కార్బన్‌డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి గ్రీన్‌హౌజ్ వాయువుల కారణంగా భూమి వేడెక్కుతోంది. రోజురోజుకూ వాతావరణం కలుషితమవుతోంది.
వాషింగ్టన్: కార్బన్‌డయాకై ్సడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి గ్రీన్‌హౌజ్ వాయువుల కారణంగా భూమి వేడెక్కుతోంది. రోజురోజుకూ వాతావరణం కలుషితమవుతోంది. ఇందులో సిమెంట్, కాంక్రీట్ తయారీలో వెలువడే కాలుష్యమే 5 శాతానికి పైగా ఉంటోంది. అదే పర్యావరణానికి హాని చేయని బయో కాంక్రీట్‌ను తయారు చేయగలిగితే..! ఈ ఆలోచనతో అమెరికాకు చెందిన ఎడిన్‌బర్గ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ విద్యార్థి పీటర్ ట్రింబుల్.. ఇసుక, మూత్రం, బ్యాక్టీరియాతో బయో కాంక్రీట్‌ను తయారుచేసే పరికరాన్ని రూపొందించారు. ‘డ్యూప్’గా పేర్కొంటున్న ఈ పరికరంలో ముందుగా తయారుచేసుకున్న అచ్చుల్లో ఇసుకను నింపుతారు. దానికి ‘బాసిల్లస్ పేస్టెరురి’ అనే బ్యాక్టీరియాను చేర్చి ఒక రాత్రంతా ఉంచుతారు.
తర్వాత మూత్రాన్ని, కాల్షియం క్లోరైడ్‌ను దానిలో కలుపుతారు. మూత్రంలోని యూరియాను బ్యాక్టీరియా పోషక పదార్థంగా వినియోగించుకుని.. కాల్షియం క్లోరైడ్‌ను కాల్షియం కార్బొనేట్‌గా మారుస్తుంది. కాల్షియం కార్బొనేట్ సిమెంట్‌లాగా పనిచేసి ఇసుక రేణువులను గట్టిగా పట్టి ఉంచడంతో.. మనకు కావాల్సిన అచ్చు రూపంలోగానీ, ఇటుకలుగా గానీ రూపొందుతాయి. అయితే, ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని.. పూర్తి స్థాయిలో అభివద్ధి చేయాల్సి ఉందని పీటర్ పేర్కొన్నారు.