వెన్నునొప్పి ముదిరితే మిగిలేది వైకల్యమే
కొన్ని వ్యాధులు ప్రాణాలేమీ తీయకపోవచ్చు కానీ, శరీరాన్ని ఎందుకూ పనికిరానంత నిర్జీవంగా మార్చివేస్తాయి. వెన్నునొప్పి, సయాటికా, మెడనొప్పి సమస్యలు కూడా ప్రాణాలేమీ తీయవు. కానీ జీవితాన్ని నరక తుల్యం చేస్తాయి. సమస్యను ముందే గుర్తించి వైద్య చికి త్సలు తీసుకుంటే వెన్నునొప్పి తగ్గడమే కాదు జీవితం పునః శక్తిని పొందుతుంది. ఈ ప్రయోజనాలన్నీ సకాలంలో నెరవేరేది కేరళ ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సల వల్లే అంటున్నారు ఆయుర్వేద వైద్యులు పి.కృష్ణప్రసాద్. వెన్నునొప్పి, జలుబు అంతే సామాన్యంగా అనిపిస్తాయి. కానీ ఒక దశలో భరించలేని నొప్పి కలిగిస్తుంది. పక్షవాతంలా జీవితాన్ని కుప్పకూల్చివేస్తుంది. ఈ వెన్నునొప్పి శరీరాన్ని కుంటుపడేలా చేయడమే కాదు మొత్తం జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. పైగా ఈ సమస్యలు ఏదో 5 - 10 నిమిషాలు వచ్చి తగ్గిపోయేవి కూడా కాదు. ఏళ్ల పర్యంతం మంచాన పడి ఉండేలా చేస్తాయి. వెన్నునొప్పి కండరాల మీదో, వెన్ను మీదో కాదు మొత్తం శరీర వ్యవస్థ మీదే దుష్ర్పభావం కలిగేలా చేస్తుంది. మూలస్తంభం లాంటి వెన్నెముక దెబ్బతినే ఈ సమస్య మనిషిని ఇంటాబైటా ఏ పనికీ కొరగాకుండా చేస్తుంది.
సమస్యలు ఒకటా రెండా...?
వెన్నెముక అనేది పవర్ హౌస్ లాంటిది. ఇది కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడ వీటన్నింటినీ స్థిరంగా నిలబడేలా చేస్తుంది. పలు కారణాల వల్ల ఒక్కోసారి ఈ పవర్‌హౌస్ శక్తిహీనంగా మారుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్సలేవీ అందకపోతే భుజం నొప్పులు, మెడ నొప్పులు, కాళ్ల నొప్పులు మొదలౌతాయి. వెన్నుభాగంలో మొద్దుబారినట్లు, బలహీన పడినట్లు, చురకలు, పోట్లు, మంటలు మొదలౌతాయి. జీర్ణ వ్యవస్థలో పలు సమస్యలు తలెత్తడంతో పాటు సమస్య ఇంకా అలాగే కొనసాగితే కొన్ని లైంగిక సమస్యలు సైతం ఉత్పన్నమవుతాయి. ఎవరికైనా వెన్నుపూసలోని డిస్క్‌లు, నరాలు ఒత్తిడికి గురైతే కాళ్లు, చేతులు పక్షవాతానికి కూడా గురవుతాయి.
సర్జరీతో ఒరిగేదేమిటి...?
వెన్నునొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడితే... అప్పటికి నొప్పి నుంచి ఉపశమనం మాత్రమే పొందవచ్చు. కానీ నొప్పి రావడానికి గల కారణాలను మాత్రం తగ్గించలేదు. పెయిన్ కిల్లర్స్ వల్ల తలనొప్పి, కడుపుబ్బరం, లివర్ దెబ్బతినడం, కిడ్నీలు దెబ్బతినడం వంటి సమస్యల
బారిన పడ డం జరగవచ్చు. సర్జరీ దాకా వెళితే పెద్ద మొత్తంలో ఖర్చు అవడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం ఏమీ ఉండదు. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందంటే.. అదీ చెప్పలేం. ఆ తరువాత మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు.
ఆయుర్వేదం ఏం చేస్తుంది...?
ముందుగా వెన్నునొప్పి రావడానికి గల ఆ ప్రత్యేక కారణాన్ని సమూలంగా ఆయుర్వేదం.. ముందు కనిబెడుతుంది. ఆిస్థిధాతుక్షయం, మార్గావరోధాల వల్లే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ వాతమే వెన్నునొప్పికి, కాలంతా పాకే సయాటికా నొప్పికి మూలం అవుతుంది.
అందుకే ధాతుక్షయాన్ని, మార్గావరోధాన్ని నివరించే చికిత్సలకు ఆయుర్వేదం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. చికిత్స క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాలను సమస్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అదే సమయంలో నరాల వ్యవస్థను కూడా బ్యాలన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నొప్పిని తగ్గించడమే కాదు.. మరోసారి ఆ నొప్పి రాకుండా చేస్తుంది. ఈ చికిత్సలో మర్మచికిత్సలు, పంచకర్మ చికిత్సల ద్వారా వెన్నునొప్పికి మూలకారణాన్ని కనుగొని దాన్ని సమూలంగా తగ్గించివేస్తుంది. అందుకే కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా మీ వెన్నెముకను కాపాడుకోండి. అది జీవితాంతం మిమ్మల్ని కాపాడుతుంది.
అడ్రస్
శ్రీ చరక, కేరళ ఆయుర్వేద వైద్యశాల,
డాక్టర్ పి.కృష్ణప్రసాద్ ఎండీ., ఆయుర్వేద,
ఫ్లాట్ నంబర్ 225/1, బిసైడ్: ఎస్‌బీహెచ్,
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్‌నెంబర్ 17.
వివరాలకు..
Ph: 040 - 65986352
9030013688, 9440213688
e-mail:
krishnaprasad.6600@gmail.com