ప్రస్తుత పరిస్థితిలో మానవుడి జీవిత విధానం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధ్దంగా ఉండడం వలన సరైన వ్యాయమం లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, పౌష్టికాహార లోపం వలన త్వరితగతిన మానవుడు ఆర్థరైటిస్‌కు గురి అవుతున్నాడు. అందుకే జనాభాలో 50 శాతం మంది 40 సం॥దాటినవారు ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2030 నాటికి గణనీయంగా పెరుగుతుందని వైద్యనిపుణుల అంచనా. ఆర్థరైటిస్ అంటే కీళ్ళలో ఉండే కార్టిలేజ్ (మృదులాస్థి) అనే మెత్తని రబ్బరుపదార్థం అరుగుదలకు గురి అవడం వలన ఎముకలలో రాపిడి ఏర్పడి ఇన్‌ఫ్లమేషన్‌కు దారి తీయడం.
కారణాలు: అధికబరువు, వయస్సు, ఇన్ఫెక్షన్స్, వంశ పారంపార్యం, ఇన్‌ఫ్లమేటరీ కారణాలు, ప్రమాదాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మొదలైన కారణాల చేత రకరకాలుగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది.
ఆర్థరైటిస్‌లో రకాలు
ఆస్టియో ఆర్థరైటిస్: ఇది ఎక్కువగా 40 సం॥వయస్సు దాటినవారిలో కార్టిలేజ్ అరుగుదల వలన ఎముకల మధ్య రాపిడి వలన వస్తుంది. ఈ డీజనరేటివ్ ఆర్థరైటిస్ మగవారితో పోలిస్తే ఆడవారిలో (ఆస్టియో ఆర్థరైటిస్) ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా నెలసరి ఆగిపోయిన ఆడవారిలో 70 శాతం మంది ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. ఆర్థరైటిస్ అనేది శరీరంలో ఏ కీళ్లలోనైనా ఏర్పడే అవకాశం ఉంది. కాని శరీర బరువునంతటినీ మోసే మోకాలులో అధికంగా కనబడుతుంది.
లక్షణాలు: మోకాళ్లనొప్పి
వాపు, చేతితో స్పర్శించినప్పుడు వేడిగా ఉండటం, నడుస్తున్నప్పుడు కిరకిరమని శబ్దం రావడం (క్రిస్ట్) కీళ్లు వాపుకు గురై కదలికలు తగ్గడం వలన నడవడానికి చాలా ఇబ్బంది పడటం, అధిక బరువు ఉన్న రోగిలో మోకాళ్లు అరుగుదలకు గురి అయి నడకలో మార్పు వచ్చి కుంటినట్లుగా నడవడం, కింద కూర్చోవడం.. ఇలా.. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా రోగి ఉదయం నిద్రలేచి నడవడం అంటే చాలా బాధతో కూడుకున్నటు వంటి పని అవుతుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్: ఇదొక ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది జీవనక్రియల్లో ఏర్పడే అసమతుల్యత వలన వస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఇది ఎక్కువగా 12 నుండి 45 సం॥వయస్సు వారిలో కనబడుతుంది. ఈ వ్యాధి ప్రధానంగా చిన్నకీళ్లైన మణికట్టు, చేతివేలు (మెటటార్సో ఫాలేంజియల్ జాయింట్స్), ఇంటర్ ఫాలెంజియల్ జాయింట్స్, మడిమ మెకార్సో ఫాలెంజియల్ జాయింట్స్‌లో ముందుగా ప్రభావితం అయి పెద్ద జాయింట్‌లకు వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి శరీరంలో ఇరువైపులా ఉండే కీళ్ళకు సమాంతరంగా వ్యాఫ్తి చెందుతుంది. (బై లేటరల్ సిమెట్రికల్) కీళ్ళు వాపునకు గురి అయి కదలికలు పూర్తిగా స్తంభించి కీళ్ళు వైకల్యానికి దారి తీస్తాయి. ఇది ఎక్కువగా శీతాకాలం లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కీళ్ళ కదలికలు పూర్తిగా స్తంభించి చాలా నొప్పిని కలిగిస్తాయి.
గౌటి ఆర్థరైటిస్: ఇదొక ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది జీవక్రియలో ఏర్పడి, ఉప ఉత్పన్నమైన యూరిక్ ఆసిడ్ అధిక మోతాదులో రక్తంలో చేరి సోడియంతో కలసి మోనో సోడియం సిట్రైట్ అనే స్ఫటికాలు ఏర్పడి కీళ్ళలో చేరడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
లక్షణాలు: ఇది కాలి బొటనవేలులో ఎక్కువగా కనిపిస్తుంది. కీలు వాపుకు గురి అయి తీవ్రమైన నొప్పిని, మంటను కలుగజేస్తుంది. ఈ వ్యాధి ఆల్కహాల్, డ్రైఫ్య్రూట్స్ అధిక మాంసకృత్తులు తీసుకుంటే వ్యాధి తీవ్రత అధికమవుతుంది.
సోరియాటిక్ ఆర్థరైటిస్: ఇది సిరినెగిటివ్ ఇన్‌ఫ్లమేటరి ఆర్థరైటిస్. సోరియాసిస్ ఉన్నవారిలో 30 శాతం మందికి సోరియాటిక్ ఆర్థరైటిస్‌తో బాధపడతారు. ఇందులో ముఖ్యంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా కీళ్ళలో వ్యాప్తి చెందుతాయి.
ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్: దీనినే సపోర్టివ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది.
రక్తం ద్వారా లేదా కీళ్ళ చుట్టూ ఉండే కణజాలం ఇన్‌ఫెక్షన్‌కి గురి అయినప్పుడు, ఇన్ఫెక్షన్ సైనోవియల్ కుంబ్రేన్‌లో చేరడం వలన ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ సంభవిస్తుంది. ఇది ఎక్కువగా ఆర్టిఫిషియల్ జాయింట్ రిప్లేస్‌మెంట్ చేసుకునే వారిలో కనిపిస్తుంది.
వీటన్నింటికీ హోమియోలో శాశ్వతమైన చికిత్సావిధానాలున్నాయి.
హోమియో ట్రీట్‌మెంట్
పైన తెలిపిన అన్ని రకాల ఆర్థరైటిస్‌కు హోమియో వైద్యంలో చాలా మెరుగైన చికిత్స ఉంటుంది. మిగతా వైద్యవిధానాలతో పోలిస్తే నొప్పి తగ్గించడంలోనూ, కీళ్ళ కదలికను సురక్షితంగా ఉంచడంలోను హోమియో వైద్య విధానంలో మంచి చికిత్స ఉంటుంది. హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌లో జెనెటిక్ కాన్‌స్టిట్యూషన్ విధానం ద్వారా కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా జాయింట్ కదలికలను సురక్షితంగా ఉంచడం ద్వారా రోగికి మెరుగైన ఫలితాలు వస్తాయి.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్
సి.ఎం.డి.,
హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99
టోల్ ఫ్రీ: 1800 102 2202
బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.