మధుమేహానికి హోమియోలో చక్కని పరిష్కారం | Good solution to Diabetes in Homoeopathy | Sakshi
Sakshi News home page

మధుమేహానికి హోమియోలో చక్కని పరిష్కారం

Published Thu, Aug 15 2013 11:28 PM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM

మధుమేహానికి హోమియోలో చక్కని పరిష్కారం

మధుమేహానికి హోమియోలో చక్కని పరిష్కారం

నవీన యుగంలో వయస్సు, లింగ-విచక్షణ లేకుండా రాను రాను మధుమేహ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. భారతదేశంలో, అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో వీరిసంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ‘మధుమేహం’ లేదా ‘డయాబెటిస్’ వ్యాధికి కారణాలు అనేకం ఉన్నాకానీ మానసిక ఒత్తిడి, ఆందోళన, మనోవ్యాధులు వంటి మానసికమైన కారణాలు ప్రధానంగా ఉండడమే గణనీయంగా పెరిగిపోతున్న వ్యాధిగ్రస్తులకు సూచనగా ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే ‘డయాబెటిస్’ ఒక వ్యాధికాదు. ఇది ఒక మెటబాలిక్ డిసార్డర్, అంటే శరీరంలో జీవక్రియ సరిగ్గా జరగపోవడం వలన రక్తంలో, మూత్రంలో చక్కెర శాతం పెరిగిపోవడం వలన ఏర్పడే స్థితి మాత్రమే. డయాబెటిక్ లక్షణాలైన అధిక మూత్రం, తీవ్రమైన దాహం, ఆకలి, శారీరక దౌర్బల్యం అన్నీ కూడా జీవక్రియ సరిగ్గా జరగకపోవడం వలన వచ్చేవే. దీనికి కారణం శరీరంలో ‘పాంక్రియాస్’ అనే గ్రంథి నుండి వెలువడే ‘ఇన్సులిన్’ అనే హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం లేదా దానిని శరీరం సరిగ్గా వినియోగించుకోకపోవడమే.
 
ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని ఆధారం చేసుకొని డయాబెటిస్‌ను రెండు ప్రధానరకాలుగా విభజించుతారు. 1. డయాబెటిస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. దీనికి కారణం పాంక్రియాస్ గ్రంథిలో బీటాకణాలు పూర్తిగా నాశనం అవడమే. ఇన్సులిన్ ఉత్పత్తి నిలిచిపోవడం వలన శరీరంలో కార్బోహైడ్రేట్ మెటబాలిజమ్ దెబ్బతిని మనిషి స్పృహకోల్పోయి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది.
 
అందువలన వీరిలోకి బయట నుండి ఇన్సులిన్‌ని ఇంజక్షన్ రూపంలో ప్రవేశపెడతారు. అందుకే ఈ రకం డయాబెటిస్‌ని ‘ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెల్లిటన్’ (IDDM) అని అంటారు.
 
 2. డయాబెటిస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగానే ఉన్నప్పటికీ శరీరం దానిని సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి, ఈ పరిస్థితినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. ఇది సాధారణంగా ఊబకాయం ఉన్నవారిలో, మద్యం సేవించేవారిలో, శారీరక శ్రమలేకుండా స్థిరంగా ఉండే వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. వీరికి ఇన్సులిన్ బయటినుండి ఇచ్చే అవసరం ఉండదు  కానీ రక్తంలో చక్కర శాతాన్ని నియంత్రించే మందులను (యాంటీ-హైపర్ గ్లైసీమిక్ డ్రగ్స్) సూచిస్తారు. అందుకే దీనిని నాన్-ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెల్లిటస్ (ూఐఈఈక) అని అంటారు. అయితే వీరిలో కూడా షుగర్ లెవల్స్ టాబ్లెట్ల ద్వారా నియంత్రించ లేకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ సిఫారసు చేస్తారు. స్త్రీలలో గర్భధారణ సమయంలో వచ్చి ఆ తర్వాత కూడా ఉండే డయాబెటిస్‌ని ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అని అంటారు.

డయాబెటిస్ వలన వచ్చే లక్షణాలే ఇబ్బందికరంగా ఉంటే దానివలన తలెత్తే కాంప్లికేషన్లు పేషెంట్‌ను మరింత కృంగదీస్తాయి. కొన్నిరకాల కాంప్లికేషన్లు అకస్మాత్తుగా, తీవ్రంగా వస్తాయి. షుగర్ లెవెల్స్‌ని సరిగ్గా నియంత్రించకపోతే ‘డయాబెటిక్ కీటోఎసిడోసిస్’ అనే సమస్య తలెత్తుతుంది. మందులు వేసుకొంటూ ఆహారం సరిగా తీసుకోకపోతే చక్కెర స్థాయి తగ్గిపోయి ‘హైపోగ్లైసీమెయా’ తలెత్తుంది. శరీరమంతా చెమటలు రావడం, వణుకురావడం, విపరీతమైన నీరసానికి గురయ్యి కళ్ళు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలు హైపోగ్లైసిమియాకి గురైన వ్యక్తిలో కన్పిస్తాయి. కొన్నిరకాల దుష్ర్పభావాలు దీర్ఘకాలంగా వేధిస్తుంటాయి.
 
 రక్తనాళాలలో వచ్చే మార్పుల వలన హృద్రోగాలు, కంటిచూపు మందగించడం (డయాబెటిక్ రెటిబోపతి), మూత్రపిండాలు దెబ్బతినడం (డయాబెటిక్ నఫ్రోపతి) వంటి కాంప్లికేషన్స్ దీర్ఘకాలంగా డయాబెటిస్‌తో బాధపడే వారిలో కనబడతాయి. గాయాలు సరిగ్గా మానకపోవడం, జననేంద్రియాలలో దురదలు, లైంగిక సమస్యలు స్త్రీ-పురుషులను కృంగదీస్తాయి. సూక్ష్మనాళికలు దెబ్బతినడం వలన రక్తప్రసరణ సరిగ్గా జరగక వచ్చే గాంగ్రీన్ వంటి సమస్యల వలన కొన్నిసార్లు అవిటితనం తలెత్తే అవకాశం ఉంటుంది.


 కాంప్లికేషన్స్‌ని అరికట్టడానికి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవలసిన అవసరం ఉంది. గ్లూకోజ్ లెవెల్స్ సాధారణంగా భోజనం తర్వాత 160 mg/dl కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. క్రమంగా వ్యాయామం చేస్తూ, మందులు, ఆహారం సమయానికి తీసుకొంటూ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించవలసిందే. డయాబెటిస్‌తో పాటు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్న వారిలో దుష్ర్పభావాలు త్వరగా వస్తాయి గనుక రక్తపోటును, కొలస్ట్రాల్‌ను కూడా నియంత్రించుకోవాలి. మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకొని సాధ్యమైనంత మనస్సును ప్రశాంతంగా ఉంటుకోవాలి.
 
 హోమియోపతిలో ఇచ్చే కాన్స్‌టిట్యూషనల్ చికిత్స ద్వారా కేవలం షుగర్ లెవెల్స్ కంట్రోల్ చెయ్యడమే కాకుండా కాంప్లికేషన్స్‌ను నివారించడం, ఉన్నవారిలో కాంప్లికేషన్స్‌ని తొలగించడానికి సహాయపడుతుంది. హోమియోపతి అనగానే డయాబెటిస్‌కి యాసిడ్ ఫాస్, యురేనియమ్ నైట్ వంటి మందులే ఉన్నాయని అనుకుంటారు. కాని అది సరికాదు. జన్యుపరమైన, మానసికపరమైన కారణాలను పరిగణిస్తూ, వ్యక్తిగత లక్షణాలపై కేంద్రీకరిస్తూ ఇచ్చే కాన్స్‌టిట్యూషనల్ రెమెడీ ద్వారా రోగికి చక్కని ఫలితం లభిస్తుంది. సరియైన మందును, సరిపడే మోతాదులో నిర్ణీత కాలం దాకా వాడితే... 1. రోగుల్లో ఇన్సులిన్ డొసేజ్‌ని తక్కువ చేయడం, 2. రోగుల్లో యాంటీ హైపర్ గ్లైసిమిక్ డ్రగ్స్ మోతాదుని క్రమంగా తక్కువ చేయడం, పూర్తిగా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. హోమియోపతి మందుల ద్వారా డయాబెటిక్ బాధితులు ఆరోగ్యమైన, ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.
 
 డా॥టి. కిరణ్‌కుమార్
 పాజిటివ్ హోమియోపతి
 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
 వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగుళూరు - చెన్నై
 అపాయింట్‌మెంట్ కొరకు 9246199922

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement