నడుమునొప్పి అంటేనే భయం... ఏకాస్త వంగాలన్నా, కదలాలన్నా భయం. సగటున సుమారు 40 నుండి 50 శాతం జనాభాలో జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నడుమునొప్పి వస్తుంది.
నడుమునొప్పి అంటేనే భయం... ఏకాస్త వంగాలన్నా, కదలాలన్నా భయం. సగటున సుమారు 40 నుండి 50 శాతం జనాభాలో జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నడుమునొప్పి వస్తుంది. కాని ప్రస్తుత జీవనవిధానాల వలన ఇది 80 శాతం జనాభాను ప్రభావితం చేస్తోంది. సాధారణంగా ఇది 20 నుండి 40 సంవత్సరాల వయస్సు వారిలో ఎక్కువ శాతం మొదలవుతుంది. ఒక్కసారి నడుమునొప్పి వస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది.
కారణాలు
సాధారణంగా ఒకే పొజిషన్‌లో ఎక్కువగా కూర్చోవడం
ఎక్కువ దూరం ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించడం
వెన్నుకు దెబ్బ తగలటం
వెన్నుకు సంబంధించిన ఎముకలు, కండరాలు, డిస్క్, నరాల సమస్యల వలన నడుమునొప్పి రావచ్చు
వెన్నుపూస క్షయ, osteomyelitis కు గురికావడం
గర్భాశయ వ్యాధుల వలన, అండాశయ వ్యాధుల వలన నడుమునొప్పి రావచ్చు
గర్భధారణ సమయంలో కూడా స్త్రీలలో నడుమునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది
నడుమునొప్పికి సంబంధించిన వెన్ను మరియు డిస్క్ సమస్యలు
యాంగ్యులర్ టియర్: వయస్సు పైబడే కొద్ది మరియు వెన్ను మీద అధిక ఒత్తిడి పడినప్పుడు వెన్నుపూస (వర్టిబ్రా) మధ్య ఉండే ఇంటర్ వర్టిబ్రల్.
డిస్క్‌లోని ఒక భాగం చిరగటాన్ని ఆన్యూలర్ టియర్ అంటారు. ఇలా చిరిగిన ఆన్యూలర్ వాపునకు గురై నడుమునొప్పికి దారి తీస్తుంది. దీనినే డిస్క్ ‘డీజనరేటివ్ డిసీజ్’ అంటాము.
హెర్నియేటెడ్ డిస్క్: దీనినే డిస్క్ ప్రొలాప్స్ అని కూడా అంటారు. బలహీనపడిన డిస్క్ అంచు చిరిగి, దాని మధ్యభాగంలో ఉండే మెత్తని న్యూక్లియస్ బయటకు తోసుకొని రావడాన్ని Herniation అంటారు. ఇలా Herniate అయిన డిస్క్ వెన్ను నుండి బయటకు వచ్చే నరాలను నొక్కినప్పుడు వచ్చే లక్షణాలను ‘సయాటికా’ (Sciatica) అంటారు.
స్పాండిలోలిస్థిసిస్: ఇందులో వెన్నులోని ఎముకలు పరిమితికి మివంచి ముందుకు కాని వెనకకు కాని జారటాన్ని స్పాండిలోలిస్థిసిస్ అంటారు. ఇది వెన్నులోని ఎముకలు (వర్టిబ్రా) ను పట్టి ఉంచె లిగమెంట్లు సాగటం మరియు వర్టిబ్రాలోని ఒక భాగం విరగటం వలన వస్తుంది. స్పాండిలోలిస్థిసిస్ తీవ్రంగా ఉంటే నరాఉల మెలికపడటం మరియు నరాల పై వర్టిబ్రా వత్తిడి వలన తీవ్రమైన నడుము నొప్పికి, ఇతర లక్షణాలకు దారితీస్తుంది.
స్పైనల్ స్టీనోసిస్: వెన్నులోపల ఉండే స్పైనల్ కానల్ అనే నాళం ఇరుకుగా మారటం లేదా మూసుకుపోవటాన్ని స్పైనల్‌స్టీనోసిస్ అని అంటాము. ఇది తీవ్రంగా ఉంటే నాళంలో ఉండే వెన్నుపాము వత్తిడికి గురై తీవ్రమైన వెన్నునొప్పితోపాటు, కాళ్ళు పడిపోవడం, తిమ్మిర్లు రావడం, మొద్దుబారటం, మలమూత్రాల విసర్జన మీద నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
యాంకిలోసింగ్ స్పాండిలోసిస్ Ankylosing spondilitis
ఇది వెన్నుపూస దీర్ఘకాలిక వాపునకు గురి కావడం వలన వస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డీసీజ్.
ఇది ఎక్కువగా తుంటి కీలు (sacro ilian joint), వెన్నుపూసను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా యుక్తవయస్సులో ఉన్న వారికి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన వారి వెన్నుపూసలోని ఎముకలు బిగుసుకు పోయి నడుము కదలికలు కష్టతరం అవుతాయి. దీనినే "Bamboo spine' అని అంటారు.
వర్టిబ్రా (Fracture): వెన్నుకు దెబ్బ తగలటం లేదా దీర్ఘకాలికంగా Osteoporosis వలన వత్తిడికి గురి అయినప్పుడు వెన్నులోని వర్టిబ్రా విరిగిపోయే ప్రమాదం ఉంది. దీనివలన తీవ్రమైన వెన్నునొప్పి, నరాలకు సంబంధించిన వ్యాధి లక్షణాలు వస్తాయి.
లక్షణాలు
సాధారణం నుండి తీవ్రమైన నడుము నొప్పి
నడుము పట్టేయడము.
వెన్నులోని ఎముకలతో పాటు నరాలు కూడా వ్యాధి బారినపడితే నొప్పి నడుములో ప్రారంభమై పిరుదుల్లోకి, అక్కడినుండి తొడల్లోకి, కాళ్ళు, పాదాల వరకు వ్యాపిస్తుంది. కాళ్ళలో తిమ్మిర్లు, పాదాలలో మంటలు రావడం, మొద్దుబారటం వంటి లక్షణాలు ఉంటాయి.
నడుమునొప్పి దీర్ఘకాలికంగా ఉండి, జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది క్షయ, కాన్సర్ లక్షణాలు అయి ఉండవచ్చు.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు
సీబీపీ, ఆర్ ఫ్యాక్టర్
ఎక్స్‌రే
సిటీస్కాన్
ఎమ్మారై స్కాన్
హెచ్‌ఎల్‌ఏ-బీ27
ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చేయటం వలన వ్యాధి తీవ్రత ఇతర తీవ్రమైన వ్యాధులను గుర్తించవచ్చు.
నడుము నొప్పికి గల కారణాన్ని గుర్తించి సరయిన చికిత్స తీసుకోవడమే కాకుండా రోజువారి వ్యాయామం, Strech Excersices, చేయడం, కూర్చునే, నిద్రపోయే పొజిషన్‌ను తగిన విధంగా మార్చుకొని సరిచేసుకోవడం వలన నడుము నొప్పిని అదుపు చేయవచ్చు.
హోమియోకేర్ వైద్యం
హోమియోకేర్ ఇంటర్ నేషనల్‌లో జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ వైద్యపద్ధతి ద్వారా వెన్నునొప్పి, సయాటికా, కాళ్ళతిమ్మిర్లు, పాదాల మంటలనే కాకుండా మూల కారణాన్ని గుర్తించి వైద్యం చేయడం ద్వారా వెన్నుపూసను దృఢంగా చేసి మరల నడుము సమస్యలు రాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సి.ఎం.డి.,
హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99
టోల్ ఫ్రీ: 1800 102 2202
బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.