కీళ్లనొప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో మూడు ముఖ్యమైనవి. అవి... ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్. లక్షణాలన్నీ అకస్మాత్తుగా కనిపిస్తూ, అవి చాలా తీవ్రంగా ఉంటూ ప్రస్ఫుటమయ్యే గౌటీ ఆర్థరైటిస్ వివరాలివి...
కారణాలు
మన రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా పేరుకుపోవడం అన్నది గౌటీ ఆర్థరైటిస్‌కు ప్రధాన కారణం. ఈ యూరిక్ యాసిడ్ కీళ్ల మధ్యన స్ఫటికంగా రూపొందడం వల్ల కీళ్లలో కదలిక కలిగినప్పుడు, ఆ స్ఫటికం వల్ల కీలు బాగా నొప్పిపెట్టడం జరుగుతుంది.
ఎవరెవరిలో ఎక్కువ?
స్థూలకాయులు,
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారు,
వేటమాంసం, చేపలు అధికంగా తీసుకునేవారు,
డైయూరిటిక్స్ మందులను ఎక్కువగా వాడేవారు,
మూత్రపిండాల్లో రాళ్లు వచ్చిన వైద్య చరిత్ర ఉన్నవారు... ఈ అందరిలోనూ గౌటీ ఆర్థరైటిస్ కూడా కనిపించే అవకాశాలు ఎక్కువ.
లక్షణాలు
ఉన్నట్టుండి కీళ్లలో తీవ్రమైన నొప్పి
కీలు వాచడం
కీలును ముట్టుకుంటే భరించలేకపోవడం (టెండర్‌నెస్)
కీలు ఎరుపెక్కడం.
ఏయే కీళ్లలో ఎక్కువ?
కాలి బొటన వేలు,
మడమలు
మోకాళ్లు
నిర్ధారణ పరీక్షలు
రక్తపరీక్ష (యూరిక్ యాసిడ్ పాళ్లు)
ఎక్స్-రే (ఇందులో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కనిపిస్తాయి).
ఆహార నియమాలు
సమతులాహారం తీసుకోవడం, సీఫుడ్ (సముద్రపు చేపలు), ఆల్కహాల్, వేటమాంసం తీసుకోకపోవడం అవసరం.
హోమియో చికిత్స
రోగి తాలూకు మానసిక, శారీరక లక్షణాలను, తత్వాన్ని పరిగణనలోకి తీసుకుని, వ్యాధి తీవ్రత ఆధారంగా హోమియో మందులు వాడటం వల్ల ఈ వ్యాధి నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. ఇంకొక ప్రధానమైన అంశం ఏమిటంటే... ఇతర వైద్య విధానాల్లో మందుల వల్ల ప్రతికూల ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) కనిపిస్తాయి. కానీ... హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ కనిపించవు.
డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి.,
హోమియోకేర్ ఇంటర్నేషనల్
గౌటీ ఆర్థరైటిస్
Published Tue, Dec 10 2013 12:35 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM
Advertisement
Advertisement