Homoeo
-
పీసీఓడీ నయమవుతుందా?
నా భార్య వయసు 33. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా వస్తుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. హోమియోలో చికిత్స ఉందా? – మల్లికార్జునరావు, కాకినాడ గర్భాశయానికి ఇరువైపులా అండాశయాలు ఉంటాయి. ఈ అండాశయాల్లో నీటిబుడగల వంటివి ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓడీ) అంటారు. రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో రెండు అండాశయాల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే ఈ పీసీఓడీ సమస్య ఉన్నవారిలో అండాశయం నుంచి అండం విడుదల కాకుండా, అపరిపక్వమైన అనేక అండాలు నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోతాయి. చూడటానికి ఇవి ముత్యాల్లా కనిపిస్తుంటాయి. ఇలా రెండువైపులా కనిపిస్తుంటే దీన్ని వైద్యపరిభాషలో ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు : నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానంకలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. చికిత్స : హోమియో ప్రక్రియలో సరైన కాన్స్టిట్యూషన్ సిమిలియం విధానంలో హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కాళ్లపై నరాలు ఉబ్బుతున్నాయి నా వయసు 45 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? – శంకరమ్మ, మెదక్ మీకు ఉన్న సమస్య వేరికోస్ వెయిన్స్. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్ వెయిన్స్ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు : ∙ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ∙కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ∙ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు : ∙కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ∙కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ∙చర్మం దళసరిగా మారడం ∙చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం చికిత్స : హోమియోలో ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఐబీఎస్‌కి పరిష్కారం ఉందా? నా వయసు 38 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే ఐబీఎస్ అన్నారు. మందులు వాడినా తగ్గలేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ఎల్. రాజేశ్వరి, విజయవాడ మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే ∙జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ∙జన్యుపరమైన కారణాలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయిలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : ∙పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన, సమర్థమైన మందులు అందుబాటులో ఉన్నాయి. లక్షణాలను బట్టి కాన్స్టిట్యూషనల్ సిమిలియం ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
ఎత్తు పెరగడం ఆగిందా?
పిల్లల్లో ఏదైనా వైద్యపరమైన సమస్య తర్వాత హోమియో కౌన్సెలింగ్ మా బాబు వయసు ఎనిమిదేళ్లు. బరువు పెరగడం లేదు. అలాగే ఎత్తు కూడా పెరగడం లేదు. వాడి వయసులో ఉన్న తోటి పిల్లలతో పోలిస్తే వాడి ఎత్తు చాలా తక్కువ. డాక్టర్ సలహా మేరకు ఎక్స్–రే, స్కల్, చేతుల పొడవు, థైరాయిడ్ పరీక్షలు చేయించాం. అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. ఎత్తు పెరగకపోవడానికి కారణం ఏమిటి? హోమియోలో ఎత్తు పెంచే మందులు ఉన్నాయా? – సుధాకర్‌రావు, కోదాడ ఒక వ్యక్తి తాను ఉండాల్సిన ఎత్తు కంటే తక్కువ ఎత్తు ఉండటాన్ని ‘షార్ట్ సాచ్యుర్’ కండిషన్ అంటారు. ఈ సమస్యతో పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారు ఎక్కువగా బాధపడుతుంటారు. తల్లిదండ్రుల జన్యువుల ప్రకారం ఆరోగ్యకరమైన ఎదుగుదల కలిగి ఉండి, వారు తమ తోటి పిల్లల కంటే తక్కువ ఎత్తు కలిగి ఉంటే అది వారి సాధారణ ఎత్తుగానే భావించాలి. అయితే ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య కారణంగా ఎదగాల్సిన ఎత్తుకు పెరగకపోవడం అన్న విషయాన్ని సమస్యగా పరిగణించాలి. కారణాలు ►పుట్టుకతో సంభవించే గుండెవ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, ఆస్తమా, యుక్తవయసులో వచ్చే కీళ్లనొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులు. ►పెరుగుదల నెమ్మదిగా ఉండటం ►యుక్తవయసు (ప్యూబర్టీ) నెమ్మదిగా రావడం. ► ౖహె పోథైరాయిడ్ సమస్య పుట్టుకకు ముందు నుంచే ఉండటం ► పౌష్టికాహారలోపం ► పెరుగుదలకు కారణమయ్యే హార్మోన్ స్రావం తగ్గడం జాగ్రత్తలు ► సాధారణంగానే తల్లిదండ్రుల ఎత్తు మామూలు ఎత్తు కంటే తక్కువగా ఉండే, వారి జన్యువుల ప్రకారం పిల్లల ఎత్తు కూడా తక్కువగానే ఉంటే దాన్ని సాధారణ ఎత్తుగానే పరిగణించాలి. వారి విషయంలో ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోనవసరం లేదు. అలా కాకుండా... ► పిల్లలు తమ వయసులో ఉన్న ఇతరుల కంటే తక్కువ ఎత్తులో ఉన్నా లేదా పెరగడం ఆగిపోయినా డాక్టర్‌ను సంప్రదించాలి. ►పిల్లల ఎత్తు, బరువు, కాళ్లు, చేతుల నిడివి వంటి కొలతలతో ఏదైనా తేడా ఉండటం, వాటిలో పెరుగుదల సరిగా లేకపోవడం వంటివి జరిగాయని అనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. నిర్ధారణ పరీక్షలు ఎక్స్–రే, సీబీపీ – రక్తపరీక్ష, ఎలక్ట్రొలైట్ లెవెల్స్, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా అని పరిశీలించాల్సి ఉంటుంది. చికిత్స ఈ సమస్యకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. పిల్లల ఎత్తును, బరువును పరిశీలిస్తే బెరైటా కార్బానికా, తుజా ఆక్సిడెంటాలిస్, కాల్కేరియా ఫాస్ఫారికా మొదలైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణ లో ఈ మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ ఇంప్లాంట్‌ను తొలగించాల్సిందే..! అర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 29 ఏళ్లు. ఇటీవల జరిగిన ఒక యాక్సిడెంట్లో నేను బైక్‌పై నుంచి కింద పడ్డాను. అప్పుడు నా మోకాలు కొద్దిగా వాచింది. చాలా నొప్పిగా ఉంది. ఆ కాలిపై ఎంతమాత్రమూ భారం వేయలేకపోతున్నాను. డాక్టర్గారికి చూపిస్తే ఎక్స్‌రే తీశారు. ఫ్రాక్చర్ కాలేదని చెప్పారు. అయినప్పటికీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – సుకుమార్, విజయవాడ ఫ్రాక్చర్ లేనప్పటికీ నొప్పి తగ్గలేదంటున్నారు, అంటే... మీకు బహుశా మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్ యాక్సిడెంట్లలో చాలా సాధారణంగా జరుగుతుంటాయి. లిగమెంట్లు చీరుకుపోవడం వంటి గాయాలు కొన్నిసార్లు ఎక్స్–రేలో కనిపించకపోవచ్చు. దీనికోసం ఎమ్మారై స్కాన్ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఎలాంటి ఫ్రాక్చర్ లేదనే అపోహతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల్లో భవిష్యత్తులో అది మరింత సమస్యాత్మకంగా పరిణమించవచ్చు. వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించండి. నా వయసు 24. కుడి ముంజేయి రెండేళ్ల క్రితం విరిగింది. అప్పుడు శస్త్రచికిత్స చేసి మెటల్ ప్లేట్లు వేసి, స్క్రూలు బిగించారు. ఇప్పుడు మళ్లీ ఇంకో సర్జరీ చేసి లోపల బిగించి ఉన్నవాటిని తొలగించాలని విన్నాను. ఇలా మరో శస్త్రచికిత్స చేయడం తప్పదా? ఆ మెటల్ స్క్రూలను అలాగే ఉంచేసుకుంటే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? ఎందుకంటే మళ్లీ ఆపరేషన్ అంటే భయంగా ఉంది. – నవీన్‌కుమార్, నిజామాబాద్ మీలాంటి ఫ్రాక్చర్ కేసులలో ఇలా రెండు ఆపరేషన్లు చేయక తప్పదు. లోపల అమర్చి ఉన్న లోహపు ప్లేట్లు, స్క్రూలను అలాగే వదిలేస్తే దీర్ఘకాలంలో అవి మరికొన్ని ఇతర సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి వాటిని శస్త్రచికిత్స చేసి తొలగించడమే మేలు. ఇది చాలా సాధారణంగా జరిగే ప్రక్రియే. వృద్ధులలో... ‘శస్త్రచికిత్స వల్ల ఇతరత్రా దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉండవచ్చు’ అనిపించినప్పుడు మాత్రమే మొదటి ఆపరేషన్‌లో అమర్చిన మెటల్ భాగాలను అలాగే వదిలేస్తాం. ఇలాంటి పరిస్థితి అతి కొద్దిమందిలో మాత్రమే ఎదురవుతుంటుంది. ఇక యువకులలో చేతుల పైభాగపు ఎముకల విషయంలో తీవ్రంగా నొప్పి కలిగిస్తుంటే వాటిని అలాగే వదిలేయాల్సి ఉంటుంది. మీరు ముంజేయి అంటున్నారు... కాబట్టి లోపల అమర్చిన ఇంప్లాంట్‌ను తొలగించడమే మంచిది. అలా తొలగించకపోతే వాస్తవ ఎముక మరింత బలహీనపడుతుంది. ఆ స్థితిలో ఆ చేతి మీద ఏ మాత్రం బరువు పడినా విరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ప్లేటును తొలగిస్తారనే శస్త్రచికిత్స విషయంలో ఆందోళన చెందకండి. ధైర్యంగా సర్జరీకి సిద్ధంకండి. డాక్టర్ కె.సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
అలర్జీ సమస్య తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నాకు అలర్జీ సమస్య ఉంది. హోమియోలో దీనికి మందులు ఉన్నాయా. నాకు ఈ సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందా? – రవికుమార్, నిడదవోలు అలర్జీలు, ఆస్తమా అనేవి సాధారణంగా కొందరిలో పుట్టుకతోనే వస్తాయి. మరికొందరికి పెరిగాక వాతావరణంలోని దుమ్మూధూళి సరిపడక రావచ్చు. ఈ తరహా రుగ్మతలను హోమియో వైద్యచికిత్స విధానం ద్వారా తేలిగ్గా తగ్గించవచ్చు. లక్షణాలను బట్టి వాటికి కాన్స్టిట్యూషన్ పద్ధతిలో వాడే మందులివి... యాంట్ టార్ట్: జలుబు, దగ్గు, కొన్నిసార్లు దగ్గుతో కఫం ఉండటం, ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆర్స్ ఆల్బ్: దుమ్ములోకి వెళ్లినప్పుడు తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం, తుమ్ములతో పాటు ముక్కుల నుంచి నీళ్లు కారవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వెన్నుపై పడుకుంటే ఉబ్బసం ఎక్కువవుతుంది. ఈ లక్షణాలు మధ్యరాత్రి ఎక్కువ. హెపార్‌సల్ఫ్: చాలా చలిగా అనిపిస్తుంది. చలిని ఏమాత్రం తట్టుకోలేరు. చల్లని–పొడి వాతావరణంలో ఆస్తమా వస్తుంది. కూర్చుని తలవాల్చి పడుకుంటే ఉపశమనంగా ఉంటుంది. సోరియమ్: ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకుని కూర్చుంటారు. ప్రతి చలికాలంలోనూ ఆయాసం తిరగబెడుతుంటుంది. నేట్రమ్ సల్ఫ్: నేలమాళిగలు, సెలార్స్లోకి ఉండేవాళ్లకు జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కఫం పచ్చరంగులో ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతీని పట్టుకుని దగ్గుతుంటారు. రోడో: వర్షం ముందుగా లక్షణాలు కనిపిస్తూ రోగిలో మార్పులు వస్తుంటే ఈ మందును సూచించవచ్చు. వీళ్లకు మెరుపులంటే భయం ఎక్కువగా ఉంటుంది. మెర్క్‌సాల్: వీళ్లు చాలా నిదానంగా ఉంటారు. ఎవరినీ నమ్మరు. సమాధానాలు సైతం చాలా నింపాదిగా చెబుతారు. గట్టిగా పట్టుదలగా ఉండలేరు. కుడివైపు తిరిగి నిద్రపోలేరు. కఫం పచ్చగా పడుతుంది. పైన పేర్కొన్న మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి వ్యక్తిగత, శారీరక, మానసిక లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులను వాడాలి. వాటిని తగిన పొటెన్సీలో ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే మీరు నిపుణులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ సమస్యను విపులంగా చర్చించి, మీకు తగిన మందును తీసుకోండి. ఛాతీలో మంట... తగ్గేదెలా? గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. నేను చాలా రోజుల నుంచి ఛాతీలో మంటతో బాధపడుతున్నాను. యాంటాసిడ్ సిరప్ తాగినప్పుడు మంట తగ్గుతోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ పరిస్థితి మామూలే. దీన్ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఏం చేయాలి? నాకు తగిన సలహా ఇవ్వగలరు. – జనార్దన్‌రావు, నల్లగొండ మీరు తెలిపిన వివరాలు, లక్షణాలను బట్టి చూస్తే మీరు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యమిది. మీ రోజువారీ జీవనశైలినీ, ఆహారపు అలవాట్లనూ సరిచేసుకుంటే ఈ వ్యాధి చాలావరకు తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య తగ్గడానికి కొన్ని సూచనలివి... n మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించడం n కాఫీ, టీలను పూర్తిగా మానేయడం n పొగతాగే అలవాటు ఉంటే పూర్తిగా మానేయడం, మద్యం అలవాటుకు దూరంగా ఉండటం n బరువు ఎక్కువగా ఉంటే దాన్ని సరైన స్థాయికి తగ్గించడం n భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాస్త సమయం తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి n తలవైపున పడక కొంచెం ఎత్తుగా ఉండేలా అమర్చుకోవాలి. పై సూచనలతో పాటు మీ డాక్టర్ సలహా మీద పీపీఐ డ్రగ్స్ అనే మందులు వాడాలి. అప్పటికే తగ్గకపోతే ఎండోస్కోపీ చేయించుకొని తగిన చికిత్స తీసుకోండి. నాకు ఈమధ్య కొంతకాలంగా కడుపులో నీరు వస్తోంది. కాళ్లవాపులు వస్తున్నాయి. దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. రెండు సమస్యలూ తగ్గిపోయాయి. కానీ కొన్ని రోజుల తర్వాత సమస్య మళ్లీ మొదలైంది. మందులు వాడితే తగ్గుతోంది. నేను దాదాపు ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. దానివల్ల ఈ సమస్య వస్తోందా? నా సమస్య పరిష్కారానికి ఏం చేయాలో తగిన సలహా ఇవ్వగలరు. – చలమయ్య, విజయవాడ సాధారణంగా కిడ్నీలో సమస్య వల్ల కాళ్లలో వాపు కనిపిస్తుంది. కడుపులో నీరు చేరడం కూడా ఉంటుంది. కాలేయం, గుండెజబ్బులు ఉన్నవారిలో కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. మీరు దాదాపు ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటున్నానని చెబుతున్నారు కాబట్టి ఇది ముమ్మాటికీ కాలేయం వల్ల వచ్చిన సమస్యే అయి ఉంటుంది. మీరు ఈ విషయమై ఏవైనా వైద్యపరీక్షలు చేయించుకున్నారా లేదా అన్న సంగతి తెలపలేదు. మీరు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కడుపులోని నీటి పరీక్షలు చేయించుకొని, ఆ రిపోర్టులు తీసుకొని మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు ఆ రిపోర్టుల ఆధారంగా మీ సమస్యను గుర్తించి, మీకు తగిన చికిత్స చేస్తారు. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఒత్తిడితో నిద్ర కరువు
సమస్యకు పరిష్కారం ఉందా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ఈమధ్య రాత్రివేళల్లో నిద్రపట్టడం లేదు. చెమటలు పట్టడం, ఆందోళన, ప్రతి చిన్న విషయానికి ఆతృత పడటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈమధ్యనే అధిక ఒత్తిడిని తట్టుకోలేక నా ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాను. దయచేసి నా ఒత్తిడి తగ్గడానికి హోమియోలో ఏదైనా పరిష్కారం చెప్పండి? – రవి, హైదరాబాద్ ఈ ఆధునిక యుగంలో శారీరక శ్రమ తగ్గి, ఒత్తిడి (స్ట్రెస్) పెరిగింది. శారీరక, మానసిక పరిస్థితిని బట్టి స్ట్రెస్ తీవ్రత, స్ట్రెస్ కలిగించిన ఆయా సందర్భాలు, సమయాలను బట్టి ఒక్కో వ్యక్తిలో వ్యక్తమయ్యే లక్షణాలు ఒక్కోలా ఉంటాయి. ఆకస్మిక అధిక స్ట్రెస్ లేదా దీర్ఘకాలిక స్ట్రెస్ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. మానవ మెదడులో 10 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. ప్రతి కణం... మిగతా కణాలతో అనుసంధానితమై ఉంటుంది. ఒక కణం నుంచి మరో కణానికి సందేశాలు అందుతూ ఉంటాయి. మన ఆవేశ, కావేశాల్లాంటి అనుభూతులను న్యూరోట్రాన్స్మిటర్స్ అదుపు చేస్తాయి. మెదడులోని ఆవేశ కేంద్రంలో ఐదురకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. అధిక ఒత్తిడిని ఎదుర్కోడానికి ఎండార్ఫిన్లు ఎక్కువ పాళ్లలో అవసరమవుతాయి. ఇటీవల చూస్తున్న ప్రధాన రోగాల్లో 80 శాతం స్ట్రెస్ కారణంగానే వస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కారణాలు: ∙తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడి ∙శరీర రోగ రక్షణ వ్యవస్థ బలహీనపడి ఉండటం వల్ల క్యాన్సర్, డయాబెటిస్, రుమాటిజమ్, దీర్ఘకాల వ్యాధుల తీవ్రత పెరుగుతుంది ∙ఆర్థిక సమస్యలు ∙పనిలో ఒత్తిడి ∙దీర్ఘకాలిక ఆందోళన, నిరాశ. లక్షణాలు: ∙ఆవేశంగా ఉండటం, చిన్న చిన్న విషయాలకు కోపం రావడం ∙వికారం, తలతిరగడం ∙ఛాతీనొప్పి, గుండెలో స్పందన వేగం పెరగడం ∙చిరాకు, ఒంటరితనం ∙విరేచనాలు లేదా మలబద్ధకం ∙నిద్రలేకపోవడం చికిత్స: హోమియో విధానంలో చికిత్స చేయడం ద్వారా స్ట్రెస్‌ను సమర్థంగా అదుపులో పెట్టవచ్చు. ఈ స్ట్రెస్‌కు గల కారణాలను పరిశీలించి, రోగి ఎంత స్ట్రెస్‌లో ఉన్నాడు, దాని తీవ్రత ఎంత, రోగి కుటుంబ, సామాజిక, ఆర్థిక స్థితిగతులేమిటి, అతడు పనిచేసే వాతావరణం ఎలా ఉంది... వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు హోమియోలో యాసిడ్‌ఫాస్, ఇగ్నీషియా, కాకులస్ ఇండికస్, నేట్రమ్మ్యూర్ మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల ఆధ్వర్యంలో వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ ముందుగా గుర్తిస్తే... గుండెపోటును దీటుగా ఎదుర్కోవచ్చు కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. నేనొక మార్కెటింగ్ ఎగ్జిక్యుటివ్‌గా పనిచేస్తున్నాను. నాకు తరచూ ఛాతీలో నొప్పి వస్తోంది. ఈ విషయం స్నేహితులతో చెప్పినప్పుడు... అది గుండెపోటుకు దారితీయవచ్చుననీ, పరీక్షలు చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. గుండెపోటు ఎందుకు వస్తుంది? దానిని ఎలా గుర్తించాలి? – శ్రీధర్, కొత్తగూడెం శరీరంలోని భాగాలన్నింటికీ రక్తం సరఫరా చేసే పంపింగ్ స్టేషన్ లాంటిది గుండె. కండరాలతో నిర్మితమైన ఈ గుండె సక్రమంగా పనిచేయడానికి దానికి శుద్ధమైన (ఆక్సిజన్‌తో కూడిన) రక్తం నిరంతరం సరఫరా జరుగుతూ ఉండాలి. కరొనరీ ధమనుల ద్వారా దానికి రక్తం అందుతూ ఉంటుంది. ఈ ధమనులకు వ్యాధి సోకితే అవి కుంచించుకుపోయి తగిన పరిమాణంలో శుద్ధమైన రక్తాన్ని సరఫరా చేయలేవు. కొవ్వు – క్యాల్షియమ్ – ప్రోటీన్ అణువులు రక్తనాళాల లోపలి గోడలపై పాచిలాగా పేరుకుపోవడం వల్ల ఈ రక్తనాళాలు కుంచించుకుపోతాయి. అలా ధమని పూర్తిగా మూసుకుపోయిన పక్షంలో దాని ద్వారా రక్తం సరఫరా కావాల్సిన గుండె కండరాలకు పోషకాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఫలితంగా గుండెకండరాలు చచ్చుబడిపోతాయి. దాంతో గుండెపోటు వస్తుంది. సాధారణంగా గుండెపోటుకు ఇదే కారణం అయినప్పటికీ కరొనరీ ధమనుల్లో ఏర్పడే తీవ్రమైన సంకోచ వ్యాకోచాలు కూడా గుండెపోటుకు దారితీస్తాయి. ఈ విధంగా సంకోచించిన సమయంలో రక్తనాళాల (ధమనుల) ద్వారా గుండె కండరాలకు జరిగే రక్తసరఫరా చాలా తక్కువ పరిమాణానికి పడిపోవడమో లేదా పూర్తిగా నిలిచిపోవడమో జరుగుతుంది. వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, కరోనరీ ధమనులకు సంబంధించి పెద్దగా సమస్యలు లేని సందర్భంలో కూడా ఇలా జరగవచ్చు. గుండెపోటులో ఈ కింద పేర్కొన్న లక్షణాలు ముందే కనిపిస్తాయి. ఛాతీ–రొమ్ము ఎముక కింద – ఎడమచేతిలో భాగంగా, ఒత్తిడిగా, నొప్పిగా అనిపిస్తుంది ∙ఈ అసౌకర్యం వీపు వైపునకు, దవడలు, చేతి గుండా ఇతర అవయవాలకు వ్యాపిస్తున్నట్లుగా తోస్తుంది ∙కడుపు ఉబ్బరంగా, అజీర్తిగా, ఏదో అడ్డుపడుతున్నట్లుగా అనిపిస్తుంది ∙చెమటలు పట్టడం, వికారం, వాంతి వస్తున్నట్లుగా ఉంటుంది ∙చాలా బలహీనంగా, ఆందోళనగా ఉండి శ్వాస తీసుకోవడం కష్టంగా తోస్తుంది ∙గుండె వేగంగా, అసహజంగా కొట్టుకుంటుంది. ఈ లక్షణాలు దాదాపు 30 నిమిషాల పాటు కనిపిస్తాయి. అందువల్ల ఛాతీలో నొప్పి వస్తే ముందుగా ఆసుపత్రికి వెళ్లి, అది గుండెపోటు కాదని నిర్ధారణ చేసుకోండి. కొంతమందిలో ఈ లక్షణాలు ఏమీ కనిపించకుండా కూడా గుండెపోటు రావచ్చు. దీన్ని సైలెంట్ హార్ట్‌ఎటాక్‌గా పరిగణించవచ్చు. ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్ ఎవరికైనా రావచ్చు. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో ఈ రకమైన గుండెపోటు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. స్పష్టమైన లక్షణాలుతో, వెంటనే గుర్తించడానికి తెలిసిపోయే లక్షణాలతో గుండెలో అసౌకర్యం కలుగుతున్న విషయాన్ని గుర్తించినప్పుడు, తక్షణం ఆ రోగులను ఆసుపత్రికి చేరిస్తే, వారి ప్రాణాలు కాపాడవచ్చు. మన దేశంలో ప్రతి 33 సెకన్లకు ఒకరు గుండెపోటుకు గురవుతున్నారు. ఇలా ఏటా ఇరవై లక్షల మంది హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్నట్లు అంచనా. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల వారితో పోలిస్తే భారతీయులు సగటున పది సంవత్సరాలు ముందుగానే గుండెపోటుకు గురవుతున్నారు. పైగా మన దేశస్తులలో గుండెపోటుకు గురవుతున్నవారిలో చాలా మంది యువకులు, మధ్యవయస్కులే ఎక్కువ. ఇలా స్పష్టమైన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే అన్ని సౌకర్యాలు ఉన్న పెద్దాసుపత్రులకు వెళ్లి, తగిన పరీక్షలు చేయించుకుంటే ఎన్నో ప్రాణాలు అర్థంతరంగా ముగియకుండా కాపాడవచ్చు. డాక్టర్ టి. శశికాంత్ సీనియర్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
తగ్గినా... తిరగబెడుతోంది!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 54 ఏళ్లు. నాకు చాలాకాలంగా తలలో, ముఖం మీద, కనురెప్పల దగ్గర చర్మం ఎర్రటి, తెల్లటి పొరలతో దురదగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సెబోరిక్ డర్మటైటిస్ అని చెప్పారు. మందులు వాడితే అప్పటికి తగ్గినట్లుగా అనిపించినా, మళ్లీ కొంతకాలానికే తిరగబెడుతోంది. అసలు సమస్య ఎందుకు వస్తోంది? హోమియోలో ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి.– సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ చర్మంలో సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉండే భాగాలు ఎర్రగా మారడంతో పాటు, దురదతో ఈ వ్యాధి కనిపిస్తుంటుంది. సాధారణంగా ఇది దీర్ఘకాలిక సమస్య. ఇది 30 నుంచి 70 ఏళ్ల వారితో పాటు మూడు నెలల శిశువులలోనూ కనిపిస్తుంది. వీళ్లలో 6 నుంచి 12 నెల వయసు వరకు ఇది తగ్గిపోతుంటుంది. తలలో వచ్చే తేలికపాటి సెబోరిక్ డర్మటైటిస్‌ని చుండ్రు అని అంటారు. ఇది ఎక్కువ మందిని వేధించే సమస్య. ఈ వ్యాధి ఎక్కువగా తల, ముఖం, ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంటుంది. కారణాలు ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ చర్మంలోని సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉన్న చోట మలసేజియా అనే ఒక రకం జీవజాతి అధికంగా అభివృద్ధి చెంది కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ అంశం సెబోరిక్ డర్మటైటిస్‌ను ప్రేరేపిస్తుంది. రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనూ, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువమానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలు అధికం. వాతావరణం, హార్మోన్ సమస్యలు, కొన్ని జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధిని ప్రభావితం చేయవచ్చు. లక్షణాలు ∙సెబోరిక్ డర్మటైటిస్ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి ∙చర్మంపై ఎర్రటి, తెల్లటి లేదా పసుపు వర్ణంలో పొరలు ఏర్పడతాయి. దురద, మంట కనిపిస్తుంటుంది దీని తీవ్రత సాధారణంగా చలికాలంలో ఎక్కువగానూ, వేసవిలో ఒకింత తక్కువగానూ ఉంటుంది. చిన్నపిల్లల్లో : తలపై చర్మం జిడ్డుగా, పొరలుగా, ఎర్రటి దద్దుర్లలా కనిపిస్తాయి. దీనినే ‘క్రెడిల్ క్యాప్’ అని అంటారు. ఇది చంకలకు, గజ్జలకు వ్యాపిస్తుంది. వీళ్లలో దురద ఎక్కువగా ఉండకపోవచ్చు. నిర్ధారణ : వ్యాధి లక్షణాలను బట్టి దీన్ని గుర్తించవచ్చు. ఇది సోరియాసిస్‌ను పోలి ఉంటుంది. కానీ సోరియాసిన్ ముఖాన్ని ప్రభావితం చేయకపోవడం వల్ల ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించవచ్చు. మీరు ఆందోళన చెందకండి. ఆధునిక జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని సరిచేయడం వల్ల సెబోరిక్ డర్మటైటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
సోరియాసిస్ వస్తే ఇక తగ్గదా?!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నేను చాలాకాలంగా శరీరంపై దద్దుర్లు, ఇన్ఫెక్షన్, చర్మం పగిలినట్లుగా కావడం, చర్మంపై పొలుసుల్లా వచ్చి రాలిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే సోరియాసిస్ అని నిర్ధారించారు. ఏవేవో ఆయింట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఈ సమస్య మళ్లీ మళ్లీ కనిపిస్తోంది. అసలీ సమస్య ఎందుకు వస్తుందో తెలియ జేయండి. హోమియోలో దీనికి శాశ్వత పరిష్కారం ఉందా? - వినయ్, కర్నూలు సోరియాసిస్ అనేది దీర్ఘకాలం కనిపించే చర్మవ్యాధి. కానీ అంటువ్యాధి మాత్రం కాదు. ఇది ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తుంది. స్త్రీ పురుషులిద్దరిలోనూ సమానంగా కనిపిస్తుంది. ఈ వ్యాధి వస్తే చర్మం ఎర్రగా మారుతుంది. పొడిబారినట్లుగా అయిపోయి చర్మం పొలుసుల్లా రాలిపోతుంది. దురదలు రావడం, మచ్చలు పడటం కూడా జరుగుతాయి. కారణాలు: సోరియాసిస్‌కు ఇప్పటివరకు కచ్చితమైన కారణం తెలియదు. అయితే కొన్ని అంశాలను కారణాలుగా చెప్పవచ్చు. అవి... మానసిక ఒత్తిడి వంశపారంపర్యం ఆటోఇమ్యూన్ ప్రతిస్పందన జన్యుసంబంధిత లోపాలు. రకాలు: చర్మ కణాలు, చర్మం మీది రంగులను బట్టి సోరియాసిస్‌ను చాలా రకాలుగా విభజించవచ్చు. వాటిలో ముఖ్యమైనవి కొన్ని... ఫ్లేక్ సోరియాసిస్: ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా చర్మం మీద ఎర్రగా పొంగిన కణాలను కలగజేస్తుంది. ఈ ఎర్రటి మచ్చలు తెల్లటి పొలుసులుగా వృద్ధి అవుతాయి. ఇవి ఎక్కువగా తల, మోచేతులు, మోకాళ్లు, గోళ్ల మీద ఏర్పడతాయి. గట్టేట్ సోరియాసిస్: ఇందులో నీటి బొట్ల లాంటి చిన్న చర్మ కంతుల వంటివి ఏర్పడతాయి. ఫిస్టులార్ సోరియాసిస్: దీనిలో తెల్లటి చీము వంటి చిక్కటి పదార్థం కలిగిన బొబ్బలు చర్మంపై కనిపిస్తుంటాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్: ఇది రుమాటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఒక రకమైన కీళ్లకు సంబంధించిన వ్యాధి. దీనిలో సోరియాసిస్‌తో పాటు కీళ్ల నొప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. లక్షణాలు: చర్మం ఎర్రగా మారడం దురద చర్మం గట్టిగా తయారవడం అరికాలు, అరచేయిపై బొబ్బలు ఏర్పడటం గోళ్లు పెళుసుగా తయారయ్యి నల్ల రంగుకు మారడం జరుగుతుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది కీళ్లనొప్పులు దురద ఎక్కువగా ఉన్నప్పుడు గీరగానే చర్మం మీద పుండ్లు పడి రక్తం స్రవించడం కనిపిస్తుంది. సోరియాసిస్‌ను ప్రేరేపించే కారణాలు: సోరియాసిస్ అనేది చికిత్స తీసుకుంటున్నా తగ్గుతూ, మళ్లీ పెరుగుతూ ఇబ్బంది పెడుతుంది. అయితే దీన్ని ప్రేరేపించే కారణాలకు దూరంగా ఉంటే వ్యాధి తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. వాటిల్లో ముఖ్యమైనవి... మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి దుమ్ము ధూళి పెంపుడు జంతువుల వంటి అలర్జీలను కలిగించే కారకాలకు దూరంగా ఉండాలి యాంటీ బయాటిక్స్ వాడినప్పుడు దీని తీవ్రత పెరుగుతుంది. కాబట్టి వాటి వాడకాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలి మద్యం అలవాటును పూర్తిగా మానేయాలి చల్లటి వాతావరణంలో తిరగకుండా ఉండటం మంచిది పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. నిర్ధారణ: రోగి వైద్య చరిత్రను పరిశీలించడం, చర్మాన్ని పరీక్షించడం ద్వారా దీని నిర్ధారణ చేయవచ్చు. వ్యాధిలోని వ్రణాలను బట్టి, చర్మంపై కనిపించే లక్షణాలను బట్టి అది ఏ రకమైన సోరియాసిస్ అని నిర్ధారణ చేయడం జరుగుతుంది. నివారణ: వ్యాయామం చేయడం పరిశుభ్రత పాటించడం పోషకాహారం తీసుకోవడం విశ్రాంతి తీసుకోవడం మంచి ఆహారపు అలవాట్లు మెడిటేషన్ చర్మ సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఇతర ఇన్ఫెక్షన్స్ రాకుండా శుభ్రత పాటించడం చర్మం పొడి బారకుండా ఆయిల్ పూయడం వంటి జాగ్రత్తల ద్వారా నివారించొచ్చు. చికిత్స: సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒక రోగికీ, మరో రోగికీ వ్యాధి తీవ్రతలో, లక్షణాల్లో తేడా ఉంటుంది. హోమియో విధానంలో రోగి అలవాట్లు, వ్యక్తిత్వం, మానసిక స్థితి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని, కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో మందులిస్తారు. హోమియో మందుల ద్వారా పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. మళ్లీ ఇది తిరగబెట్టకుండా కూడా చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం.రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
వెన్నునొప్పి తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్ నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. దీనికి హోమియో ప్రక్రియలో చికిత్స ఉందా? దయచేసి వివరించగలరు. - సుమన్, బాలాపూర్ ఇటీవల వెన్నునొప్పి చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్న చాలా సాధారణమైన సమస్య. వెన్నుపూసలు అరగడం అన్నది ఒకప్పుడు ఒక వయసు పైబడిన వారిలోనే కనిపించేంది. కానీ మారుతున్న జీవనశైలితో పాటు తాము నిర్వహించే వృత్తుల్లో భాగంగా వెన్నుపై భారం పడేలా పనిచేయడం, ఇతర కారణాల వల్ల ఇది చాలా విస్తృతంగా కనిపిస్తోంది. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, ఫేసెట్ జాయింట్లు ఒకదానితో ఒకటి అనుసంధానితమై శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తాయి. మన రోజువారీ జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలను తట్టుకొని నరాల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా కాపాడుకోవడం మన వెన్నెముక ప్రధాన లక్షణం. అధికంగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. మనం ఏ పని చేయాలన్నా ప్రతిక్షణం మెడ, నడుములోని వెన్నుపూసలు పనిచేయాలి. అందుకే ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. వెన్నుపూసలు అరిగినందువల్ల వెన్నునొప్పి వస్తుంది కాబట్టి మందులతో దాన్ని పరిష్కరించలేమనీ, ఆపరేషన్ అవసరమని చాలామందిలో ఒక అపోహ ఉంది. పైగా ఇది జీవితాంతం వేధిస్తూ ఉంటుందని నిస్పృహ కూడా కొందరు పేషెంట్లలో ఉంటుంది. వెన్నునొప్పికి కారణమైన డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. అయితే హోమియోలో ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి కోబాల్ట్ లాంటి ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్‌బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. ఇలాంటి వారికి కూడా యాసిడ్‌ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పులకు ఆస్కులస్ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి చాలా బాగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ అది లూకోడెర్మాకు దారితీయదు పిడియాట్రిక్ కౌన్సెలింగ్ మాకు కొద్దిరోజుల క్రితం పాప పుట్టింది. పాపకు తలలో కొంత మేర వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. ఇదేమైనా భవిష్యత్తులో ల్యూకోడెర్మా వంటి జబ్బుకు దారితీసే ప్రమాదం ఉందా? - రవికుమార్, నందిగామ మీ పాపకు ఉన్న కండిషన్ (లోకలైజ్డ్ ప్యాచ్ ఆఫ్ వైట్ హెయిర్)ను పోలియోసిస్ అంటారు. సాధారణంగా ఇది తల ముందు భాగంలో అంటే నుదుటిపై భాగంలో కనిపిస్తుంటుంది. అయితే మరెక్కడైనా కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. ఇలా ఉందంటే అది ప్రతీసారీ తప్పనిసరిగా ఏదో రుగ్మతకు సూచిక కానక్కర్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని జన్యుపరమైన సమస్యలకు సూచన కావచ్చు. చర్మంలోని పిగ్మెంట్లలో మార్పుల వల్ల కూడా రావచ్చు. కంట్లో పిగ్మెంట్కు సంబంధించిన ఏవైనా మార్పులు ఉన్నాయేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లల్లో ఏదైనా హార్మోనల్ సమస్యలు (అంటే థైరాయిడ్, జననేంద్రియాలకు సంబంధించినవి) ఉండటానికి సూచన కావచ్చు. ఇలాంటి అసోసియేటెడ్ సమస్యలేవీ లేకపోతే మీ పాపకు ఉన్న ఈ లక్షణం... ల్యూకోడెర్మా లాంటి సమస్యకు దారితీసే అవకాశం లేదు. పాపను ఒక్కసారి పీడియాట్రీషియన్‌కు చూపించండి. మీరు రాసినదాన్ని బట్టి పాపకు తక్షణ చికిత్స ఏదీ అవసరం లేదు. మీరూ ఈ విషయంలో ఆందోళన పడకుండా ఒకసారి డాక్టర్‌ను కలిసి ఇతరత్రా ఏ సమస్యలూ లేవని నిర్ధరించుకొని నిశ్చింతగానే ఉండండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ డెంగ్యూ ఫివర్ కౌన్సెలింగ్ ప్లేట్లెట్స్ తగ్గితే..? ఈ మధ్య మా బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. రక్తపరీక్షలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం చూసి, మా డాక్టర్ డెంగ్యూ కావచ్చని అనుమానించారు. అసలు డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఏమిటి, దాని వివరాలు చెప్పండి. - సుగుణకుమారి, విశాఖపట్నం మీ డాక్టర్ చెప్పినట్లుగా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం డెంగ్యూ వ్యాధిలోని ఒక లక్షణం. వైరల్ జ్వరాల్లో డెంగ్యూ కూడా ఒక రకం జ్వరం. ఈ వ్యాధికి ఆర్బోవైరస్ అనే జాతికి చెందిన సూక్ష్మజీవి ఒక కారణం. ఈ వైరస్ అతి సూక్ష్మమైనది. కంటికి కనిపించదు. ఈ వైరస్ ఏడిస్ ఈజిప్టై జాతి దోమ ద్వారా రోగగ్రస్తుల నుంచి ఆరోగ్యవంతులకు సంక్రమిస్తుంది. దీన్ని వ్యాప్తి చేసే దోమను టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమలు సాధారణంగా పగటిపూటే కుడుతుంది. దోమ కుట్టిన తర్వాత ఐదు రోజుల నుంచి ఎనిమిది రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. వాటిలో సాధారణ డెంగ్యూ మామూలుగానే తగ్గిపోతుంది. కానీ డెంగ్యూ హేమరేజిక్ ఫీవర్‌లో అవయవాల్లో అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం ఉన్నందున ఇది ప్రమాదకరమైనది. డెంగ్యూవ్యాధి లక్షణాలు : ఉన్నట్లుండి జ్వరం రావడం తీవ్రమైన తలనొప్పి, ఇది కూడా ఎక్కువగా నొసటిపై వస్తుంది. కంటిలో నొప్పి వచ్చి కన్ను కదిలించినప్పుడు నొప్పి ఎక్కువవుతుంది. కండరాలు, కీళ్లనొప్పి వికారం నోరు ఎండిపోయినట్లుగా అవుతుంది. చాలా ఎక్కువగా దాహం వేస్తుంది. ఇక మీ డాక్టర్ చెప్పినట్లుగా ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల డెంగ్యూ వ్యాధిగా అనుమానిస్తుండవచ్చు. డెంగ్యూ ప్రమాదకరమైనది కాబట్టి సాధారణంగా దాన్ని వ్యాప్తి చేసే దోమలు గుడ్లు పెట్టడానికి అనువైన స్థలాలలో... అంటే ఎయిర్‌కూలర్స్, పూలకుండీల కింద పెట్టే సాసర్లు, ఆరుబయట పారేసి ఉన్న టైర్లు, మూతలు పెట్టని నీరు నిల్వ చేసే తొట్టి వంటివి, నీరు కదలకుండా ఉండే ఫౌంటేన్లు, ఖాళీ డ్రమ్ములు, సన్‌షేడ్‌పై వాన నీరు నిలిచిపోయే బిల్డింగులలో నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ డాక్టర్ చెప్పిన విధంగా మీ బాబుకు చికిత్స చేయించండి. డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీ సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్ -
పెళ్లయి చాలాకాలమైనా ....
పల్మునాలజీ కౌన్సెలింగ్ కుడి వైపున గుండె... లంగ్స్‌లో రంధ్రాలు..? నా వయసు 35 ఏళ్లు. పెళ్లయి చాలాకాలమైనా పిల్లల్లేరు. డాక్టర్ పరీక్షించి నా గుండె కుడివైపు, నా లంగ్స్‌లో రంధ్రాలు ఉన్నట్లు తెలిపారు. నా వీర్యంలో కౌంట్ చాలా తక్కువగా ఉందని చెప్పారు. ఏమిటీ సమస్య? - ఒక సోదరుడు, హైదరాబాద్ మీరు చెబుతున్న అంశాలను బట్టి మీరు ‘కార్టెజెనెర్ సిండ్రోమ్’తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీకు సంక్రమించిన వ్యాధి కూడా ఊపిరితిత్తులకు వచ్చిన అతి అరుదైన వ్యాధి. ఇందులో శరీరంలోని అంతర్గత అవయవాలు తారుమారు కావచ్చు. ఇది రెండు రకాలైన అసాధారణ లక్షణాలతో ఇది కనిపిస్తుంది. మొదటిది... ప్రైమరీ సీలియరీ డైస్కినేసియా, రెండోది సైటస్ ఇన్వర్సస్. మొదటిదైన ప్రైమరీ సీలియరీ డైస్కినేసియా (పీసీడీ)లో ఊపిరితిత్తులను శుభ్రపరిచే సన్నటి వెంట్రుకల్లాంటివి సాధారణంగా ఉండాల్సిన రీతిలో ఉండవు. నిజానికి ఈ సీలియరీ అవయవాలు లంగ్స్, ముక్కు, సైనస్‌లను శుభ్రపరచడానికి ఉపయోగపడే మ్యూకస్ పొరల లైనింగ్. సాధారణంగా ఇవి కాలుష్య పదార్థాలను పై వైపునకు తోసేస్తూ ఉంటాయి. కానీ ప్రైమరీ సీలియరీ డైస్కినేసియా ఉన్నవారిలో ఈ సీలియరీ అవయవాల్లో కదలికలు ఉండవు. ఒకవేళ ఉన్నా అవి చాలా తక్కువగా ఉండటమో, రివర్స్‌లో కదులుతుండటమో జరుగుతుంది. ఉంటాయి. హానిచేసే బ్యాక్టీరియా బయటకు పోకుండా ఊపిరితిత్తుల్లోనే ఉంటూ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ను కలగజేస్తాయి. దాంతో దీర్ఘకాలిక సైనసైటిస్‌తో పాటు ఊపిరితిత్తుల్లో శాశ్వతమైన మార్పులు కలుగుతాయి. ఈ కండిషన్‌ను బ్రాంకియాక్టాసిస్ అంటారు. బ్రాంకియాక్టాసిస్ వల్ల ఎడతెరిపి లేకుండా దగ్గు, తీవ్రమైన అలసట, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇక రెండో అసాధారణత అయిన సైటస్ ఇన్వెర్సస్ ఉన్నవారిలో వారు తల్లి గర్భంలో ఉండగానే అవయవాలు తాము ఉండాల్సిన ప్రదేశంలో ఉండకపోవచ్చు. రివర్స్‌లో ఉండవచ్చు. కార్టజెనెర్ సిండ్రోమ్ ఉన్నవారిలో మూడు ప్రధాన లక్షణాలు కనిపిస్తుంటాయి. అవి దీర్ఘకాలిక సైనసైటిస్, బ్రాంకియాక్టాసిస్, అవయవాలు తమ పొజిషన్ మారే సైటస్ ఇన్వర్సస్. ఈ కండిషన్‌తో పుట్టిన వారికి పెద్దయ్యాక వీర్యకణాల కౌంట్ తక్కువగా ఉండవచ్చు. కొన్ని మందులు, టీకాలు, కార్టికోస్టెరాయిడ్స్‌తో ఈ వ్యాధిగ్రస్తుల్లో కొన్ని దీర్ఘకాలిక సమస్యలను అదుపులో ఉంచవచ్చు. మీరు ఒకసారి ఊపిరితిత్తుల నిపుణులను కలవండి. డా॥రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. గత ఐదేళ్లుగా విరేచనాలు, మలబద్దకం... ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నాను. ఏ టైమ్‌లో విరేచనం అవుతుందో తెలియక బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. ప్రయాణాలు చేయలేకపోతున్నాను. ఎన్నో మందులు వాడాను. హోమియోలో దీనికి చికిత్స ఉందా? - సునీల్‌కుమార్, కందుకూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. పెద్ద పేగుల్లోని అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలగజేసే వ్యాధి ఇది. ఈ సమస్యకు జీర్ణ వ్యవస్థలోని అసలు లోపమే కారణం. జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్లకు గురైన వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వచ్చిన వారికి ఎన్ని పరీక్షలు చేసినా ఫలితాలు చాలా సాధారణంగానే ఉంటాయి. కానీ వ్యాధి తాలూకు బాధలు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి. వరసపెట్టి విపరీతమైన విరేచనాలు లేదంటే అసలు కొంతకాలం విరేచనం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇంతటి ఇబ్బంది అనుభవిస్తున్నా పరీక్షల్లో మాత్రం పేగుల్లో ఎలాంటి తేడా కనిపించదు. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఎప్పుడు విరేచనాలు మొదలవుతాయో ఊహించలేని పరిస్థితి. దాంతో దూరప్రయాణాలు చేయలేరు. ఐబీఎస్ వ్యాధిగ్రస్తులు శక్తిహీనులవుతారు. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి, నిరంతరం ఏదో ఒక వ్యాధికి గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంది. కారణాలు: మానసిక ఒత్తిడి, ఆందోళన సరైన సమయంలో భోజనం చేయకపోవడం మద్యం, పొగతాగడం వంటి దురలవాట్లు ఎక్కువ కాలం కొనసాగుతూ ఉండటం చికాకు, కోపం. లక్షణాలు: మలబద్దకం / విరేచనాలు తరచూ కడుపునొప్పి రావడం కడుపు ఉబ్బరం విరేచనంలో జిగురు పడటం భోజనం చేయగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం. హోమియో చికిత్స: మానసిక ఒత్తిడిని తగ్గించి, పేగుల్లోని అసాధారణ కదలికలను నియంత్రించే ఔషధాలను ఇస్తారు. ఈ సమస్యకు నక్స్‌వామికా, ఆర్సినిక్ ఆల్బ్, అర్జెంటికమ్ నైట్రికమ్, లైకోపోడియం, పల్సటిల్లా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. హోమియోలో వ్యక్తి రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి మందులు నిర్ణయిస్తారు. అవి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
హోమియో డాక్టర్.. అల్లోపతి వైద్యం..!
♦ కన్సల్టెంట్ డాక్టర్ల పేరిట శస్త్రచికిత్సలు చేస్తున్న వైనం ♦ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో బయటపడ్డ మరో మోసం హుస్నాబాద్: అర్హత లేకున్నా, అవసరం లేకున్నా కాసుల కోసం ఆపరేషన్లు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ దందా కరీంనగర్ జిల్లాలో బయటపడింది. హుస్నాబాద్ బస్టాండ్ వెనకాల లత (వజ్ర) బీఏఎంఎస్(యూహెచ్ఎస్) అర్హతతో సాయి నర్సింగ్ హోమ్‌లో స్త్రీల వైద్య నిపుణురాలిగా చెలామణి అవుతోంది. ప్రసవాలు, గర్భసంచి తొలగింపు తదితర ఆపరేషన్లు సైతం చేస్తున్నట్లు సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఎస్సై కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం ఆస్పత్రిపై దాడులు నిర్వహించారు. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని తలదన్నేరీతిలో ఉండడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇద్దరు మహిళలు సిజేరియన్, మరో మహిళ గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకుని బెడ్‌పై కనిపించారు. ఆపరేషన్ ఎవరు చేశారని పేషెంట్లను పోలీసులు ప్రశ్నించగా, లత డాక్టర్ చేసినట్లు స్పష్టం చేశారు. లతను పోలీసులు ప్రశ్నించగా... ‘వరంగల్, కరీంనగర్‌లలో కార్పొరేట్ ఆస్పత్రుల కంటే మేం అతి చౌకగా ఆపరేషన్ చేస్తాం. అక్కడైతే కనీసం రూ.50 వేలు తీసుకుంటారు. మేం మాత్రం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటం. వరంగల్ నుంచి నిపుణులను తీసుకొచ్చి ఆపరేషన్లు చేరుుస్తం’ అంటూ సమాధానం చెప్పింది. లత చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు సదరు వైద్య నిపుణులకు ఫోన్ చేసి ప్రశ్నించగా, తాము వారం రోజుల నుంచి ఎలాంటి ఆపరేషన్ చేయలేదని పేర్కొన్నారు. దీంతో ఈ ఆపరేషన్లు లత చేసినట్లు నిర్ధారణకు వచ్చిన ఆమెపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఆస్పత్రి నిర్వాహకుడు.. వైద్యురాలు లత భర్త చంద్రశేఖర్‌పైనా కేసు నమోదు చేశారు. ఆపరేషన్ థియేటర్‌ను, ల్యాబ్ ను సీజ్ చేశారు. కాగా, అడ్డగోలు ఆపరేషన్ల వ్యవహారంలో కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన అయ్యప్ప ఆస్పత్రి సర్జన్ మనోజ్‌కుమార్, మరో ఆర్ఎంపీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పట్టుకోల్పోతోంది చెయ్యి... పరిష్కారం చెప్పండి
హోమియో కౌన్సెలింగ్ నా వయస్సు 30 ఏళ్లు. నాకు గత 6 నెలలుగా మలద్వారం దగ్గర బుడిపెల్లాగా ఏర్పడి మల విసర్జన సమయంలో రక్తం పడుతోంది. నొప్పి, మంట ఉండి కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్ని కలిస్తే పైల్స్ అని చెప్పారు. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? - రాములు, తుని ఈ మధ్య కాలంలో తరచుగా వినిపించే సమస్యల్లో ఇది ఒకటి. మలద్వారం చివరలో ఉండే సిరలు మలద్వారం గోడలలో మార్పుల వల్ల ఉబ్బి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి. మొలలు... దశలు గ్రేడ్-1: ఈ దశలో మొలలు పైకి కనిపించవు, నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది. గ్రేడ్-2: ఈ దశలో రక్తం పడొచ్చు. పడకపోవచ్చు కానీ మలవిసర్జన సమయంలో మొలలు బయటకు వస్తాయి. విసర్జన తర్వాత వాటంతట అవే లోపలకు వెళ్లిపోతాయి. గ్రేడ్-3: మలవిసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి కానీ విసర్జన అనంతరం వాటంతట అవి లోపలికి పోవు. వేలితో నెడితేనే లోనికి వెళ్తాయి. గ్రేడ్-4: ఈ దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోపలికి వెళ్లవు. కారణాలు: మలబద్దకం, శారీరక శ్రమ లే కపోవడం, స్థూలకాయం, చాలాసేపు కూర్చొని పనిచేయడం, అతిగా విరోచనాలు కావటం, మంచి పోషకాహారం తీసుకోకపోవడం, నీరు తక్కువ తాగడం, ఎక్కువ ప్రయాణాలు చేయడం, అధిక వేడి ప్రదేశంలో పనిచేయడం, తరచు గర్భస్రావం జరుగుతుండడం, మానసిక ఒత్తిడి అధికంగా ఉన్న వారికి ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, నొప్పి, ఎప్పుడూ ఏదో గుచ్చుకుంటున్నట్లుగా ఉండటం, మలవిసర్జన సమయంలో ఇబ్బంది. నిర్ధారణ: రోగి లక్షణాలను బట్టి, మొలలు మరీ పెద్దదిగా ఉంటే మలద్వారంలోనికి ప్రోట్రోన్సిప్ పంపి చూడటంద్వారా నిర్ధారిస్తారు. నివారణ: మలబద్దకం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చేయడం ముఖ్యం. రోజు ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. కొబ్బరి నీళ్లు తాగాలి. నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. మసాలాలు, జంక్ ఫుడ్, మాంసం తక్కువ తీసుకోవడం, మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. హోమియో చికిత్స: హోమియోలో రోగి శరీర, మానసిక స్థితిని బట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధి యొక్క తీవ్రతను తగ్గిస్తూ, క్రమేణా పూర్తిగా వ్యాధి నివారణ చేస్తారు. మీరు వీలయినంత త్వరలో మంచి హోమియో నిపుణులను సంప్రదించండి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ లివర్ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. మా అన్నయ్యకు కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదనీ, రక్తసంబంధీకులలో ఎవరిదైనా కాలేయదానం అవసరమని డాక్టర్లు అంటున్నారు. నేను మా అన్నయ్యకు కాలేయం ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను అన్నివిధాలా అర్హురాలినని డాక్టర్లు వివిధ పరీక్షలు చేసి, నిర్ధారణ చేశారు. మా అన్నయ్యకు కాలేయం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో నాకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? - విజయశ్రీ, నంద్యాల మీ అన్నయ్యకు మీరు కాలేయం ఇవ్వడానికి అన్నివిధాలా అర్హులని వైద్యులు నిర్ధారణ చేశారు కాబట్టి మీరు నిరభ్యంతరంగా కాలేయాన్ని దానం చేయవచ్చు. కాలేయానికి పునరుత్పత్తి స్వభావం ఉంటుంది. మీ నుంచి 20-25 శాతం కాలేయాన్ని తొలగించి, దాన్ని మీ అన్నగారికి అమర్చుతారు. కాలేయ దానం వల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కావు. కాలేయానికి ఉన్న పునరుత్పత్తి శక్తి వల్ల దాతలోని కాలేయం మళ్లీ 6-8 వారాలలో యథాస్థితికి పెరుగుతుంది. సర్జరీ తర్వాత అన్ని రకాల ఆటలూ ఆడవచ్చు. అందరిలాగే ఏవిధమైన ఇబందులూ లేకుండా సాధారణ జీవితం గడపవచ్చు. మీ అన్నయ్యకు కాలేయం పూర్తిగా విఫలమై కాలేయ మార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు మీరు తెలిపారు. కాబట్టి మీ అన్నయ్యకు వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయించాలని డాక్టర్లు సూచించారు కాబట్టి వీలైనంత త్వరగా ఈ శస్త్రచికిత్స చేయించాలి. లేకపోతే మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తి మీ అన్నయ్యకు మరింత ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఎందుకంటే కాలేయం చాలా కీలకమైన అవయవం. అది ఒక రసాయన కర్మాగారంలా పనిచేస్తూ మనం తిన్న ఆహారంలోని పదార్థాలను చిన్న పోషకాల్లోకి మార్చుతుంది. జీర్ణప్రక్రియలో భాగంగా పైత్యరసాన్ని స్రవింపజేస్తుంది. కొవ్వులను, పిండిపదార్థాలను, ప్రోటీన్లను, విటమిన్లను నిల్వ చేస్తుంది. రక్తం గడ్డకట్టటానికి ఉపయోగపడే అంశాలను రూపొందిస్తుంది. శరీరంలోకి చేరే విషాలను విరిచేస్తుంది. ఒకవేళ కాలేయం సరిగా పనిచేయకపోతే చిన్న దెబ్బతగిలినా తీవ్ర రక్తస్రావంతో మనిషి ప్రాణాలకే ముప్పు వస్తుంది. మీరు కాలేయాన్ని ఇవ్వడం ద్వారా మీ అన్నయ్యకు కొత్త జీవితాన్ని ప్రసాదించినవారవుతారు. డాక్టర్ పి. బాలచంద్రన్ మీనన్ సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. నాకు గత మూడు నెలలుగా కుడి చేతిలో తిమ్మిర్లు వస్తున్నాయి. ఎక్కువ పనిచేసినప్పుడు తిమ్మిర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈమధ్య చెయ్యి పట్టుతప్పుతోంది. తగిన పరిష్కారం చెప్పండి. - కుమారస్వామి, నందిగామ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. చేతికి వెళ్లే నరం ఒత్తుకుపోవడం వల్ల తిమ్మిర్లు వస్తాయి. థైరాయిడ్, షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారికి కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొంతమందిలో నరం తీవ్రంగా ఒత్తుకుపోవడం వల్ల చేతిలో స్పర్శ తెలియకపోవచ్చు. చెయ్యి బలహీనంగా కూడా మారవచ్చు. మొదటి దశలో మణికట్టుకి పట్టీ వేయడం, మందుల ద్వారా తగ్గించడం సాధ్యమవుతాయి. అయితే చేతిలో బలం తగ్గినవారికి చిన్న సర్జరీ ద్వారా జబ్బు పెరగకుండా చూడవచ్చు. కాబట్టి మీరు ఇంకా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. నా వయసు 60 ఏళ్లు. నాకు చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వస్తున్నాయి. అప్పుడప్పుడూ మంటగా కూడా ఉంటున్నాయి. కాళ్లు రెండూ బరువుగా అనిపిస్తున్నాయి. నడుస్తుంటే తూలిపోతున్నట్లుగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. - రామేశ్వర్, కాకినాడ నరాలు దెబ్బతిన్నప్పుడు మీరు చెబుతున్న లక్షణాలు కనిపిస్తుంటాయి. మీ వయసులో ఉన్నవారికి షుగర్ వ్యాధి వల్లగానీ లేదా విటమిన్ బి12 లోపం వల్లగానీ ఈ లక్షణాలు కనిపించే అవకాశాలు ఎక్కువ. మీరు ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోండి. ఎన్సీఎస్ అనే పరీక్ష ద్వారా నరాలు ఏమేరకు దెబ్బతిన్నాయో తెలుస్తుంది. కొంతమందిలో మరీ ముఖ్యంగా శాకాహారుల్లో విటమిన్ బి 12 లోపం వల్ల తిమ్మిర్లు, మంటలు కనిపించవచ్చు. షుగర్‌ను అదుపులో పెట్టుకోవడంతో పాటు విటమిన్ బి12 ఇంజెక్షన్లతో, ఇతర మందులతో మీ వ్యాధి లక్షణాలను అదుపు చేయవచ్చు. ఇంకొంతమంది ఎస్ఏసీడీ అనే జబ్బు వల్ల సరిగా నడవలేరు. చీకట్లో కిందపడి పోయే అవకాశం ఉంది. పాదాలు భూమి మీద ఆని ఉన్నదీ లేనిదీ గుర్తించలేరు. ఇన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. దానికి అనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి మీకు దగ్గర్లోని నరాల నిపుణులను సంప్రదించండి. డాక్టర్ మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ హైదరాబాద్ -
ఫ్యాటీలివర్...
కాలేయంలో కొవ్వుపదార్థాలు పేరుకుపోయి, దాని పరిమాణం కూడా పెరగడాన్ని ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ముందుగా ఏ లక్షణాలు బయటపడకపోయినా, యథాలాపంగా ఏవైనా ఆరోగ్యపరీక్షలు చేయిస్తున్నప్పుడు ఇది బయటపడవచ్చు. కారణాలు అధిక బరువు శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరడం శారీరక శ్రమ తక్కువగా ఉండే జీవనశైలి లేదా ఒకేచోట స్థిరంగా కూర్చుని పనిచేసే వృత్తిలో ఉండటం మత్తుపానీయాలు తాగడం డయాబెటిస్... ఈ పరిస్థితుల్లో తనలోకి చేరుకునే అధిక కొవ్వును కాలేయం నియంత్రించలేదు. దాంతో కాలేయంలోని కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. ఫలితంగా కాలేయం సామర్థ్యం తగ్గడం, వాపురావడం, గట్టిదనం రావడం జరగవచ్చు. నిర్ధారణ పరీక్షలు పూర్తి రక్తపరీక్ష (కంప్లీట్ బ్లడ్ పిక్చర్-సీబీపీ) కాలేయ పనితీరు పరీక్ష (లివర్ ఫంక్షన్ టెస్ట్-ఎల్ఎఫ్టీ) సీటీ లివర్ అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డామిన్ లివర్ బయాప్సీ లిపిడ్ ప్రొఫైల్ ఎఫ్బీఎస్, పీఎల్బీఎస్, ఆర్బీఎస్ వంటి పరీక్షలు. నివారణ బరువు పెరగకుండా చూసుకోవడం వ్యాయామం చేయడం పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఆహారంలో కొవ్వులు తగ్గించడం. చికిత్స : దీనికి ప్రత్యేకంగా మందులు ఏమీ ఉండవు. అయితే వ్యాధి వచ్చిన కారణాన్ని కనుగొని ఆ పరిస్థితిని నివారించేలా చికిత్స చేయడం వల్ల ఈ కండిషన్ తగ్గే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ సమస్య కొద్దిగానే ఉంటే దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే దీర్ఘకాలంగా ఉంటే అది ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి కండిషన్లకు దారితీసే ప్రమాదం ఉంటుంది. లక్షణాలను బట్టి ఈ కండిషన్‌కు కార్డస్ మరైనస్, చెలిడోనియమ్, సియోనాంథస్, లైకోపోడియమ్, కాల్కేరియా కార్బ్, మెర్క్‌సాల్, మాగ్‌మూర్, నక్స్‌వామికా, ఫాస్ఫరస్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
వయసుకు తగినట్లుగా ఎత్తు పెరగకపోతే...
తమ వయసుకు తగినట్లుగా ఎత్తు పెరగకపోవడం అన్నది చాలామందికి మనస్తాపం కలిగించే అంశమే. అది వాళ్లలో అత్మన్యూనతను పెంచుతుంది కూడా. మన జనాభాలో 3-5 శాతం మంది ఈ ఎత్తు పెరగకపోవడం అనే సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ఎదిగే వయసులోని పిల్లలు, యుక్తవయస్కులను ఈ సమస్య ఎక్కువగా బాధపెడుతుంటుంది. నిజానికి ఎత్తు తక్కువగా ఉండటం ఒక వ్యాధి కాదు. సాధారణంగా తల్లిదండ్రులు తక్కువ ఎత్తు ఉంటే, జన్యుపరమైన కారణాలతో వాళ్ల పిల్లలూ తక్కువ ఎత్తే పెరుగుతారు. అయితే ఒక్కోసారి ఏదైనా వ్యాధి కారణంగా కూడా ఎత్తు పెరగకపోవడం జరగవచ్చు. అలాంటప్పుడు దానికి చికిత్స చేయవచ్చు. తద్వారా ఎత్తు పెరిగేలా చూడవచ్చు. ఎత్తు పెరగకపోవడానికి కారణాలు... 1. ఎకాండ్రోప్లేసియా (జన్యుపరంగా వచ్చే సమస్యతో ఎత్తుపెరగకపోవడం) 2. దీర్ఘకాలిక వ్యాధులు, పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు, మూత్రసంబంధ వ్యాధులు, సికిల్ సెల్ అనీమియా, థలసీమియా, యుక్తవయసులో వచ్చే కీళ్లనొప్పులు (జువెనైల్ డయాబెటిక్ ఆర్థరైటిస్), మధుమేహం (డయాబెటిస్) వంటి వ్యాధుల వల్ల 3. పెరుగుదల నెమ్మదిగా ఉండటం (కాన్స్టిట్యూషనల్ గ్రోత్ డిలే) 4. కుషింగ్స్ డిసీజ్ 5. యుక్తవయసు ఆలస్యంగా రావడం 6. డౌన్స్ సిండ్రోమ్ 7. హైపోథైరాయిడిజం పుట్టుకతోనే ఉండటం 8. పేగులో వాపు 9. పేగులో పుండు 10. పౌష్టికాహారలోపం 11. నూనాన్ సిండ్రోమ్ 12. పాన్హైపోపిట్యుటరిజమ్ 13. పెరుగుదల హర్మోన్ తగ్గుదల 14. యుక్తవయసు ముందుగానే రావడం 15. రికెట్స్ 16. రసెల్ సిల్వర్ సిండ్రోమ్ 17. టర్నర్ సిండ్రోమ్ 18. విలియమ్స్ సిండ్రోమ్. ఎత్తు అన్నది తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా పిల్లలకు సంక్రమించే అంశం. కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఏదైనా వ్యాధి కారణంగా ఎత్తుపెరగకపోవడం జరిగితే, దాని కోసం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లలు తమ వయసువారితో పోల్చినప్పుడు మరీ తక్కువ ఎత్తుగా ఉన్నా లేదా పెరుగుదల ఆగిపోయినట్లు అనిపించినా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు వైద్యులు తగిన పరీక్షలు (రక్తపరీక్ష, ఎలక్ట్రొలైట్ లెవెల్స్, ఎక్స్‌రే వంటివి) చేస్తారు. జన్యుపరమైన లోపాలు (ఉదాహరణకు టర్నర్స్ సిండ్రోమ్) వంటివి ఏవైనా ఉన్నాయేమోనని పరీక్షిస్తారు. తల్లిదండ్రుల ఎత్తును, కుటుంబ వైద్య చరిత్ర వంటివి పరిశీలిస్తారు. పుట్టిన తేదీ, ఆహారనియమావళి, యుక్తవయసు ఎప్పుడు మొదలైంది, ఇతరత్రా వ్యాధులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను తెలుసుకుంటారు. తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లల బరువును, ఎత్తును రికార్డు చేస్తూ ఉంటే వారి పెరుగుదల క్రమంలో ఏవైనా మార్పులు ఉన్నాయేమో తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఎత్తు అనేది వంశపారంపర్యంగా వచ్చేదే అయినా, ఏదైనా వ్యాధి లేదా వైద్యసమస్య వల్ల ఎత్తు పెరగకపోవడం జరుగుతుంటే... హోమియో విధానంలోని బెరైట్ గ్రూపు మందులు, కాల్కేరియా ఫాస్, కాల్కేరియా కార్బ్, బెరైటా కార్బ్, మెడొరినం, తూజా వంటి మందుల ద్వారా ప్రయోజనం ఉంటుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
ఆర్థరైటిస్ హోమియో చికిత్స
ప్రస్తుత పరిస్థితిలో మానవుడి జీవిత విధానం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధ్దంగా ఉండడం వలన సరైన వ్యాయమం లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, పౌష్టికాహార లోపం వలన త్వరితగతిన మానవుడు ఆర్థరైటిస్‌కు గురి అవుతున్నాడు. అందుకే జనాభాలో 50 శాతం మంది 40 సం॥దాటినవారు ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2030 నాటికి గణనీయంగా పెరుగుతుందని వైద్యనిపుణుల అంచనా. ఆర్థరైటిస్ అంటే కీళ్ళలో ఉండే కార్టిలేజ్ (మృదులాస్థి) అనే మెత్తని రబ్బరుపదార్థం అరుగుదలకు గురి అవడం వలన ఎముకలలో రాపిడి ఏర్పడి ఇన్ఫ్లమేషన్కు దారి తీయడం. కారణాలు: అధికబరువు, వయస్సు, ఇన్ఫెక్షన్స్, వంశ పారంపార్యం, ఇన్ఫ్లమేటరీ కారణాలు, ప్రమాదాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మొదలైన కారణాల చేత రకరకాలుగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థరైటిస్‌లో రకాలు ఆస్టియో ఆర్థరైటిస్: ఇది ఎక్కువగా 40 సం॥వయస్సు దాటినవారిలో కార్టిలేజ్ అరుగుదల వలన ఎముకల మధ్య రాపిడి వలన వస్తుంది. ఈ డీజనరేటివ్ ఆర్థరైటిస్ మగవారితో పోలిస్తే ఆడవారిలో (ఆస్టియో ఆర్థరైటిస్) ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా నెలసరి ఆగిపోయిన ఆడవారిలో 70 శాతం మంది ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. ఆర్థరైటిస్ అనేది శరీరంలో ఏ కీళ్లలోనైనా ఏర్పడే అవకాశం ఉంది. కాని శరీర బరువునంతటినీ మోసే మోకాలులో అధికంగా కనబడుతుంది. లక్షణాలు: మోకాళ్లనొప్పి వాపు, చేతితో స్పర్శించినప్పుడు వేడిగా ఉండటం, నడుస్తున్నప్పుడు కిరకిరమని శబ్దం రావడం (క్రిస్ట్) కీళ్లు వాపుకు గురై కదలికలు తగ్గడం వలన నడవడానికి చాలా ఇబ్బంది పడటం, అధిక బరువు ఉన్న రోగిలో మోకాళ్లు అరుగుదలకు గురి అయి నడకలో మార్పు వచ్చి కుంటినట్లుగా నడవడం, కింద కూర్చోవడం.. ఇలా.. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా రోగి ఉదయం నిద్రలేచి నడవడం అంటే చాలా బాధతో కూడుకున్నటు వంటి పని అవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్: ఇదొక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది జీవనక్రియల్లో ఏర్పడే అసమతుల్యత వలన వస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఇది ఎక్కువగా 12 నుండి 45 సం॥వయస్సు వారిలో కనబడుతుంది. ఈ వ్యాధి ప్రధానంగా చిన్నకీళ్లైన మణికట్టు, చేతివేలు (మెటటార్సో ఫాలేంజియల్ జాయింట్స్), ఇంటర్ ఫాలెంజియల్ జాయింట్స్, మడిమ మెకార్సో ఫాలెంజియల్ జాయింట్స్‌లో ముందుగా ప్రభావితం అయి పెద్ద జాయింట్లకు వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి శరీరంలో ఇరువైపులా ఉండే కీళ్ళకు సమాంతరంగా వ్యాఫ్తి చెందుతుంది. (బై లేటరల్ సిమెట్రికల్) కీళ్ళు వాపునకు గురి అయి కదలికలు పూర్తిగా స్తంభించి కీళ్ళు వైకల్యానికి దారి తీస్తాయి. ఇది ఎక్కువగా శీతాకాలం లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కీళ్ళ కదలికలు పూర్తిగా స్తంభించి చాలా నొప్పిని కలిగిస్తాయి. గౌటి ఆర్థరైటిస్: ఇదొక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది జీవక్రియలో ఏర్పడి, ఉప ఉత్పన్నమైన యూరిక్ ఆసిడ్ అధిక మోతాదులో రక్తంలో చేరి సోడియంతో కలసి మోనో సోడియం సిట్రైట్ అనే స్ఫటికాలు ఏర్పడి కీళ్ళలో చేరడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. లక్షణాలు: ఇది కాలి బొటనవేలులో ఎక్కువగా కనిపిస్తుంది. కీలు వాపుకు గురి అయి తీవ్రమైన నొప్పిని, మంటను కలుగజేస్తుంది. ఈ వ్యాధి ఆల్కహాల్, డ్రైఫ్య్రూట్స్ అధిక మాంసకృత్తులు తీసుకుంటే వ్యాధి తీవ్రత అధికమవుతుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్: ఇది సిరినెగిటివ్ ఇన్ఫ్లమేటరి ఆర్థరైటిస్. సోరియాసిస్ ఉన్నవారిలో 30 శాతం మందికి సోరియాటిక్ ఆర్థరైటిస్‌తో బాధపడతారు. ఇందులో ముఖ్యంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా కీళ్ళలో వ్యాప్తి చెందుతాయి. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్: దీనినే సపోర్టివ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. రక్తం ద్వారా లేదా కీళ్ళ చుట్టూ ఉండే కణజాలం ఇన్ఫెక్షన్కి గురి అయినప్పుడు, ఇన్ఫెక్షన్ సైనోవియల్ కుంబ్రేన్లో చేరడం వలన ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ సంభవిస్తుంది. ఇది ఎక్కువగా ఆర్టిఫిషియల్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకునే వారిలో కనిపిస్తుంది. వీటన్నింటికీ హోమియోలో శాశ్వతమైన చికిత్సావిధానాలున్నాయి. హోమియో ట్రీట్మెంట్ పైన తెలిపిన అన్ని రకాల ఆర్థరైటిస్‌కు హోమియో వైద్యంలో చాలా మెరుగైన చికిత్స ఉంటుంది. మిగతా వైద్యవిధానాలతో పోలిస్తే నొప్పి తగ్గించడంలోనూ, కీళ్ళ కదలికను సురక్షితంగా ఉంచడంలోను హోమియో వైద్య విధానంలో మంచి చికిత్స ఉంటుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ విధానం ద్వారా కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా జాయింట్ కదలికలను సురక్షితంగా ఉంచడం ద్వారా రోగికి మెరుగైన ఫలితాలు వస్తాయి. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
థైరాయిడ్ గ్రంథి
మన శరీరంలోని అత్యంత కీలకమైన గ్రంథుల్లో ఒకటి థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ హార్మోన్ అన్ని జీవ వ్యవస్థలపై పనిచేస్తుంది. బేసల్ మెటబాలిక్ రేట్ (బీఎమ్ఆర్), శ్వాసవ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణవ్యవస్థ, సంతానోత్పత్తి వ్యవస్థ... ఇలా ఎన్నింటిపైనో థైరాయిడ్ ప్రభావం ఉంటుంది. హైపోథలామస్, పిట్యూటరీ, థైరాయిడ్ వ్యవస్థలలో మార్పులు రావడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పులు సంభవించి హైపర్ థైరాయిడిజమ్, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు వస్తాయి. హైపోథైరాయిడిజమ్: శరీరానికి కావాల్సిన దానికంటే తక్కువ మోతాదులో థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఇది ఇస్తుంది. ఏ వయసులో ఉన్నవారైనా హైపోథైరాయిడిజమ్‌కు గురికావచ్చు. పిల్లలు, స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు: పిల్లల్లో బుద్ధిమాంద్యం, ఎదుగుదలలో లోపం, జ్ఞాపకశక్తి లేకపోవడం, మలబద్దకం, చురుకుదనం లోపించడం, వయసుకు మించి లావుగా ఉండటం. యుక్తవయసువారిలో: బరువు పెరగడం, రుతుచక్రం ఆలస్యం కావడం, నెలసరిలో అధికరక్తస్రావం లేదా తక్కువ రక్తస్రావం, సంతానలేమి, చర్మం పొడిబారడం, వెంట్రుకలు రాలడం, బద్దకంగా ఉండి పనిచేయాలని అనిపించకపోవడం, చలిని తట్టుకోలేకపోవడం. ఆడవారిలో రోజూ వేసుకునే దుస్తులు, గాజులు బిగుతు కావడం, అల్వికేరియా అనే చర్మసంబంధిత వ్యాధులతో హైపోథైరాయిడిజమ్‌ను సులువుగా గుర్తించవచ్చు. హైపర్ థైరాయిడిజమ్: థైరాయిడ్ గ్రంథి ఎక్కువ మోతాదులో థైరాక్సిన్ విడుదల చేయడంవల్ల వస్తుంది. లక్షణాలు: ఆహారం సరైన మోతాదులో తీసుకున్నా బరువు తగ్గడం, నిద్రలేమి, గుండెదడ, అధికంగా చెమటలు, విరేచనాలు, చేతులు వణకడం, నీరసంగా ఉండటం, నెలసరి త్వరగా రావడం, రుతుచక్రమంలో అధిక రక్తస్రావం. హషిమోటోస్ థైరాయిడైటిస్ : ఇది జీవన క్రియల అసమతుల్యతల వల్ల వచ్చే సమస్య. దీనిలో థైరాయిడ్ గ్రంథికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉత్పన్నమై, థైరాయిడ్ గ్రంథిని సక్రమంగా పనిచేయనివ్వవు. ఇందులో హైపో, హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఉండే అవకాశం ఉంది. గాయిటర్: థైరాయిడ్ గ్రంథి వాపునకు గురి కావడాన్ని గాయిటర్ అంటారు. కొన్ని సందర్భాల్లో దీని వాస్తవ పరిమాణం కంటే రెండింతల వాపు రావచ్చు. కారణాలు: అయోడిన్ అనే మూలకం లోపించడం. గ్రేవ్స్ డిసీజ్, పిట్యూటరీ గ్రంథి ట్యూమర్స్, థైరాయిడ్ క్యాన్సర్ కూడా దీనికి కారణాలు. లక్షణాలు: గొంతు కింద వాపు వచ్చి మింగడానికి కష్టంగా ఉంటుంది. స్వరంలో మార్పులు. ఎక్సా ఆఫ్తాల్మిక్ గాయిటర్ అంటే... కనుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లుగా ఉండటం. చికిత్స : థైరాయిడ్ సమస్యలకు మందులు లేవనీ, జీవితాంతం థైరాక్సిన్ వాడటం తప్ప మరో మార్గం లేదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అయితే రోగి శరీర తత్వాన్ని బట్టి హోమియో చికిత్స విధానం ద్వారా వైద్యం అందిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో చక్కని పరిష్కారం
మానసికమైన ఒత్తిడి, మనోవ్యాకులత, బాధలు, భయాలు, ఆందోళన వలన శరీరంలోని రసాయనాలలో ఎన్నో మార్పులు జరిగి అనేక వ్యాధులకు గురి చేస్తాయనే విషయం అందరికీ విదితమే. అయితే వీటి వలన కేవలం హార్మోన్ల అసమతుల్యత, హైపర్ టెన్షన్, కొన్ని రకాల సైకో-పామటిక్ డిసార్డర్స్ మాత్రమే కాదు, సున్నితంగా ప్రతిస్పందించే వారిలో జన్యుపరమైన మార్పులకు దారితీయవచ్చును, అందువలననే ఈ మధ్యకాలంలో ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిని ఎక్కువగా చూస్తున్నాము. ఈ తరహా వ్యాధులలో ప్రధానమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్ (R.A). ఈ వ్యాధి బారిన పడేవారిలో అధిక శాతం మంది స్త్రీలే అవ్వడం గమనార్హం. స్త్రీ-పురుషులలో యాభై ఏళ్ళలో నొప్పులు మొదలవుతాయి, ఇది వయస్సు పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలో క్యాల్షియం తగ్గిపోవడం వలన వస్తూ ఉంటుంది. దీనిని ‘ఆస్టియో అర్థరైటిస్’’ అంటారు. ఇందుకు భిన్నంగా ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే యువతులలో చేతుల్లో, పాదాలలలో ఉండే చిన్న చిన్న కీళ్ళలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులు రావడం రుమటాయిడ్ ఆర్థరైటిన్ లక్షణాలు. అయితే ఇది పురుషుల్లోను, పిల్లల్లోను కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్ఫ్డిసీజ్’ అంటారు. లక్షణాల తీవ్రతలో వివిధ మార్పులు కన్పిస్తాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో కండరాల్లో నొప్పులు, కీళ్ళను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. సాధారణంగా కీళ్ళనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా ద్విపార్శకంగా చేతులలో, కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం, పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అని అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్‌లో మోచేతులపైన, తొడలపైన వచ్చే చిన్న చిన్న గడ్డలను ‘రుమటాయిడ్ నాడ్యుల్స్’ అని అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. వ్యాధి లక్షణాలను బట్టి, రక్తంలో రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనే పరీక్ష పాజిటివ్‌గా రావడం, ్ఠ-రేస్‌లో వచ్చే మార్పులను ఆధారంగా చేసుకొని, డిఫార్మటీస్ని పరిశీలించి వ్యాధిని నిర్ధారిస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి తీవ్రతను, వాడే మందుల ప్రభావాన్ని అంచనా వెయ్యడానికి ఇ.ఎన్.ఆర్, సి.ఆర్.పి. వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్ వలన, స్టిరాయిడల్ మందుల వలన నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అసలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మటీస్ని నివారించలేము. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. ...పాజిటివ్ హోమియోపతి డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి అపాయింట్మెంట్ కొరకు 9246199922 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై www.positivehomeopathy.com -
అనారోగ్యానికి ఆనవాళ్లు... మూత్రపిండాల్లో రాళ్ళు
మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ళకు సరైన చికిత్స కనుక అందించకపోతే వాటి పనితీరు మందగించి మూత్రపిండాల వ్యాధికి కారణమవుతాయి. దానితో మూత్రపిండాల వడపోత సామర్థ్యం తగ్గి రోగి ఆరోగ్యం ఇంకా దిగజారుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా హోమియో చికిత్సను అందిస్తే కిడ్నీరాళ్ల సమస్యను నివారించవచ్చు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కారణాలు: ఈ సమస్య స్త్రీ, పురుష, వయోపరిమితితో నిమిత్తం లేకుండా రావచ్చు. శారీరకశ్రమ తక్కువగా ఉండడం. రోజూ తగినంత నీళ్ళు తాగకపోవడం, గౌట్ రకం కీళ్ళవ్యాధి, వంశపారంపర్యత, స్థూలకాయం, శరీరంలో రాళ్ళు ఏర్పడే లక్షణం ఉండడం, చలికాలం, మద్యపానం ముఖ్యకారణాలు. సికెడి (దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి), పుట్టుక నుండి ఒకటే కిడ్నీ ఉండడం లేదా చిన్న కిడ్నీలు ఉండడం, పిసికెడి (పాలిసిస్టిక్ కిడ్నీ డిసీస్) లాంటి కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు తక్కుగా నీళ్ళు తాగాల్సి ఉంటుంది. అందువల్ల వీరిలో కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు: మూత్రపిండాలు నడుము భాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. అందువల్ల నొప్పి ఈ ప్రాంతంలో మొదలై పొత్తికడుపు వరకు పాకుతుంది. మూత్రవిసర్జన సమయంలో నొప్పి తీవ్రత పెరుగుతుంది. మూత్రవిసర్జన తరచు చేయాల్సి రావడం, మూత్రం తక్కువ పరిమాణంలో, మంటగా రావడం, మూత్రం పసుపురంగు లేదా ఎరుపురంగులో రావడం, కడుపులో నొప్పి, వికారం, ఆకలి తగ్గిపోవడం, మలవిసర్జనకు వెళ్ళాల్సి వచ్చినట్లుండటం, తరచుగా వాంతులు అవడం, జ్వరం రావడం. రాళ్ళు ఏర్పడే ప్రదేశాలు: 1. మూత్రపిండాలు- వీటిల్లో ఒకటి కంటే ఎక్కువ రాళ్ళ పెద్ద పరిమాణంలో ఉన్నప్పుడు కిడ్నీ పనితీరుపై ప్రభావం ఏర్పడుతుంది. 2. మూత్రనాళాలు- వీటిలోని రాళ్ళు మూత్రనాళాలను మూసివేయడం ద్వారా కిడ్నీలో మూత్రం నిండిపోయి వాపు వస్తుంది. సమస్య ముదిరితే కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడం లేదా వాటి పనితీరు తగ్గడం 3. మూత్రాశయంలోని రాళ్ళు మూత్రవిసర్జనకు అడ్డురావడం వల్ల మూత్రం చుక్కలు చుక్కలుగా ఎరుపురంగులో తీవ్రమైన నొప్పి, మంటతో ఉంటుంది. 4. కొందరిలో కుడివైపు, కొందరిలో ఎడమవైపు, మరికొందరిలో రెండువైపులా స్టోన్స్ తయారవవచ్చు. ఒకటి లేదా అంత కంటే ఎక్కువరాళ్ళు ఏర్పడవచ్చు. వీటి పరిమాణం ఒకటి నుంచి 15 మి.మీ. వరుకు ఉండే అవకాశం ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటూ చికిత్స అందించడం ద్వారా మంచి ఫలితాలను అందించవచ్చు. నిర్థారణ పరీక్షలు: సిబిపి, సియుఇ, ఇఎస్ఆర్, స్కాన్ అబ్డామెన్, ఎక్స్‌రే-కెయుబి, ఐఐపి, యూరియా, క్రియాటిన్ మొదలగు పరీక్షల ద్వారా రాయి పరిమాణం, అది ఏర్పడిన ప్రదేశం, మిగతా మూత్రవిసర్జన వ్యవస్థపై స్టోన్స్ ప్రభావాన్ని తెలుసుకోవడం ద్వారా సరియైన చికిత్స అందించగలం. నివారణ మార్గాలు: రోజు శారీరక వ్యాయామం, నడక ఉండడం, నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచినీళ్ళు తాగడం, మద్యపానానికి దూరంగా ఉండడం, ఆక్సలేట్ ఎక్కువగా ఉండే పాలకూర, టమోటా, సోయాబీన్, చాక్లెట్లను వీలైనంతగా తగ్గించడం ద్వారా స్టోన్స్ సమస్య రాకుండా, పెరగకుండా నివారించవచ్చు. చిన్నపిల్లలు, ఎదిగే వయసు పిల్లలు తరచూ ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వారిలో ఆకలి తగ్గి, జీర్ణక్రియ మందగించడం, తద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదల దెబ్బతింటుంది. సమస్యను తొలిదశలో గుర్తించి, సమూలంగా వ్యాధిని నిర్మూలించే చికిత్స తీసుకోవడం ఉత్తమ మార్గం. హోమియో చికిత్స: హోమియో వైద్య విధానంలో రాళ్ళను ఆపరేషన్ అవసరం లేకుండా కరిగించడమే కాకుండా, అవి మళ్ళీ తయారవకుండా చేయగలిగే చికిత్స అందుబాటులో ఉంది. హోమియో మందులకు ఎటువంటి దుష్ర్పభావాలు ఉండకపోవడం వల్ల అన్ని వయసుల వారికి ఇది మంచి విధానం, నిపుణులైన హోమోయోకేర్ వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే ఆపరేషన్ అవసరం లేకుండా సమస్యను సమూలంగా, శాశ్వతంగా నివారించవచ్చు. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో చక్కని పరిష్కారం
మానసికమైన ఒత్తిడి, మనోవ్యాకులత, బాధలు, భయాలు, ఆందోళన వలన శరీరంలోని రసాయనాలలో ఎన్నో మార్పులు జరిగి అనేక వ్యాధులకు గురి చేస్తాయనే విషయం అందరికి విదితమే. అయితే వీటివలస కేవలం హార్మోన్ల అసమతుల్యత, హైపర్ టెన్షన్, కొన్నిరకాల సైకో-పామాటిక్ డిజార్డర్స్ మాత్రమే కాదు సున్నితంగా ప్రతిస్పందించే వారిలో జన్యుపరమైన మార్పులకు దారి తీయవచ్చును, అందువలననే ఈ మధ్యకాలంలో ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిని ఎక్కువగా చూస్తున్నాం. ఈ తరహా వ్యాధులలో ప్రధానమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఖ.అ). ఈ వ్యాధిబారిన పడేవారిలో అధిక శాతం మంది స్త్రీలే అవ్వడం గమనార్హం. స్త్రీ-పురుషులలో యాభైఏళ్ళలో నొప్పులు మొదలవుతాయి. ఇది వయస్సు పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలోక్యాల్షియం తగ్గిపోవడం వలన వస్తూ ఉంటుంది. దీనిని ‘ఆస్టియో ఆర్థరైటిస్’’ అంటారు. ఇందుకు భిన్నంగా ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే యువతులలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులు రావడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. అయితే ఇది పురుషుల్లోను, పిల్లల్ల్లో కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్స్ డిసీజ్’ అని అంటారు. లక్షణాల తీవ్రతలో వివిధ మార్పులు కన్పిపిస్తాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్ళను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్ళనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా ద్విపార్శకంగా చేతులో, కాళ్ళలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు. దీనివలన శారీరకంగా, మానసికంగా రోగి కృంగిపోవడం జరుగుతుంది. ఈ వ్యాధి భుజాలు, మోకాళ్లు, వెన్నుపూసలలోని కీళ్ళు ఇలా ఏ జాయింట్లోనైనా లక్షణాలు కనిపించవచ్చు. గుండె, ఊపిరితిత్తుల పైన ఉండే పొరపైన, రక్తం పైన వ్యాధి ప్రభావం చూపుతుంది. రక్తనాళాలలో వచ్చే మార్పుల వలన శరీరం పైన చిన్న చిన్న గాయాల మాదిరిగా ఏర్పడతాయి. కంటిలోని పొరలు, నోరు ప్రభావితమైనప్పుడు పొడిబారిపోవడం, ఎరుపెక్కి మంట రావడం జరుగుతుంది. దీనిని ‘జోగ్రెన్స్ సిండ్రోమ్’ గా పరిగణిస్తారు. రక్తంలో ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గిపోవడం వలన అనీమియా స్ల్పీన్ అనే ఉదర భాగంలోని అవయవం వాచినప్పుడు దీనిని ‘ఫెల్టీస్ సిండ్రోమ్’ అని అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్‌లో మోచేతుల పైన, తొడల పైన వచ్చే చిన్న చిన్న గడ్డలను ‘రుమటాయిడ్ నాడ్యుల్స్’ అంటారు. వ్యాధి నిర్ధారణలో వీటిని కూడా పరిగణిస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. వ్యాధి లక్షణాలను బట్టి, రక్తంలో రుమటాయిడ్ ఫాక్టర్ అనే పరీక్ష పాజిటివ్‌గా రావడం X - రేస్‌లో వచ్చే మార్పులను ఆధారంగా చేసుకొని, డిఫార్మటిస్ని పరిశీలించి వ్యాధిని నిర్థారిస్తారు. రుమటాయిడ్ ఫాక్టర్ నెగటివ్‌గా ఉన్న వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించడం, అనేక ఇతర వ్యాధులలో రుమటాయిడ్ ఫాక్టర్ పాజిటివ్‌గా రావడం వలన కేవలం ఈ పరీక్ష ద్వారా ఖచ్చితమైన నిర్ధారణ చెయ్యలేము. రుమటాయిడ్ ఫాక్టర్ అనే ఆటోయాంటీ బాడీ సిస్టమ్ స్ల్కీరోసిన్, ఎస్.ఎల్.ఇ. మొదలగు ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధులలో కూడా పాజిట్‌గా వస్తుందని తెలుసుకోవాలి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీవ్రతను, వాడే మందుల యొక్క ప్రభావాన్ని అంచనా వెయ్యడానికి ఇ.ఎస్.ఆర్ సి.ఆర్.పి. వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్ వలన, స్టిరాయిడల్ మందుల వలన నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. కీళ్ళనొప్పులు అంటే ఇంత నరకమా? నాపేరు రాజగోపాల్. నేను రిటైర్డ్ ఆఫీసర్ని. నేను సర్వీస్‌లో ఉండగా నాకు ఎటువంటి నొప్పులు ఉండేవి కావు. ఆ తర్వాతే నాకు ఈ కీళ్లనొప్పులు మొదలయ్యాయి. కీళ్ళనొప్పులంటే ఇంత నరకమా? అనిపించింది. సరిగా నడవలేక, కూర్చోలేక, ఎక్కడికీ వెళ్ళలేక చాలా ఇబ్బందిపడేవాడిని. ఎన్నోరకాల మందులు వాడినా ఫలితం కనిపించలేదు. అప్పుడు పాజిటివ్ హోమియోపతికి వెళ్ళాను. వీరిచ్చిన ట్రీట్మెంట్ వలన, సలహాల వలన నాకు ఇప్పుడు ఏ బాధా లేదు. నాకు ఇంతటి రిలీఫ్‌ను ఇచ్చిన పాజిటివ్ హోమియోపతి డాక్టర్లకు చాలా థాంక్స్... డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగుళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 9246199922 -
సరైన విధంగా ఎత్తు పెరగకపోతే..?
మన సమాజంలో ఎత్తు పెరగడం లేదనే ఆందోళన చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా ఎదిగే వయసులోని టీనేజీ పిల్లల్లో, యుక్తవయస్కులలో ఈ ఆవేదన ఎక్కువ. అయితే ఎత్తు తక్కువగా ఉండటం వ్యాధి కాదు. సాధారణంగా తల్లిదండ్రులు తక్కువ ఎత్తు ఉంటే పిల్లలూ తక్కువగా ఎత్తుపెరుగుతారు. అయితే ఒక్కోసారి మాత్రం తగినంతగా ఎత్తు పెరగకపోవడం అన్నది ఏదో వ్యాధి కారణంగా కూడా జరగవచ్చు. అప్పుడా సమస్యకు చికిత్స చేయవచ్చు. ఎత్తు పెరగకపోవడానికి కారణాలు... 1. ఎఖాండ్రోప్లేసియా (జన్యుపరంగా వచ్చే సమస్యతో ఎత్తుపెరగకపోవడం); 2. దీర్ఘకాలిక వ్యాధులు, పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు, మూత్రసంబంధ వ్యాధులు, సికిల్‌సెల్ అనీమియా, థలసీమియా, యుక్తవయసులో వచ్చే కీళ్లనొప్పులు (జువెనైల్ డయాబెటిక్ ఆర్థరైటిస్), మధుమేహం (డయాబెటిస్) వంటి వ్యాధుల వల్ల 3. పెరుగుదల నెమ్మదిగా ఉండటం (కాన్స్టిట్యూషనల్ గ్రోత్ డిలే), 4. కుషింగ్స్ డిసీజ్, 5. యుక్తవయసు నెమ్మదిగా రావడం, 6.డౌన్స్ సిండ్రోమ్, 7. హైపోథైరాయిడిజం పుట్టుకతోనే ఉండటం, 8. పేగులో వాపు, 9. పేగులో పుండు, 10. పౌష్టికాహారలోపం, 11.నూనాన్ సిండ్రోమ్, 12. పాన్హైపోపిట్యుటరిజమ్, 13. పెరుగుదల హర్మోన్ తగ్గుదల, 14. ప్రికాషియస్ ప్యూబర్టీ యుక్తవయసు ముందుగానే రావడం, 15. రికెట్స్, 16. రసెల్ సిల్వర్ సిండ్రోమ్, 17. టర్నర్ సిండ్రోమ్, 18.విలియమ్స్ సిండ్రోమ్. ఎత్తు అన్నది తల్లిదండ్రుల నుంచి జన్య్యుపరంగా సంక్రమిస్తుంది. అయితే ఒకవేళ ఏదైనా వ్యాధి కారణంగా ఎత్తుపెరగకపోవడం జరిగితే, దానికి సంబంధించిన చికిత్స అవసరమవుతుంది. అప్పుడు వైద్యులు తగిన పరీక్షలు చేస్తారు. జన్యుపరమైన లోపాలు ఏవైనా ఉన్నాయేమోనని చూస్తారు. ఎత్తు అనేది వంశపారంపర్యంగా వచ్చేదే అయినా ఏదైనా వ్యాధి లేదా వైద్యసమస్య వల్ల పెరుగుదలలో లోపాలు ఉంటే హోమియో విధానంలో బెరైట్ గ్రూపు మందులు, కాల్కేరియా ఫాస్, కాల్కేరియా కార్బ్, బెరైటా కార్బ్, మెడొరినం, తూజా వంటి మందులు హోమియో నిపుణుల ఆధ్వర్యంలో వారు సూచించిన మోతాదుల్లో వాడాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
హోమియోపతితో సంతాన సాఫల్యం
బోసినవ్వులతో, కేరింతలతో, చిలిపి చేష్టలతో పసిపిల్లలు నడయాడే ఇల్లు స్వర్గతుల్యం అవుతుంది. మరి ఆ పిల్లల సవ్వడి ఇంట్లో వినబడకపోతే, అమ్మా, నాన్నా అనే పిలుపులకు కొందరు తల్లిదండ్రులు నోచుకోకపోతే... ఆ అదృష్టం మనకు లేదా అని బాధపడాల్సిన అవసరం లేదు. హోమియో చికిత్స ద్వారా సంతాన సాఫల్యానికి అవకాశాలున్నాయి. సంతానలేమికి కారణాలు సంతానం లేకపోతే చాలామంది దానికి మహిళలోనే లోపం ఉందని నిర్ధారణకు వస్తారు. కానీ సంతానలోపానికి కారణం దంపతులిద్దరిలోనూ ఉండవచ్చు. అందుకే నిర్దిష్టంగా కారణం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీలలో: వయసు 32-35 దాటిన స్త్రీలలో అండాశయ సామర్థ్యం తగ్గుతుంది. పీసీఓడీ, గర్భాశయ సమస్యలు, ట్యూబులు మూసుకుపోవడం, పీఐడీ, థైరాయిడ్, డీఎమ్, టీబీ వంటి సమస్యలు, ఎండోమెట్రియాసిస్ మొదలైనవి మహిళల్లో సంతానలేమికి కారణాలు. పురుషుల్లో: వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం లేదా అసలు లేకపోవడం, హార్మోన్ల అస్తవ్యస్తత, వరిబీజం, డయాబెటిస్, మూత్రనాళంలో అడ్డు... మొదలైనవి సంతానలేమికి పురుషుల్లో కారణాలు. కొంతమంది పురుషుల్లో వీర్యకణాల సంఖ్య సరిపడా ఉన్నా వాటిలో చలనం తక్కువగా ఉండటం, వాటి ఆకృతి (మార్ఫాలజీ)లో తేడా వంటి అంశాలను గమనించాల్సి ఉంటుంది. కొందరిలో వీర్యకణాల సంఖ్య, చలనం అన్నీ బాగానే ఉంటాయి. భార్యలో కూడా లోపాలు ఉండవు. వీర్యకణాలు అండాన్ని సమీపిస్తాయి. కానీ ఫలదీకరణ జరగదు. ఇందుకు విటమిన్-కె లోపం, వీర్యకణాలకు ఫలదీకరణ శక్తి లోపించడం వంటివి కారణం. చికిత్స: హోమియో చికిత్స ద్వారా సంతానలేమికి కారణమైన అన్ని అంశాలకూ పరిష్కారం లభ్యమవుతుంది. చాలామందికి గర్భం వస్తుంది కానీ నెలలు నిండకుండానే గర్భస్రావం అవుతుంటుంది. అటువంటివారికి కూడా హోమియో ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తే గర్భం నిలుస్తుంది. అయితే ఆయా అంశాలను బట్టి కాన్స్టిట్యూషన్ పద్ధతిలో వైద్యం అవసరమవుతుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
మధుమేహానికి హోమియోలో చక్కని పరిష్కారం
నవీన యుగంలో వయస్సు, లింగ-విచక్షణ లేకుండా రాను రాను మధుమేహ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. భారతదేశంలో, అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో వీరిసంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ‘మధుమేహం’ లేదా ‘డయాబెటిస్’ వ్యాధికి కారణాలు అనేకం ఉన్నాకానీ మానసిక ఒత్తిడి, ఆందోళన, మనోవ్యాధులు వంటి మానసికమైన కారణాలు ప్రధానంగా ఉండడమే గణనీయంగా పెరిగిపోతున్న వ్యాధిగ్రస్తులకు సూచనగా ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే ‘డయాబెటిస్’ ఒక వ్యాధికాదు. ఇది ఒక మెటబాలిక్ డిసార్డర్, అంటే శరీరంలో జీవక్రియ సరిగ్గా జరగపోవడం వలన రక్తంలో, మూత్రంలో చక్కెర శాతం పెరిగిపోవడం వలన ఏర్పడే స్థితి మాత్రమే. డయాబెటిక్ లక్షణాలైన అధిక మూత్రం, తీవ్రమైన దాహం, ఆకలి, శారీరక దౌర్బల్యం అన్నీ కూడా జీవక్రియ సరిగ్గా జరగకపోవడం వలన వచ్చేవే. దీనికి కారణం శరీరంలో ‘పాంక్రియాస్’ అనే గ్రంథి నుండి వెలువడే ‘ఇన్సులిన్’ అనే హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం లేదా దానిని శరీరం సరిగ్గా వినియోగించుకోకపోవడమే. ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని ఆధారం చేసుకొని డయాబెటిస్‌ను రెండు ప్రధానరకాలుగా విభజించుతారు. 1. డయాబెటిస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. దీనికి కారణం పాంక్రియాస్ గ్రంథిలో బీటాకణాలు పూర్తిగా నాశనం అవడమే. ఇన్సులిన్ ఉత్పత్తి నిలిచిపోవడం వలన శరీరంలో కార్బోహైడ్రేట్ మెటబాలిజమ్ దెబ్బతిని మనిషి స్పృహకోల్పోయి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అందువలన వీరిలోకి బయట నుండి ఇన్సులిన్ని ఇంజక్షన్ రూపంలో ప్రవేశపెడతారు. అందుకే ఈ రకం డయాబెటిస్‌ని ‘ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెల్లిటన్’ (IDDM) అని అంటారు. 2. డయాబెటిస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగానే ఉన్నప్పటికీ శరీరం దానిని సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి, ఈ పరిస్థితినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. ఇది సాధారణంగా ఊబకాయం ఉన్నవారిలో, మద్యం సేవించేవారిలో, శారీరక శ్రమలేకుండా స్థిరంగా ఉండే వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. వీరికి ఇన్సులిన్ బయటినుండి ఇచ్చే అవసరం ఉండదు కానీ రక్తంలో చక్కర శాతాన్ని నియంత్రించే మందులను (యాంటీ-హైపర్ గ్లైసీమిక్ డ్రగ్స్) సూచిస్తారు. అందుకే దీనిని నాన్-ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెల్లిటస్ (ూఐఈఈక) అని అంటారు. అయితే వీరిలో కూడా షుగర్ లెవల్స్ టాబ్లెట్ల ద్వారా నియంత్రించ లేకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ సిఫారసు చేస్తారు. స్త్రీలలో గర్భధారణ సమయంలో వచ్చి ఆ తర్వాత కూడా ఉండే డయాబెటిస్‌ని ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అని అంటారు. డయాబెటిస్ వలన వచ్చే లక్షణాలే ఇబ్బందికరంగా ఉంటే దానివలన తలెత్తే కాంప్లికేషన్లు పేషెంట్‌ను మరింత కృంగదీస్తాయి. కొన్నిరకాల కాంప్లికేషన్లు అకస్మాత్తుగా, తీవ్రంగా వస్తాయి. షుగర్ లెవెల్స్‌ని సరిగ్గా నియంత్రించకపోతే ‘డయాబెటిక్ కీటోఎసిడోసిస్’ అనే సమస్య తలెత్తుతుంది. మందులు వేసుకొంటూ ఆహారం సరిగా తీసుకోకపోతే చక్కెర స్థాయి తగ్గిపోయి ‘హైపోగ్లైసీమెయా’ తలెత్తుంది. శరీరమంతా చెమటలు రావడం, వణుకురావడం, విపరీతమైన నీరసానికి గురయ్యి కళ్ళు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలు హైపోగ్లైసిమియాకి గురైన వ్యక్తిలో కన్పిస్తాయి. కొన్నిరకాల దుష్ర్పభావాలు దీర్ఘకాలంగా వేధిస్తుంటాయి. రక్తనాళాలలో వచ్చే మార్పుల వలన హృద్రోగాలు, కంటిచూపు మందగించడం (డయాబెటిక్ రెటిబోపతి), మూత్రపిండాలు దెబ్బతినడం (డయాబెటిక్ నఫ్రోపతి) వంటి కాంప్లికేషన్స్ దీర్ఘకాలంగా డయాబెటిస్తో బాధపడే వారిలో కనబడతాయి. గాయాలు సరిగ్గా మానకపోవడం, జననేంద్రియాలలో దురదలు, లైంగిక సమస్యలు స్త్రీ-పురుషులను కృంగదీస్తాయి. సూక్ష్మనాళికలు దెబ్బతినడం వలన రక్తప్రసరణ సరిగ్గా జరగక వచ్చే గాంగ్రీన్ వంటి సమస్యల వలన కొన్నిసార్లు అవిటితనం తలెత్తే అవకాశం ఉంటుంది. కాంప్లికేషన్స్‌ని అరికట్టడానికి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవలసిన అవసరం ఉంది. గ్లూకోజ్ లెవెల్స్ సాధారణంగా భోజనం తర్వాత 160 mg/dl కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. క్రమంగా వ్యాయామం చేస్తూ, మందులు, ఆహారం సమయానికి తీసుకొంటూ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించవలసిందే. డయాబెటిస్తో పాటు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్న వారిలో దుష్ర్పభావాలు త్వరగా వస్తాయి గనుక రక్తపోటును, కొలస్ట్రాల్‌ను కూడా నియంత్రించుకోవాలి. మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకొని సాధ్యమైనంత మనస్సును ప్రశాంతంగా ఉంటుకోవాలి. హోమియోపతిలో ఇచ్చే కాన్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా కేవలం షుగర్ లెవెల్స్ కంట్రోల్ చెయ్యడమే కాకుండా కాంప్లికేషన్స్‌ను నివారించడం, ఉన్నవారిలో కాంప్లికేషన్స్‌ని తొలగించడానికి సహాయపడుతుంది. హోమియోపతి అనగానే డయాబెటిస్‌కి యాసిడ్ ఫాస్, యురేనియమ్ నైట్ వంటి మందులే ఉన్నాయని అనుకుంటారు. కాని అది సరికాదు. జన్యుపరమైన, మానసికపరమైన కారణాలను పరిగణిస్తూ, వ్యక్తిగత లక్షణాలపై కేంద్రీకరిస్తూ ఇచ్చే కాన్స్టిట్యూషనల్ రెమెడీ ద్వారా రోగికి చక్కని ఫలితం లభిస్తుంది. సరియైన మందును, సరిపడే మోతాదులో నిర్ణీత కాలం దాకా వాడితే... 1. రోగుల్లో ఇన్సులిన్ డొసేజ్ని తక్కువ చేయడం, 2. రోగుల్లో యాంటీ హైపర్ గ్లైసిమిక్ డ్రగ్స్ మోతాదుని క్రమంగా తక్కువ చేయడం, పూర్తిగా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. హోమియోపతి మందుల ద్వారా డయాబెటిక్ బాధితులు ఆరోగ్యమైన, ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగుళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 9246199922 -
సోరియాసిస్‌కు హోమియోలో పరిష్కారం
సోరియాసిస్ వ్యాధిగ్రస్తులలో చర్మంపై దురదతో కూడిన వెండి రంగు పొలుసులు కనిపిస్తాయి. ఈ వ్యాధి ప్రభావం చర్మం మీద మాత్రమే కాకుండా గోళ్ళు, తల తదితర శరీర భాగాలు కూడా వ్యాధి ప్రభావానికి లోనవ్వవచ్చు... ఎందుకు వస్తుంది? వ్యాధినిరోధకశక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారడం వలన సోరియాసిస్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవడానికి వ్యాధినిరోధకశక్తి గురించి కొంత తెలుసుకుందాం. వైరస్, బ్యాక్టీరియా వంటివి శరీరం మీద దాడి చేసినప్పుడు వాటి నుండి రక్షణ పొందటానికి మన శరీరంలో డబ్ల్యూబీసీ (తెల్ల రక్తకణాలు) అనే ప్రత్యేకమైన రక్తకణాలు పని చేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్ళి ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా గాయాలు మానేలా చేస్తాయి. కానీ ఆటో ఇమ్యూన్ కండిషన్లో ఇవి సొంత కణజాలాన్నే దెబ్బదీస్తాయి. సోరియాసిన్ - వంశపారంపర్యత కొన్ని కుటుంబాలలో సోరియాసిన్ ఆనువంశికంగా వస్తుంది. తల్లిదండ్రులలో ఇద్దరికీ సోరియాసిస్ ఉంటే సంతానానికి వచ్చే అవకాశం 30 శాతం ఉంటుంది. ఒకవేళ ఒకరికే ఉంటే 15 శాతం వచ్చే అవకాశం ఉంటుంది. సోరియాసిస్ ప్రభావం: సోరియాసిస్‌ను ఒక చర్మవ్యాధిగా మాత్రమే గుర్తిస్తే అది తప్పు. దీనివలన సాధారణంగా ప్రాణప్రమాదం జరుగదు. కాని వ్యాధి తీవ్రత వలన, దీర్ఘకాలం బాధించడం వలన బాధితులు డిప్రెషన్‌కు లోనవుతారు. ఇది వ్యాధితీవ్రతను మరింత పెంచుతుంది. సోరియాసిస్‌లో అలా వికటించిన వ్యాధినిరోధకశక్తి వలన సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి అనుబంధ అంశంగా గల ఇన్ఫ్లమేటీ వలన సోరియాసిస్‌తో బాధపడేవారికి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవేకాక ఈ వ్యాధిగ్రస్తులు డయాబెటిస్, రక్తపోటుకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువే. సోరియాసిస్‌లో రకాలు సోరియాసిన్ వ్యక్తమయ్యే విధానాన్ని బట్టి 5 రకాలుగా వర్గీకరించారు. ప్లేగు సోరియాసిస్: ఇది సోరియాసిస్‌లో ఎక్కువగా కనిపించే రకం ఎర్రని మచ్చలుగా మొదలయి పెద్ద పొడగా మారడం దీని ప్రధాన లక్షణం. ఎఠ్ట్ట్చ్ట్చ సోరియాసిస్: ఇది ఎర్రని పొక్కులు, పొలుసులతో వాన చినుకుల్లా కనిపిస్తాయి. వ్యాధి హఠాత్తుగా మొదలవుతుంది. పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. పస్టులర్ సోరియాసిన్: దీనిలో చీముతో కూడిన పొక్కులు తయారు అవుతాయి. ఇన్వర్సివ్ సోరియాసిన్: దీనిలో పలుచగా పొట్టు లేకుండా ఎర్రగా కనిపించే మచ్చలు చర్మపు ముడతలలో వస్తాయి. Exythrodermic సోరియాసిస్: దీనిలో ఎర్రని వాపుతో కూడిన మచ్చలు పెద్ద ఆకారంలో తయారవుతాయి. సోరియాసిస్‌ను తీవ్రం చేసే అంశాలు: 1. చల్లని పొడి వాతావరణం 2. మానసిక ఒత్తిడి. 3. కొన్ని రకాల మందులు (మలేరియా మందులు, లితేలయ, బీటా, బ్లాకర్స్, మాంటి) 4. ఇన్ఫెక్షన్స్ మరియు ఇతర వ్యాధులు. 5. అలవాట్లు 6. హార్మోన్ తేడాలు 7. ఆహార పదార్థాలు-ఉదా: గ్లూటన్ ఎక్కువగా ఉండే ఆహారం. కాన్స్టిట్యూషన్ పద్దతిలో సోరియాసిస్ నివారణ గురించి తెలుసుకుందాం కాన్స్టిట్యూషన్ విధానం ద్వారా మందులు ఇవ్వడం అంటే ఒక వ్యక్తి మానసిక శారీరక పరిస్థితులే కాకుండా ఎమోషనల్ పరిధిని కూడా పూర్తిగా అర్థం చేసుకుని మందులు ఇవ్వడం.తర్వాత ఏయే పొటెన్సీలో ఎంత డోస్ ఇవ్వాలి అనేది ముఖ్యం. మైనమ్ (సోరిక్, సైకోటిక్, సిఫిలిటిక్)ను బట్టి పొటెన్సీనీ నిర్ణయించి మందులు ఇవ్వబడతాయి. కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా సరైన మందులు, పొటెన్సీ డోస్ ఇచ్చినప్పుడు వ్యాధి పూర్తిగా నివారించబడుతుంది. సాధారణంగా వాడే మందుల వలన ఈ సోరియాసిన్ నుండి తాత్కాలికంగా తగ్గినట్లు లేదా కొన్నిసార్లు అస్సలు ఫలితమే లేకపోవడం జరుగుతుంది. అదే హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధి తీవ్రతను బట్టి నియంత్రించి పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సోరియాసిస్‌ను అరికట్టవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స కాలం నిర్థారించబడుతుంది. డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగుళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 9246199922