Neck pain problems
-
హెల్త్: మెడనొప్పికి అసలు కారణాలేంటో తెలుసా!?
సాధారణంగా టీనేజర్లలో మెడనొప్పి, నడుమునొప్పి లాంటి మధ్యవయస్కులకు వచ్చే ఆరోగ్య సమస్యలు అంతగా కనిపించకపోవచ్చుగానీ.. అవి రాకపోవడం అంటూ ఉండదు. ఆ వయసులో వారికుండే కొన్ని రకాల లైఫ్‌స్టైల్ అలవాట్లూ, ఇబ్బందులే అందుకు కారణం. ఉదాహరణకు.. వారు స్కూళ్లూ/కాలేజీలలో చాలాసేపు అదేపనిగా కూర్చునే ఉండటం, సరైన పోశ్చర్‌లో కూర్చోకపోవడం, బల్ల మీద ఉన్న కంప్యూటర్‌కూ, కుర్చీకీ మధ్య తగినంత దూరం లేకపోవడం లాంటి ఎన్నో అంశాల కారణంగా వాళ్లకూ మెడనొప్పి రావచ్చు. అలవాట్లే కాకుండా.. ఆరోగ్య సమస్యల విషయానికొస్తే.. థైరాయిడ్ లోపాలు, చిన్నతనంలో వచ్చే (టైప్–1) డయాబెటిస్, విటమిన్ లోపాలు, జీవక్రియల్లో లోపాల వల్ల కూడా టీనేజర్లలో మెడనొప్పి వస్తుంటుంది. అలాగే, టీనేజర్లకు ఆ వయసులో కొందరికి వచ్చే స్థూలకాయం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతోనూ రావచ్చు. టీనేజర్లలో మెడనొప్పి నివారణకు చేయాల్సినవి.. పై సమస్యల్లో ఏదైనా కారణమా అని మొదట చూసుకోవాలి. ఉదాహరణకు.. స్కూల్ / కాలేజీలో కూర్చునే చోట.. డెస్క్ తమ ఎత్తుకు తగినట్లుగా ఉందో లేదో, అందుకు తగినట్లుగా పోశ్చర్ ఉందో లేదో పరిశీలించుకోవాలి. కంప్యూటర్లపై పనిచేయడం లేదా వీడియో గేమ్స్ కోసం అదేపనిగా మెడను నిక్కించి ఉంచడం వల్ల ఆ భాగంలోని వెన్నుపూస ఎముకలూ, మెడ కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. పోశ్చర్ సరిగా లేనప్పుడు / కూర్చున్నప్పుడు వెన్నుతో పాటు, దేహంలోని కండరాల మీద పడాల్సిన విధంగా కాకుండా.. ఒక్కోచోట ఎక్కువ ఒత్తిడి పడటం, మరికొన్ని చోట్ల సరిగా పడకపోవడం వంటి సమస్యలతో మెడనొప్పి, వెన్నునొప్పి రావచ్చు. అందుకే స్కూల్లో/కాలేజీలో లేదా ఇంట్లో చదువుల బల్ల / కంప్యూటర్ టేబుల్ వద్ద సరిగా (సరైన పోశ్చర్‌లో) కూర్చుండేలా చూడాలి. వెన్నుపై సమాన భారం పడేలా నిటారుగా ఉండాలి. ఏదో ఒక వైపునకు ఒంగిపోకూడదు. స్థూలకాయం ఉన్న టీనేజీ పిల్లల్లో మెడనొప్పి సమస్య ఎక్కువ. అందువల్ల ఒబేసిటీని పెంచే జంక్‌ఫుడ్ /బేకరీ ఐటమ్స్ లాంటివి కాకుండా టీనేజర్లకు అన్ని పోషకాలూ, విటమిన్లు అందేలా సమతులాహారం ఇవ్వాలి. గతంలో టీనేజీ పిల్లలు వారి వయసుకు తగ్గట్లు బాగానే ఆటలాడేవారు. కానీ ఇటీవల వారు ఆటలాడటం తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత అరుదుగా ఆడే ఆటలూ పూర్తిగా కరవైపోయాయి. దాంతో వెన్ను, దాని ఇతర ఎముకలకు తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల కూడా మెడనొప్పి రావడం ఇటీవల పెరిగింది. తగినంత వ్యాయామం లేని టీనేజర్లు.. తమ దేహ శ్రమతో తమ సామర్థ్యం (స్టామినా) పెంచుకోకపోవడం వల్ల త్వరగా అలసిపోతుంటారు. వారి మెడ భాగపు కండరాలూ, అక్కడి వెన్నుపూసల సామర్థ్యం కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకే పిల్లలు తగినంత వ్యాయామం చేయడం / ఆటలాడటం ద్వారా స్టామినా పెంచుకుంటే మెడనొప్పి వంటి సమస్యలూ తగ్గిపోతాయి. పిల్లల్లో విటమిన్–డి లోపం వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. అంతేకాదు.. వ్యాధి నిరోధకత తగ్గి.. వయసు పెరిగే క్రమంలో డయాబెటిస్, క్యాన్సర్ వ్యాధుల రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే టీనేజీ పిల్లలు ఆరుబయట ఆడేలా చూడాలి. ఇవి చదవండి: హెల్త్: నిద్రలేమి సమస్యా? అయితే ఇలా చేయండి! -
మెడ పట్టేసిందా?ఈ చిట్కాలు పాలో అవ్వండి!
మెడ ఎందుకు పట్టేస్తుందో, భరించలేని నొప్పి ఎందుకు వస్తుందో ఒక్కోసారి సరిగ్గా గుర్తించలేం. రోజంతా టీవీ చూడటం, ల్యాప్‌టాప్, కంప్యూటర్లు వాడకం, గంటల తరబడి స్మార్ట్ ఫోన్‌ను చూస్తూ ఉండటంవల్లగానీ, వ్యాయామం చేస్తున్నప్పుడు గానీ, రాత్రిపూట నిద్ర పోయేటపుడు భంగిమలో తేడా తదితర కారణాలతో మెడ నొప్పి బాధిస్తుంది. ♦ నిద్ర లేచిన తర్వాత మీకు మెడ నొప్పిగా అనిపిస్తే.. నొప్పి ప్రభావిత ప్రాంతాల్లో ఐస్ ప్యాక్ లేదే చల్లని నీటిలో నింపిన క్లాత్ ను వేసి అద్దాలి. అలా చేయడం వల్ల మెడ కండరాల వాపు తగ్గుతుంది. దీంతోపాటు హీట్ ప్యాక్ ను ఉపయోగించవచ్చు. ఇది కూడా మెడ కండరాల నొప్పిని తగ్గిస్తుంది. ♦ మెడ నొప్పిగా ఉన్న వాళ్లు చేతులతో మెడను నెమ్మదిగా మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల కండరాలు సర్దుకొని నొప్పి తగ్గే అవకాశం ఉంది. ♦ మసాజ్ చేసే సమయంలో కొబ్బరి లేదా నువ్వుల నూనె ఉపయోగిస్తే మేలు జరుగుతోంది. మెడ నొప్పిని నివారించేందుకు మీరు రాత్రిళ్లు బోర్లా పడుకోకుండా ఉంటే చాలు. ♦ కొన్ని రకాల యోగా ద్వారా కూడా మెడనొప్పిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా క్లాక్ వైజ్,యాంటి క్లాక్‌వైజ్ దిశలో మెడను మెల్లిగా సున్నాలాగా చుడుతూ చేసే వ్యాయామం మంచి ఫలితాలనిస్తుంది. ♦ మొబైల్ ఫోన్ల వల్ల వచ్చే నొప్పిని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు. దీనికి ఆక్యుపంక్చర్ థెరపీ ద్వారా ఉపశమనం పొందవచ్చు. చాలా సందర్భాలలో, నొప్పికి కారణం తెలియదు. దానికదే మెల్లిగా నెమ్మదిస్తుంది. కొన్నిసార్లు ఇది వారం లేదా రెండు వారాల్లో తగ్గుతుంది. చిట్కాలతో కూడా మెడనొప్పి తగ్గకుండా వేధిస్తూ ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి. సరైన చికిత్స తీసుకోవాలి. మూడు నెలల కంటే ఎక్కువ కాలంపాటు వేధించే మెడ నొప్పికి అంతర్లీనంగా మరికొన్ని కారణాలు కూడా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
తరచూ మెడ, భుజం నొప్పి వస్తుందా ? ఇలా చేయండి..
Possible Causes of Neck and Shoulder Pain: సెల్‌ఫోన్ ఎక్కువగా చూడటం, ముఖ్యంగా సిస్టమ్ మీద ఎక్కువగా పని చేయడం వల్ల వస్తున్న సమస్యలలో మెడనొప్పి, భుజం నొప్పి ముఖ్యమైనవి. వీటితో బాధపడుతూ హాస్పిటల్‌కు వెళ్లాలనుకునే వారు ముందుగా ఈ విధంగా ప్రయత్నించి చూడండి. మెడనొప్పితో బాధ పడుతూ ఉంటే మీరు చెయ్యవలసిన మొదటి పని తలను ముందుకు వంచకుండా ఉండడం. తల ఎత్తుకుని తిరగడం మొదలు పెట్టాలి. పడుకునేటపుడు తల దిండుకు బదులు గుండ్రంగా చుట్టిన పలుచటి దుప్పటి లేదా టవల్ మెడ కింద పెట్టుకోండి. స్మార్ట్ ఫోన్లో వాట్సప్ మెస్సేజ్‌లు చూసేటప్పుడు తలను ముందుకు వంచడం మానండి. చెయ్యవలసిన ఎక్సర్సైజ్లు ►రెండు చేతులనూ ముందుకు చాపి వేళ్ళను మాత్రమే ముడిచి తెరుస్తూ ఉండండి. ముడిచినపుడు వేళ్ళు కణుపుల వరకూ మాత్రమే ముయ్యాలి. తెరిచినపుడు వేళ్ళ మధ్య ఖాళీలు ఎక్కువ ఉండేటట్టు తెరవాలి. ఊపిరిని పీలుస్తూ తెరవండి. విడుస్తూ ముయ్యండి. ►తరువాత మీ చేతి బొటన వేళ్ళను లోపలి పెట్టి దానిపై మిగిలిన వేళ్ళతో వత్తిడి కలిగిస్తూ్త గుప్పిళ్ళను ముయ్యాలి. ఊపిరి పీలుస్తూ గుప్పిళ్ళను తెరవాలి. ►చేతులను భుజాల వరకు చాపి ఉంచి మోచేతి వద్ద మడుస్తూ అరచేతులు భుజాల వద్ద పెట్టాలి. మళ్ళీ చేతులను చాపాలి. ఇలా చెయ్యడం వలన మోచేతి జాయింట్ ఫ్లెక్సిబుల్ గా తయారవడమే కాదు. చేతులలోకి రక్త ప్రసరణ బాగా జరిగి స్పొండిలోసిస్ వలన కలిగే మొద్దుబారడం తగ్గుతుంది. చేతి వేళ్ళను దగ్గరగా చేర్చి, భుజాలపై పెట్టుకుని మోచేతులతో పెద్ద సున్నాలు చుట్టండి. వెనుకకు వెళ్ళేటపుడు బాగా దూరంగా ఉండేలా, ముందుకు వచ్చినపుడు చాతీ దగ్గర మోచేతులు కలిసిపోయేలా ఈ సున్నాలు చుట్టాలి. చదవండి: Covid Taste Test: తెలుసా..! కాఫీతో కోవిడ్ టెస్ట్ చేయొచ్చు... ఎలాగంటే.. ►అర చేతులను మోకాళ్ళపై పెట్టుకుని, భుజాలను గుండ్రంగా ముందుకు సున్నాలు చుట్టండి. తరువాత వెనుకకు చుట్టండి. ఇది భుజాల నొప్పులను పోగొడుతుంది. ►రెండు చేతులనూ పైకి ఎత్తి, కుడి చేత్తో ఎడమ చేయి మణికట్టు వద్ద ఎడమ చే తితో కుడి మణికట్టు వద్ద పట్టుకుని, చేతులను తల వెనుక వైపుకు తీసుకు వెళ్లి, ఎడమ చేతిని దిగువకు లాగుతూ, కుడి మోచేయి తల పై భాగం లోకి వచ్చేలా చేసి తలతో చేతులను వెనుకకు నెట్టండి. ఇది ఫ్రోజెన్ షోల్డర్‌కి కూడా పనిచేస్తుంది. రివర్స్‌లో కూడా చెయ్యండి. ►అరచేతి వేళ్ళను ఇంటర్ లాక్ చేసి, తల వెనుకగా పెట్టి చేతులతో తలను ముందుకు నెడుతూ తలతో చేతులను వెనుకకు నెట్టండి. ఇపుడు చేతులను ముందు నుదురు మీద పెట్టి, వెనుకకు ప్రెషర్ ఇవ్వండి. అలాగే ఎడమ చేతిని ఎడం వైపు కణత మీద పెట్టి కుడి వైపుకు ప్రెషర్ ఇవ్వండి. అనంతరం కుడి చేతిని కుడి కణత మీద పెట్టి ఎడమ చేతి వేపు నెట్టండి. తలతో రెసిస్ట్ చెయ్యండి. ►ఊపిరి పీలుస్తూ తలను కుడి వైపుకు తిప్పి గడ్డం కుడి భుజాన్ని తాకేలా ఊపిరి విడుస్తూ ముందుకు తీసుకు రండి. ఎంత తిప్పగలిగితే అంత తిప్పండి. అలాగే ఎడమ వైపుకు కూడా చెయ్యండి. కానీ కిందకు మాత్రం చెయ్యకూడదు. ►కళ్ళను గుండ్రంగా తిప్పండి. పైకి, కుడికీ, దిగువకూ, ఎడమ వైపుకూ ..తిరిగి రివర్స్‌లో తిప్పండి. ఈ వ్యాయామాలు మెడనొప్పిని తగ్గించడంలో చాలా ప్రయోజనకరమైనవి. చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో.. -
నిద్రలో మెడ పట్టుకుందా?.. అయితే ఇటో లుక్కేయండి
నిద్రలో మెడపట్టుకోవడం / మెడ ఇరుకుపట్టేయడం చాలా సాధారణంగా కనిపించే సమస్య. దీనితో వచ్చే మెడనొప్పిని తగ్గించుకోవడం కోసం హీట్‌ప్యాక్ (వేడికాపడం) తర్వాత కోల్డ్ప్యాక్ (ఐస్‌ముక్కలు టవల్లో చుట్టు కాపడంలా పెట్టడం) కొంతకొంత వ్యవధిలో చేస్తుండాలి. ఇలా మెడలు పట్టేసిన చోటగానీ లేదా మరేచోటనైనా ఒకవేళ నొప్పితో పాటు ఆ ప్రదేశం ఎర్రబారడం, వాపు కనిపిస్తే వేడికాపడం కంటే కోల్డ్ ప్యాక్ చాలా ప్రభావపూర్వకంగా పనిచేస్తుంది. ఇలా హీట్‌ప్యాక్, ఐస్ప్యాక్లను మార్చి మార్చి ఇస్తూ... మధ్యమధ్యన నొప్పి రానంతమేరకు మెడను నెమ్మదిగా పక్కలకు, వెనక్కు వంచాలి. కానీ ముందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ వంచవద్దు. కూర్చున్నా, నిల్చున్నా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మెడను నిటారుగా ఉంచాలి. ఇలా మెడనొప్పిగా ఉన్నప్పుడు మెడ ను గుండ్రంగా తిప్పవద్దు. -
నొప్పి మెడ నుంచి చేతులకు పాకుతోంది..?
నా వయసు 53 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియోలో నా సమస్యకు పూర్తి పరిష్కారం ఉందా? – ఎన్. ఆంజనేయరెడ్డి, కర్నూలు మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తి రీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురుకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ∙నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
వెన్నునొప్పి ముదిరితే మిగిలేది వైకల్యమే
కొన్ని వ్యాధులు ప్రాణాలేమీ తీయకపోవచ్చు కానీ, శరీరాన్ని ఎందుకూ పనికిరానంత నిర్జీవంగా మార్చివేస్తాయి. వెన్నునొప్పి, సయాటికా, మెడనొప్పి సమస్యలు కూడా ప్రాణాలేమీ తీయవు. కానీ జీవితాన్ని నరక తుల్యం చేస్తాయి. సమస్యను ముందే గుర్తించి వైద్య చికి త్సలు తీసుకుంటే వెన్నునొప్పి తగ్గడమే కాదు జీవితం పునః శక్తిని పొందుతుంది. ఈ ప్రయోజనాలన్నీ సకాలంలో నెరవేరేది కేరళ ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సల వల్లే అంటున్నారు ఆయుర్వేద వైద్యులు పి.కృష్ణప్రసాద్. వెన్నునొప్పి, జలుబు అంతే సామాన్యంగా అనిపిస్తాయి. కానీ ఒక దశలో భరించలేని నొప్పి కలిగిస్తుంది. పక్షవాతంలా జీవితాన్ని కుప్పకూల్చివేస్తుంది. ఈ వెన్నునొప్పి శరీరాన్ని కుంటుపడేలా చేయడమే కాదు మొత్తం జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. పైగా ఈ సమస్యలు ఏదో 5 - 10 నిమిషాలు వచ్చి తగ్గిపోయేవి కూడా కాదు. ఏళ్ల పర్యంతం మంచాన పడి ఉండేలా చేస్తాయి. వెన్నునొప్పి కండరాల మీదో, వెన్ను మీదో కాదు మొత్తం శరీర వ్యవస్థ మీదే దుష్ర్పభావం కలిగేలా చేస్తుంది. మూలస్తంభం లాంటి వెన్నెముక దెబ్బతినే ఈ సమస్య మనిషిని ఇంటాబైటా ఏ పనికీ కొరగాకుండా చేస్తుంది. సమస్యలు ఒకటా రెండా...? వెన్నెముక అనేది పవర్ హౌస్ లాంటిది. ఇది కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడ వీటన్నింటినీ స్థిరంగా నిలబడేలా చేస్తుంది. పలు కారణాల వల్ల ఒక్కోసారి ఈ పవర్‌హౌస్ శక్తిహీనంగా మారుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్సలేవీ అందకపోతే భుజం నొప్పులు, మెడ నొప్పులు, కాళ్ల నొప్పులు మొదలౌతాయి. వెన్నుభాగంలో మొద్దుబారినట్లు, బలహీన పడినట్లు, చురకలు, పోట్లు, మంటలు మొదలౌతాయి. జీర్ణ వ్యవస్థలో పలు సమస్యలు తలెత్తడంతో పాటు సమస్య ఇంకా అలాగే కొనసాగితే కొన్ని లైంగిక సమస్యలు సైతం ఉత్పన్నమవుతాయి. ఎవరికైనా వెన్నుపూసలోని డిస్క్‌లు, నరాలు ఒత్తిడికి గురైతే కాళ్లు, చేతులు పక్షవాతానికి కూడా గురవుతాయి. సర్జరీతో ఒరిగేదేమిటి...? వెన్నునొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడితే... అప్పటికి నొప్పి నుంచి ఉపశమనం మాత్రమే పొందవచ్చు. కానీ నొప్పి రావడానికి గల కారణాలను మాత్రం తగ్గించలేదు. పెయిన్ కిల్లర్స్ వల్ల తలనొప్పి, కడుపుబ్బరం, లివర్ దెబ్బతినడం, కిడ్నీలు దెబ్బతినడం వంటి సమస్యల బారిన పడ డం జరగవచ్చు. సర్జరీ దాకా వెళితే పెద్ద మొత్తంలో ఖర్చు అవడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం ఏమీ ఉండదు. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందంటే.. అదీ చెప్పలేం. ఆ తరువాత మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు. ఆయుర్వేదం ఏం చేస్తుంది...? ముందుగా వెన్నునొప్పి రావడానికి గల ఆ ప్రత్యేక కారణాన్ని సమూలంగా ఆయుర్వేదం.. ముందు కనిబెడుతుంది. ఆిస్థిధాతుక్షయం, మార్గావరోధాల వల్లే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ వాతమే వెన్నునొప్పికి, కాలంతా పాకే సయాటికా నొప్పికి మూలం అవుతుంది. అందుకే ధాతుక్షయాన్ని, మార్గావరోధాన్ని నివరించే చికిత్సలకు ఆయుర్వేదం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. చికిత్స క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాలను సమస్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అదే సమయంలో నరాల వ్యవస్థను కూడా బ్యాలన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నొప్పిని తగ్గించడమే కాదు.. మరోసారి ఆ నొప్పి రాకుండా చేస్తుంది. ఈ చికిత్సలో మర్మచికిత్సలు, పంచకర్మ చికిత్సల ద్వారా వెన్నునొప్పికి మూలకారణాన్ని కనుగొని దాన్ని సమూలంగా తగ్గించివేస్తుంది. అందుకే కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా మీ వెన్నెముకను కాపాడుకోండి. అది జీవితాంతం మిమ్మల్ని కాపాడుతుంది. అడ్రస్ శ్రీ చరక, కేరళ ఆయుర్వేద వైద్యశాల, డాక్టర్ పి.కృష్ణప్రసాద్ ఎండీ., ఆయుర్వేద, ఫ్లాట్ నంబర్ 225/1, బిసైడ్: ఎస్బీహెచ్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్‌నెంబర్ 17. వివరాలకు.. Ph: 040 - 65986352 9030013688, 9440213688 e-mail: krishnaprasad.6600@gmail.com