మెడ ఎందుకు పట్టేస్తుందో, భరించలేని నొప్పి ఎందుకు వస్తుందో ఒక్కోసారి సరిగ్గా గుర్తించలేం. రోజంతా టీవీ చూడటం, ల్యాప్‌టాప్, కంప్యూటర్లు వాడకం, గంటల తరబడి స్మార్ట్ ఫోన్‌ను చూస్తూ ఉండటంవల్లగానీ, వ్యాయామం చేస్తున్నప్పుడు గానీ, రాత్రిపూట నిద్ర పోయేటపుడు భంగిమలో తేడా తదితర కారణాలతో మెడ నొప్పి బాధిస్తుంది.
♦ నిద్ర లేచిన తర్వాత మీకు మెడ నొప్పిగా అనిపిస్తే.. నొప్పి ప్రభావిత ప్రాంతాల్లో ఐస్ ప్యాక్ లేదే చల్లని నీటిలో నింపిన క్లాత్ ను వేసి అద్దాలి. అలా చేయడం వల్ల మెడ కండరాల వాపు తగ్గుతుంది. దీంతోపాటు హీట్ ప్యాక్ ను ఉపయోగించవచ్చు. ఇది కూడా మెడ కండరాల నొప్పిని తగ్గిస్తుంది.
♦ మెడ నొప్పిగా ఉన్న వాళ్లు చేతులతో మెడను నెమ్మదిగా మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల కండరాలు సర్దుకొని నొప్పి తగ్గే అవకాశం ఉంది.
♦ మసాజ్ చేసే సమయంలో కొబ్బరి లేదా నువ్వుల నూనె ఉపయోగిస్తే మేలు జరుగుతోంది. మెడ నొప్పిని నివారించేందుకు మీరు రాత్రిళ్లు బోర్లా పడుకోకుండా ఉంటే చాలు.
♦ కొన్ని రకాల యోగా ద్వారా కూడా మెడనొప్పిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా క్లాక్ వైజ్,యాంటి క్లాక్‌వైజ్ దిశలో మెడను మెల్లిగా సున్నాలాగా చుడుతూ చేసే వ్యాయామం మంచి ఫలితాలనిస్తుంది.
♦ మొబైల్ ఫోన్‌ల వల్ల వచ్చే నొప్పిని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు. దీనికి ఆక్యుపంక్చర్ థెరపీ ద్వారా ఉపశమనం పొందవచ్చు.
చాలా సందర్భాలలో, నొప్పికి కారణం తెలియదు. దానికదే మెల్లిగా నెమ్మదిస్తుంది. కొన్నిసార్లు ఇది వారం లేదా రెండు వారాల్లో తగ్గుతుంది. చిట్కాలతో కూడా మెడనొప్పి తగ్గకుండా వేధిస్తూ ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి. సరైన చికిత్స తీసుకోవాలి. మూడు నెలల కంటే ఎక్కువ కాలంపాటు వేధించే మెడ నొప్పికి అంతర్లీనంగా మరికొన్ని కారణాలు కూడా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment