రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో చక్కని పరిష్కారం | Rheumatoid arthritis Homoeo elegant solution | Sakshi
Sakshi News home page

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో చక్కని పరిష్కారం

Published Thu, Oct 3 2013 11:21 PM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో చక్కని పరిష్కారం

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో చక్కని పరిష్కారం

మానసికమైన ఒత్తిడి, మనోవ్యాకులత, బాధలు, భయాలు, ఆందోళన వలన శరీరంలోని రసాయనాలలో ఎన్నో మార్పులు జరిగి అనేక వ్యాధులకు గురి చేస్తాయనే విషయం అందరికీ విదితమే. అయితే వీటి వలన కేవలం హార్మోన్ల అసమతుల్యత, హైపర్ టెన్షన్, కొన్ని రకాల సైకో-పామటిక్ డిసార్డర్స్ మాత్రమే కాదు, సున్నితంగా ప్రతిస్పందించే వారిలో జన్యుపరమైన మార్పులకు దారితీయవచ్చును, అందువలననే ఈ మధ్యకాలంలో ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిని ఎక్కువగా చూస్తున్నాము. ఈ తరహా వ్యాధులలో ప్రధానమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్ (R.A). ఈ వ్యాధి బారిన పడేవారిలో అధిక శాతం మంది స్త్రీలే అవ్వడం గమనార్హం.
 
 స్త్రీ-పురుషులలో యాభై ఏళ్ళలో నొప్పులు మొదలవుతాయి, ఇది వయస్సు పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలో క్యాల్షియం తగ్గిపోవడం వలన వస్తూ ఉంటుంది. దీనిని ‘ఆస్టియో అర్థరైటిస్’’ అంటారు. ఇందుకు భిన్నంగా ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే యువతులలో చేతుల్లో, పాదాలలలో ఉండే చిన్న చిన్న కీళ్ళలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులు రావడం రుమటాయిడ్ ఆర్థరైటిన్ లక్షణాలు. అయితే ఇది పురుషుల్లోను, పిల్లల్లోను కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్ఫ్‌డిసీజ్’ అంటారు.
 
 లక్షణాల తీవ్రతలో వివిధ మార్పులు కన్పిస్తాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో కండరాల్లో నొప్పులు, కీళ్ళను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. సాధారణంగా కీళ్ళనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా ద్విపార్శకంగా చేతులలో, కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం, పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అని అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్‌లో మోచేతులపైన, తొడలపైన వచ్చే చిన్న చిన్న గడ్డలను ‘రుమటాయిడ్ నాడ్యుల్స్’ అని అంటారు.
 
 రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. వ్యాధి లక్షణాలను బట్టి, రక్తంలో రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనే పరీక్ష పాజిటివ్‌గా రావడం, ్ఠ-రేస్‌లో వచ్చే మార్పులను ఆధారంగా చేసుకొని, డిఫార్మటీస్‌ని పరిశీలించి వ్యాధిని నిర్ధారిస్తారు.  రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి తీవ్రతను, వాడే మందుల ప్రభావాన్ని అంచనా వెయ్యడానికి ఇ.ఎన్.ఆర్, సి.ఆర్.పి. వంటి పరీక్షలు చేయించుకోవాలి.
 
 ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్ వలన, స్టిరాయిడల్ మందుల వలన నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అసలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మటీస్‌ని నివారించలేము. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు.
 
 ...పాజిటివ్ హోమియోపతి
 
 డా॥టి. కిరణ్‌కుమార్
 పాజిటివ్ హోమియోపతి

 
 అపాయింట్‌మెంట్ కొరకు 9246199922
 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
 వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై
 www.positivehomeopathy.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement