చిన్నపిల్లలు చాలామంది మూత్రవిసర్జన సమయంలో మంట అని ఏడుస్తుంటారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరుగుతుంది. వేసవిలో పిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. ఈ కింది జాగ్రత్తలతో దాన్ని నివారించవచ్చు.
►పిల్లలు తగినంతగా నీళ్లు తాగేలా జాగ్రత్త తీసుకోవాలి. మరీ ముఖ్యంగా వేసవి సీజన్‌లో ఆటల్లో పడి పిల్లలు నీళ్లు తాగరు. దాంతో ఈ సమస్య ముప్పు పెరుగుతుంది.
►వదులుగా ఉండే దుస్తులు వేయాలి. ముఖ్యంగా నడుము కింది భాగంలో బిగుతుగా లేకుండా చూసుకోవాలి.
►వారి ప్రైవేటు అవయవాల ప్రాంతాన్నంతా పరిశుభ్రంగా ఉంచుకోవడం నేర్పించాలి. ఇన్ఫెక్షన్ ఉన్న సమయంలో మూత్రవిసర్జన తర్వాత గోరు వెచ్చని నీళ్లతో ఆ ప్రాంతమంతా శుభ్రం చేయాలి. ఇందుకు సబ్బు నీళ్లు వాడకూడదు. ప్లెయిన్ వాటరే మంచిది.
►పిల్లలకు మంచి టాయిలెట్ అలవాట్లు నేర్పాలి. అంటే మూత్రమంతా బయటకు వచ్చేలా మూత్రవిసర్జన చేయడం, ప్రైవేట్ పార్ట్స్ శుభ్రంగా కడుక్కోవడం వంటివి).
►యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చేయకూడని పనులనూ గుర్తుపెట్టుకోవాలి. నీళ్ల తొట్టిలో సబ్బు కలిపి నురగవచ్చేలా చేసి, తొట్టి స్నానం చేయించడం (బబుల్ బాత్) వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అందుకే ఆ సమయంలో బబుల్‌బాత్ చేయించకూడదు.
Urinary Tract Infection: చిన్నారుల్లో యూటీఐ నివారణ ఇలా...
Published Sun, Feb 20 2022 10:22 AM | Last Updated on Sun, Feb 20 2022 11:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment