వేసవికాలంలో ప్రధానంగా వేధించే సమస్య ముఖం మీద నల్లని లేదా గోధుమ రంగు మచ్చలు. వయసు పెరిగే కొద్దీ ఇవి మరింత బాధిస్తాయి. ఈ మచ్చలను మంగు మచ్చలు లేదా పిగ్మెంటేషన్ అంటారు. నుదురికి ఇరువైపులా, బుగ్గలు, ముక్కుకు ఇరువైపులా అందహీనంగా కనిపిస్తాయి. వీటి నివారణకు లేజర్ చికిత్సలు, మార్కెట్‌లో దొరికే క్రీమ్‌లకంటే ఇంట్లోనే చేసుకోగలిగిన పరిష్కారాలు మంచి ఫలితాన్నిస్తాయి.
అసలు మంగు మచ్చలు ఎందుకు వస్తాయి?
వయస్సుతోపాటు చర్మంపై పడే ప్రతికూలతల వల్ల ఈ మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. హరోన్ల సమతుల్యత లోపం వల్ల, మరికొందరికి వంశపారంపర్యంగా కూడా ఈ మచ్చలు రావచ్చు. అయితే వీటిని శారీరకమైన బాధలేవీ ఉండవు. శరీరంలో మెలనిన్ ఎక్కువగా తయారైతే.. ‘హైపర్ పిగ్మెంటేషన్’కు దారి తీస్తుంది.
సూర్య కిరణాల్లోని అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని చేసి, ఆ సమయంలో మెలనిన్ ఎక్కువై మంగు మచ్చలు తయారవుతాయి. జీవక్రియ సమస్యలు, పోషకాహార లోపం, అధిక ఉష్ణోగ్రత, కాలుష్యం,అనుధార్మికత, ఔషధాల వల్ల కూడా ఇవి ఏర్పడతాయి.
బంగాళ దుంప: బంగాళ దుంపల తురుమును పలచని గుడ్డలో వేసి రసం తీసుకోవాలి. ఒక కాటన్ ప్యాడ్‌ను గానీ, దూదిని గానీ ఈ రసంలో ముంచి మచ్చలపై పూయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుంటే తప్పకుండా మచ్చలు తొలగిపోతాయి.
టమోటా: గింజలు తొలగించిన టమోటా గుజ్జుకు, కొద్దిగా తేనె కలిపి మచ్చలకు అప్లయ్ చేయాలి. 20 నిమిషాలు ఉంచి ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి మార్పు మీకే తెలుస్తుంది.
టమోటా, ముల్తానా మట్టి: టమోటా రసంలో కాస్త గంధం పొడిని కలపండి. ఆ మిశ్రమంలో ముల్తాని మట్టిని కలిపి పేస్టులా చేయండి. అనంతరం ఆ పేస్టును ముఖంపై ఉన్న మచ్చలపై రాయండి. 20 నుంచి 30 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. వారంలో రెండుస్లారు ఇలా చేస్తే మంచు మచ్చలు క్రమంగా తగ్గి పోతాయి.
కలబంద: సహజసిద్ధమైన కలబంద గుజ్జు చాలా రకాల చర్మ సమస్యలకు పరిష్కారం. క్రమం తప్పకుండా కలబంద గుజ్జున రాస్తే మంగు మచ్చలు మాటుమాయం.
నిమ్మ, రోజ్‌వాటర్: ఒక గిన్నెలో రోజ్ వాటర్, నిమ్మరసం, కీరదోస రసం, తేనె వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి బాగా పట్టించి, 15, 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. రోజ్ వాటర్ లేని పక్షంలో నిమ్మరసాన్ని వాడుకోవచ్చు.
పసుపు: పసుపు, గేదె పాలు, ఎర్ర చందనం కలిపి ముఖానికి రాసుకుంటే సత్ఫలితాలు కనిపిస్తాయి. తాజా గేదె నెయ్యి మంగు మచ్చలపై రాస్తే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment