపై మురికినీరు పారడాన్ని కళ్లప్పగించి చూస్తారు. దానితో సమాధానపడతారు కూడా. ఎవ్వరూ పారిశుద్ధత గురించి డిమాండ్ చేయడం లేదు అందుకే పురపాలక సంస్ధలకు అంత నిర్లక్ష్యం. అటు పాలనా యంత్రాంగం, ఇటు వ్యక్తి లేదా కమ్యూనిటీ కూడా.. నేనేం చేయాలనుకుంటున్నానో అది నా పని కాదు అనే తత్వానికి సంబంధించిన భయంకరమైన సాంస్కృతిక ఆమోదంలో కొట్టుకు పోతున్నాయి. సమస్యను మార్చడం ద్వారానే విజయం సాధించగలమని ఏ ఒక్కరూ భావించడం లేదు.
పారిశుధ్య ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో ఉంచే పేరుతో, వంట చేయడానికి ముందు మడి కట్టుకునే దేశంలో (ఇది ఇప్పుడు పూర్తిగా ఛాందస సంప్రదాయంగా కనిపిస్తూ, పూజలు, అంత్యక్రియలు వంటి పరమ సాంప్రదాయక స్థాయికి కుదించుకు పోయింది) టాయ్‌లెట్‌కి వెళ్లిన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చనే విషయాన్ని ప్రజలకు బోధించడం ఎలా సాధ్యపడుతుంది?
మరుగుదొడ్లను ప్రజలందరికీ కల్పించడం ఒకెత్తు కాగా, వాటిని ఉపయోగించేలా చేయడం మరొకెత్తు. తగినన్ని టాయ్‌లెట్లను రైళ్లు అందిస్తు న్నాయి కానీ అవి పరమ రోతగా ఉంటున్నాయి. వాటిని ఉపయోగించే పద్ధతి మరొకెత్తు. రైళ్లలో, బస్‌స్టాండ్‌లలో, చివరికి దిగ్భ్రాంతి గొలిపేలా ఉద్యో గులే ఉపయోగిస్తున్న మునిసిపల్ ఆఫీసుల్లో మరుగు దొడ్లను ఉపయోగించే తీరు మన సాంస్కృతిక లోటుపాట్లను సూచిస్తుంది. వీటిమీదే తీవ్రమైన పోరాటం చేయవలసి ఉంది.
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com)
- మహేష్ విజాపుర్కార్