ఫ్యాటీలివర్...
కాలేయంలో కొవ్వుపదార్థాలు పేరుకుపోయి, దాని పరిమాణం కూడా పెరగడాన్ని ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ముందుగా ఏ లక్షణాలు బయటపడకపోయినా, యథాలాపంగా ఏవైనా ఆరోగ్యపరీక్షలు చేయిస్తున్నప్పుడు ఇది బయటపడవచ్చు.
కారణాలు
అధిక బరువు
శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరడం
శారీరక శ్రమ తక్కువగా ఉండే జీవనశైలి లేదా ఒకేచోట స్థిరంగా కూర్చుని పనిచేసే వృత్తిలో ఉండటం
మత్తుపానీయాలు తాగడం
డయాబెటిస్... ఈ పరిస్థితుల్లో తనలోకి చేరుకునే అధిక కొవ్వును కాలేయం నియంత్రించలేదు. దాంతో కాలేయంలోని కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. ఫలితంగా కాలేయం సామర్థ్యం తగ్గడం, వాపురావడం, గట్టిదనం రావడం జరగవచ్చు.
నిర్ధారణ పరీక్షలు
పూర్తి రక్తపరీక్ష (కంప్లీట్ బ్లడ్ పిక్చర్-సీబీపీ)
కాలేయ పనితీరు పరీక్ష (లివర్ ఫంక్షన్ టెస్ట్-ఎల్‌ఎఫ్‌టీ)
సీటీ లివర్
అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డామిన్
లివర్ బయాప్సీ
లిపిడ్ ప్రొఫైల్
ఎఫ్‌బీఎస్, పీఎల్‌బీఎస్, ఆర్‌బీఎస్ వంటి పరీక్షలు.
నివారణ
బరువు పెరగకుండా చూసుకోవడం
వ్యాయామం చేయడం
పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఆహారంలో కొవ్వులు తగ్గించడం.
చికిత్స :
దీనికి ప్రత్యేకంగా మందులు ఏమీ ఉండవు. అయితే వ్యాధి వచ్చిన కారణాన్ని కనుగొని ఆ పరిస్థితిని నివారించేలా చికిత్స చేయడం వల్ల ఈ కండిషన్ తగ్గే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ సమస్య కొద్దిగానే ఉంటే దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే దీర్ఘకాలంగా ఉంటే అది ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి కండిషన్లకు దారితీసే ప్రమాదం ఉంటుంది. లక్షణాలను బట్టి ఈ కండిషన్‌కు కార్డస్ మరైనస్, చెలిడోనియమ్, సియోనాంథస్, లైకోపోడియమ్, కాల్కేరియా కార్బ్, మెర్క్‌సాల్, మాగ్‌మూర్, నక్స్‌వామికా, ఫాస్ఫరస్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది.
డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి.,
హోమియోకేర్ ఇంటర్నేషనల్