ఆందోళనే అసలు సమస్య
ప్రైవేట్ కౌన్సెలింగ్
నాకు 30 ఏళ్లు. మూడు నెలల కిందట వివాహమయ్యింది. పెళ్లయిన మొదటిరాత్రి అంగం బాగానే గట్టిపడింది కాని అంగప్రవేశం చేస్తున్నప్పుడు టెన్షన్ వల్ల అంగస్తంభన తగ్గి సెక్స్ చేయలేకపోయాను. అప్పట్నుంచి సెక్స్ చేయాలంటే భయం వేస్తోంది. ఒకప్పుడు హస్తప్రయోగం బాగా చేసేవాణ్ణి. నెల తర్వాత ఇప్పుడు కూడా సెక్స్‌లో పాల్గొనాలంటే భయంతో సెక్స్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు నా భార్య కూడా నాతో సహకరించడం లేదు. దాంతో ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్తున్నాను. నేను ఏం చేయాలో సలహా ఇవ్వండి.
- కేకేఆర్., సికింద్రాబాద్
మీరు యాంగ్జైటీ న్యూరోసిస్‌తో బాధపడుతున్నారు. కొత్తగా పెళ్లయినవాళ్లలో ఆందోళన వల్ల ఇలా ఆశాభంగం కలగడం సహజం. ఇది సర్వసాధారణం. సెక్స్ అనేది స్వాభావికంగా చేసే సాధారణ ప్రక్రియ. ఇది ఇలాగే చేయాలనే నియమ నిబంధలేమీ ఉండవు. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమ ఉండి మీ భార్య, మీరు పరస్పరం సహకరించుకుంటే మీరు ఈ సమస్యను చాలా తేలిగ్గా అధిగమించగలరు. మందులేవీ అవసరం లేకుండానే సెక్స్‌లో సమర్థంగా పాల్గొనగలరు. మరో విషయం... మీరు గతంలో చేసిన హస్తప్రయోగం వల్ల మీకు ఈ సమస్య రాలేదు. మీ భార్యతో సెక్స్‌లో పెర్‌ఫార్మార్మెన్స్ యాంగ్జైటీకి లోనవ్వడం వల్ల ఇలా జరిగింది.
నాకు 28 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. ఈమధ్య సంబంధాలు చూస్తున్నారు. నాకు ఐదేళ్ల కిందట అంగస్తంభనలు బాగానే ఉండేవి. కాని ఈమధ్యకాలంలో అంతత్వరగా అంగస్తంభనలు కలగడం లేదు. సెక్స్‌చిత్రాలు చూసినా కూడా ఇదివరకు ఉన్నంత అంగస్తంభనలు రావడం లేదు. హస్తప్రయోగం చేస్తుంటే వీర్యం కూడా తక్కువగానే వస్తోంది. నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. దాంతో భార్యను సుఖపెట్టగలనా అని భయం వేస్తోంది. నాకు మంచి సలహా ఇవ్వండి.
- ఎస్.ఆర్.కే., పొదిలి
సాధారణంగా 20-25 ఏళ్ల మధ్య వయసున్నవారిలో విపరీతమైన సెక్స్ కోరికలు, వెంటవెంటనే అంగస్తంభనలు ఉండటం సాధారణం. మన దేశంలో సాధారణంగా యువత 25 ఏళ్ల ప్రాయం నుంచి యువకులు ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక అంశాల్లో నిమగ్నమై సాధారణ వ్యవహారాల్లో సమస్యలను ఎదుర్కోవడం మొదలై సెక్స్ మీద కొంత కాన్సన్‌ట్రేషన్ తగ్గుతుంది. దాంతో కొందరిలో హస్తప్రయోగం సమయంలో తృప్తి తక్కువగా ఉండవచ్చు. ఇది ప్రధాన సమస్య కాదు. పైగా మీ వయసులోని వారు ఎంతోకాలంగా హస్తప్రయోగం చేస్తుండటం వల్ల అది యాంత్రిక ప్రక్రియగా మారి గతంలో ఉన్నంత థ్రిల్ ఇవ్వకపోవచ్చు. అయితే పెళ్లితో ఈ సమస్యలు సమసిపోతాయి. మీరు నిశ్చింతగా పెళ్లి చేసుకుని సాధారణ సెక్స్ జీవితాన్ని గడపవచ్చు.
నాకు 65 ఏళ్లు. నా భార్యకు 55 సంవత్సరాలు. నాకు సెక్స్ అంటే చాలా ఇంటరెస్ట్. ఇటీవల మూత్రపరీక్షలు చేయించుకుంటే ప్రోస్టేట్ గ్రంథిలో గడ్డలు తయారైనట్లు చెప్పారు. మూత్రం సరిగ్గా రాకపోవడంతో ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించాలని చెబుతున్నారు. దీన్ని తొలగించాక వీర్యం రాదు అని అంటున్నారు. అంగస్తంభన ఏమైనా దెబ్బతింటుందేమోనని నాకు ఆందోళనగా ఉంది. ఈ విషయంలో నాకు సరైన సలహా ఇవ్వగలరు.
- ఎమ్‌పీఎల్., విజయనగరం
అరవై ఏళ్లు పైబడ్డవారిలో ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు రావడం సాధారణం. వీటిని మందులతో లేదా ఎండోస్కోపీ (టీయూఆర్‌పీ)తో నయం చేస్తాం. ఎక్కువభాగం వీర్యం ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్లనే తయారవుతుంది. కాబట్టి దీన్ని తొలగించినప్పుడు వీర్యం తక్కువగా వస్తుంది. అయితే సెక్స్ చేయడానికి గాని, సెక్స్‌లో సంతృప్తి పొందడానికి గాని ఈ ఆపరేషన్ ఏవిధంగానూ అడ్డంకి కాదు. దీని వల్ల సెక్స్‌లో ఏ లోపమూ రాదు. అందువల్ల ఈ ఆపరేషన్ అవసరమని డాక్టర్లు చెబితే నిశ్చింతగా టీయూఆర్‌పీ సర్జరీ చేయించుకోవచ్చు.
నా వయుస్సు 70 ఏళ్లు. పదిహేనేళ్ల నుంచి షుగర్ ఉంది. నా వుూత్రవూర్గం సన్నబడింది. డాక్టర్ సలహాతో యుూరెథ్రల్ క్యాథెటర్‌తో ఐదురోజులకు ఓసారి కాథెటరైజేషన్ చేసుకుంటున్నాను. ఇందుకోసం దాదాపు 15 నిమిషాల సమయం పడుతోంది. నాకు పెరీనియుల్ యుూరెథ్రాస్టమీ అవసరవూ? అప్పుడు యూరిన్‌పై కంట్రోల్ లేకుండా పోతుందా?
- సీహెచ్‌ఎస్‌ఆర్., హైదరాబాద్
జ: డెబ్బయి ఏళ్ల వయసులో షుగర్ ఉండటం, ప్రోస్టేట్ పెరగడం, వుూత్రం సరిగ్గా రాకపోవడం అన్న సమస్యలు చాలా సాధారణంగా వచ్చేవే. ఇవే కాకుండా వుూత్రం సరిగ్గా రాకపోవడానికి స్ట్రిక్చర్ (వుూత్రనాళం సన్నబడటం) వంటివి కూడా కారణం కావచ్చు. ఈ స్ట్రిక్చర్‌ను రెట్రోగ్రేడ్ యూరొథ్రోగ్రామ్ (ఆర్‌జీయుూ) పరీక్ష ద్వారా కనుగొంటారు. ఆర్జీయుూ పరీక్షలోస్ట్రిక్చర్‌ను కనుగొంటే దానికి పెరీనియుల్ యుూరెథ్రోప్లాస్టీ అన్నది మంచి చికిత్స ప్రక్రియు. మీరు చెప్పిన పెరీనియుల్ యుురెథ్రాస్టమీ అన్నది స్ట్రిక్చర్ చాలా పొడవుగా ఉన్న సవుయుంలో చివరి ఆప్షన్‌గా చేసే శస్త్రచికిత్స. అరుుతే ఈ సర్జరీలో వుూత్రం వచ్చే వూర్గాన్ని వృషణాల కింద ఉండేలా ఏర్పాటు చేస్తారు. అలాంటప్పుడు కూర్చుని వుూత్ర విసర్జన చేయూల్సి ఉంటుంది. యుూరిన్‌పై మీ కంట్రోల్ ఉంటుంది. మీరు అనుకుంటున్నట్లు యుూరిన్ లీక్ అవ్వదు.
నేను డిగ్రీ చదువుతున్నాను. నా ఛాతీ అమ్మాయిల ఛాతీలా పెరిగి ఉంది. ‘నువ్వు అమ్మాయివా?’ అంటూ ఫ్రెండ్స్ ఆటపట్టిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం నేను ఏం చేయాలో సలహా ఇవ్వండి.
- ఎస్.ఆర్.కె., కొండాపూర్
కొన్ని సార్లు కొందరు అబ్బాయిల్లో కూడా యుక్తవయసులో బ్రెస్ట్‌లా పెరగవచ్చు. దీన్ని గైనకోమాస్టియా అంటారు. దీని పరిమాణం చిన్నగా ఉంటే అవి వాటంతట అవే తగ్గిపోవచ్చు. ఒకవేళ మరీ పెద్దగా ఉండి, పెరుగుతూ ఉంటే ప్రోలాక్టిన్ వంటి హార్మోన్ పరీక్షలు చేసి ఈ పెరుగుదలకు కారణమేమిటో ముందుగా కనుక్కుని, దానికి అనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కారణమేమీ లేకుండానే ఇవి పెరుగుతుంటే లైపోసక్షన్ అనే సర్జరీ ద్వారా అతి తక్కువ కోతతో వీటిని తొలగించవచ్చు. చాలామంది అనుకున్నట్లు లేదా మీ ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నట్లు ఇది అన్నిసార్లూ ఆడతనాన్ని సూచించదు. కాబట్టి అనవసరంగా కంగారు పడకుండా యాండ్రాలజిస్ట్‌ను కలవండి.
డాక్టర్ వి. చంద్రమోహన్
యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్