Dr.M.Srikanth
-
థైరాయిడ్ సమస్యలు
థైరాయిడ్ నుంచి విడుదలైన హార్మోన్లు రక్తప్రవాహంలో కలిసి చాలా కీలకమైన జీవక్రియలను నిర్వహిస్తుంటాయి. ఈ గ్రంథిలో వచ్చే మార్పుల వల్ల థైరాయిడ్ సంబంధిత సమస్యలు వస్తాయి. ప్రస్తుతం జీవనశైలిలో వస్తున్న మార్పులు, ఆహారంలో అసమతుల్యత, శారీరక శ్రమ లోపించడం వంటి కారణాల వల్ల థైరాయిడ్ సమస్య ఇటీవల చాలా ఎక్కువగా వస్తోంది. ఇది ఏ వయసువారికైనా రావచ్చు. అయితే వయసును అనుసరించి కారణాలు మారవచ్చు. థైరాయిడ్ సమస్యను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... 1. హైపోథైరాయిడిజం: ఈ సమస్య ఉన్నప్పుడు జీవక్రియలు సజావుగా జరగడానికి సరిపడ థైరాక్సిన్ హార్మోన్‌ను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేయలేదు. ఫలితంగా అలసట, చర్మం పొడిబారడం, అధికబరువు, స్త్రీలలో నెలసరి సమస్యలు, మగత, మలబద్దకం, చలికి తట్టుకోలేకపోవడం, జుట్టు రాలడం, కీళ్లనొప్పులు, చిరాకు, మతిమరపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2. హైపర్‌థైరాయిడిజం: థైరాయిడ్ గ్రంథి అవసరాన్ని మించి అధికంగా పనిచేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. గుండెదడ, చేతులు-కాళ్లు వణకడం, నిద్రలేమి, ఆందోళన, బరువు తగ్గిపోవడం, వేడిని తట్టుకోలేకపోవడం, ఆకలి పెరగడం, నెలసరి సమస్యలు, కండరాల బలహీనత వంటి లక్షణాలు హైపర్‌థైరాయిడిజంలో కనిపిస్తాయి. థైరాయిడ్ హార్మోన్లు అధికంగా స్రవించడం వల్ల థైరోటాక్సికోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి చాలా నెమ్మదిగా మొదలవుతుంది. కంటి కండరాలు వాచి, కనుగుడ్లు ముందుకు వచ్చినట్లుగా కనిపిస్తే దాన్ని ‘గ్రేవ్స్ డిసీజ్’ అంటారు. కొంతమందికి థైరాయిడ్ గ్రంథి పెద్దదై మెడ భాగంలో వాపు వస్తుంది. దీన్ని గాయిటర్ అంటారు. నిర్ధారణ పరీక్షలు: థైరాయిడ్ సమస్య ఉందా లేదా అని తెలుసుకోడానికి టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఆయా హార్మోన్ల పాళ్లను బట్టి సమస్యను తెలుసుకుంటారు. ఆయా హార్మోన్ల హెచ్చుతగ్గులను బట్టి వ్యాధిని నిర్ధారణ చేస్తారు. రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందేమో అని నిర్ధారణ చేయడానికి థైరాయిడ్ యాంటీబాడీస్ (యాంటీటీపీఓ యాంటీబాడీస్) పరీక్షలు అవసరమవుతాయి. హోమియో వైద్యం: రోగి శారీరక, మానసిక పరిస్థితులు, ఆకలి, నిద్ర, ఆందోళన వంటి అంశాలతో పాటు వంశపారంపర్య ఆరోగ్య చరిత్ర వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని థైరాయిడ్ సమస్యకు మందులను ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
గౌటీ ఆర్థరైటిస్
కీళ్లనొప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో మూడు ముఖ్యమైనవి. అవి... ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్. లక్షణాలన్నీ అకస్మాత్తుగా కనిపిస్తూ, అవి చాలా తీవ్రంగా ఉంటూ ప్రస్ఫుటమయ్యే గౌటీ ఆర్థరైటిస్ వివరాలివి... కారణాలు మన రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా పేరుకుపోవడం అన్నది గౌటీ ఆర్థరైటిస్‌కు ప్రధాన కారణం. ఈ యూరిక్ యాసిడ్ కీళ్ల మధ్యన స్ఫటికంగా రూపొందడం వల్ల కీళ్లలో కదలిక కలిగినప్పుడు, ఆ స్ఫటికం వల్ల కీలు బాగా నొప్పిపెట్టడం జరుగుతుంది. ఎవరెవరిలో ఎక్కువ? స్థూలకాయులు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారు, వేటమాంసం, చేపలు అధికంగా తీసుకునేవారు, డైయూరిటిక్స్ మందులను ఎక్కువగా వాడేవారు, మూత్రపిండాల్లో రాళ్లు వచ్చిన వైద్య చరిత్ర ఉన్నవారు... ఈ అందరిలోనూ గౌటీ ఆర్థరైటిస్ కూడా కనిపించే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు ఉన్నట్టుండి కీళ్లలో తీవ్రమైన నొప్పి కీలు వాచడం కీలును ముట్టుకుంటే భరించలేకపోవడం (టెండర్నెస్) కీలు ఎరుపెక్కడం. ఏయే కీళ్లలో ఎక్కువ? కాలి బొటన వేలు, మడమలు మోకాళ్లు నిర్ధారణ పరీక్షలు రక్తపరీక్ష (యూరిక్ యాసిడ్ పాళ్లు) ఎక్స్-రే (ఇందులో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కనిపిస్తాయి). ఆహార నియమాలు సమతులాహారం తీసుకోవడం, సీఫుడ్ (సముద్రపు చేపలు), ఆల్కహాల్, వేటమాంసం తీసుకోకపోవడం అవసరం. హోమియో చికిత్స రోగి తాలూకు మానసిక, శారీరక లక్షణాలను, తత్వాన్ని పరిగణనలోకి తీసుకుని, వ్యాధి తీవ్రత ఆధారంగా హోమియో మందులు వాడటం వల్ల ఈ వ్యాధి నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. ఇంకొక ప్రధానమైన అంశం ఏమిటంటే... ఇతర వైద్య విధానాల్లో మందుల వల్ల ప్రతికూల ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) కనిపిస్తాయి. కానీ... హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ కనిపించవు. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
ఫ్యాటీలివర్...
కాలేయంలో కొవ్వుపదార్థాలు పేరుకుపోయి, దాని పరిమాణం కూడా పెరగడాన్ని ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ముందుగా ఏ లక్షణాలు బయటపడకపోయినా, యథాలాపంగా ఏవైనా ఆరోగ్యపరీక్షలు చేయిస్తున్నప్పుడు ఇది బయటపడవచ్చు. కారణాలు అధిక బరువు శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరడం శారీరక శ్రమ తక్కువగా ఉండే జీవనశైలి లేదా ఒకేచోట స్థిరంగా కూర్చుని పనిచేసే వృత్తిలో ఉండటం మత్తుపానీయాలు తాగడం డయాబెటిస్... ఈ పరిస్థితుల్లో తనలోకి చేరుకునే అధిక కొవ్వును కాలేయం నియంత్రించలేదు. దాంతో కాలేయంలోని కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. ఫలితంగా కాలేయం సామర్థ్యం తగ్గడం, వాపురావడం, గట్టిదనం రావడం జరగవచ్చు. నిర్ధారణ పరీక్షలు పూర్తి రక్తపరీక్ష (కంప్లీట్ బ్లడ్ పిక్చర్-సీబీపీ) కాలేయ పనితీరు పరీక్ష (లివర్ ఫంక్షన్ టెస్ట్-ఎల్ఎఫ్టీ) సీటీ లివర్ అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డామిన్ లివర్ బయాప్సీ లిపిడ్ ప్రొఫైల్ ఎఫ్బీఎస్, పీఎల్బీఎస్, ఆర్బీఎస్ వంటి పరీక్షలు. నివారణ బరువు పెరగకుండా చూసుకోవడం వ్యాయామం చేయడం పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఆహారంలో కొవ్వులు తగ్గించడం. చికిత్స : దీనికి ప్రత్యేకంగా మందులు ఏమీ ఉండవు. అయితే వ్యాధి వచ్చిన కారణాన్ని కనుగొని ఆ పరిస్థితిని నివారించేలా చికిత్స చేయడం వల్ల ఈ కండిషన్ తగ్గే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ సమస్య కొద్దిగానే ఉంటే దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే దీర్ఘకాలంగా ఉంటే అది ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి కండిషన్లకు దారితీసే ప్రమాదం ఉంటుంది. లక్షణాలను బట్టి ఈ కండిషన్‌కు కార్డస్ మరైనస్, చెలిడోనియమ్, సియోనాంథస్, లైకోపోడియమ్, కాల్కేరియా కార్బ్, మెర్క్‌సాల్, మాగ్‌మూర్, నక్స్‌వామికా, ఫాస్ఫరస్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్