Dr. Srikanth morlavar
-
బ్రెయిన్ ట్యూమర్‌కు ఆపరేషన్ తప్పదా?
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 56. గత కొద్దికాలంగా ఆమె మెడ నొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్‌కు చూపిస్తే ఆమెకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉందని చెప్పి, కొన్ని సూచనలు చేసి, మందులు రాశారు. ఆ సూచనలు పాటిస్తూ, మందులు వాడుతున్నారు. కాని అంతగా ఫలితం కనిపించడం లేదు. హోమియోలో ఈ జబ్బుకు శాశ్వత పరిష్కారం ఉందా? - బి.అమరవాణి, పిడుగురాళ్ల మారుతున్న జీవన శైలి కారణంగా సుమారు 90 శాతం మంది ప్రతి ఒక్కరూ 60 సంవత్సరాలు వచ్చేసరికి కొద్దిపాటి స్పాండిలోసిస్ సమస్యతో బాధపడతారని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఈ సమస్య ఇటీవలి కాలంలో యుక్తవయస్కుల్లోనూ కనిపిస్తోంది. దీనికి గల కారణాలు అనేకం. సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా మెడనొప్పి ముఖ్యంగా గంటల తరబడి కూర్చొని పని చేయడం, సరియైన వ్యాయామం లేకపోవడం, అధిక బరువులు ఎత్తడం, పెరుగుతున్న పని ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏమిటి? మానవ శరీర వ్యవస్థలో వెన్నెముక ఒక మూలస్తంభం లాంటిది. వెన్నుపూస పలు విభాగాల సమ్మేళనం. వెన్నెముకకు తోడుగా కండరాలు, డిస్కులు, లిగమెంట్లు ఉంటాయి. ఇవి సులభంగా వంగడానికి, శరీరంలోని కదలికలకు తోడ్పడతాయి. వెన్నెముకలోని ప్రతి రెండు పూసల మధ్య మృదువైన పదార్థం ఉంటుంది. దీనినే డిస్క్ అంటారు. వెన్నుపాము (స్పైనల్ కార్డ్) నుండి అసంఖ్యాకమైన నరాలు వెళుతుంటాయి. మెడభాగం నుంచి వెళ్లే నరాలు చేతుల్లోగుండా, నడుం భాగం నుండి వెళ్లే నరాలు కాళ్లల్లో గుండా వెళుతుంటాయి. వెన్నెముక మెడ, నడుము భాగాల్లోని డిస్కులే ఎక్కువగా దెబ్బతింటాయి. కాని మెడ దగ్గర ఎక్కువగా రావడం వల్ల దీనిని సర్వైకల్ స్పాండిలోసిస్ అని పిలుస్తారు. కారణాలు: వెన్నెముకకు దెబ్బ తగలడం, అధిక బరువులు ఎత్తడం, గంటల తరబడి కూర్చొని పని చేయడం, సరైన పద్ధతులు పాటించకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేయడం, వయసు పెరిగే కొద్దీ వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదలకు గురి కావడం, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: మెడనొప్పి, మెడ బిగుసుకుపోవడం, నొప్పి మెడ ప్రాంతంలో ప్రారంభమై భుజాల్లోకి, చేతుల వరకు వ్యాపించడం, తిమ్మిర్లు, చేతి కండరాలు బలహీనపడటం, భుజాలు, చేతివేళ్లలో స్పర్శ తగ్గిపోవడం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు నిర్థారణ: ఎక్స్‌రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై, సీబీపీ, ఇ.ఎస్.ఆర్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: హోమియో కేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్యపద్ధతి ద్వారా మెడనొప్పి తగ్గించడమే కాకుండా వెన్నుపూసలను దృఢంగా చేయడం ద్వారా మెడ, వెన్ను సమస్యలు తిరగబెట్టకుండా స్పాండిలోసిస్ సమస్యలను సంపూర్ణంగా నయం చేయవ చ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ న్యూరోసర్జరీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నాకు ఇటీవల బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. బ్రెయిన్ ట్యూమర్‌కు తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందా? ఆపరేషన్ అంటే నాకు చాలా భయం. ముఖ్యంగా బ్రెయిన్‌కు ఆపరేషన్ చేస్తే తర్వాత మాట పడిపోతుంది, పక్షవాతం వస్తుందేమో అని చాలా భయంగా ఉంది. మందులతో బ్రెయిన్ ట్యూమర్ నయం అయ్యే అవకాశం లేదా? ఆపరేషన్ కాకుండా ఇంకా వేరే చికిత్సలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఆపరేషన్ పట్ల ఆందోళనతో డాక్టర్ వద్దకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. - కళ్యాణి, గుంటూరు మీకు బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. అయితే మీకు మెదడులో ఏర్పడిన కణితి పరిమాణం, కణితి రకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. అన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్లకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. కణితి పరిమాణం మూడు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే ఆపరేషన్ లేకుండా రేడియో సర్జరీ ద్వారా సురక్షితంగా కణితిని తొలగించవచ్చు. ఒకవేళ కణితి పరిమాణం మూడు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ముందు మీరు ఆపరేషన్‌పై ఉన్న భయాన్ని పోగొట్టుకోండి. ఒకవేళ మీకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినా భయపడకండి. బ్రెయిన్ ట్యూమర్‌కు ఆపరేషన్ చేయించుకుంటే మాటపడిపోతుందనీ, పక్షవాతం వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. ప్రస్తుతం అత్యాధునిక శస్త్రచికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి దుష్ర్పభావాలు తలెత్తకుండా సురక్షితంగా అపరేషన్ చేయవచ్చు. ఆపరేషన్‌కు భయపడి వైద్యుల వద్దకు వెళ్లకుండా ఉంటే సమస్య మరింత క్లిష్టంగా మారుతుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలా కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాతనే ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ తర్వాత మళ్లీ మీరు సాధారణ జీవితం గడపగలుగుతారు. - డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్,సికింద్రాబాద్ స్లీప్ కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 12 ఏళ్లు. నిద్రలోంచి ఉలిక్కిపడి మేల్కొంటోంది. కెవ్వున అరుస్తోంది. ఆమె ప్రవర్తన చాలా భయంగొలిపేదిగా ఉంది. మా అమ్మాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి. - సురేశ్‌కుమార్, నల్గొండ నిద్రలో ఉలిక్కిపడి లేవడం, భయపడటం, ఆందోళన పడటం, కెవ్వున అరవడం ఇవన్నీ నిద్రకు సంబంధించిన ఒకరకం సమస్య. దీన్నే ‘స్లీప్ టై’ అంటారు. నిద్రలో ఉండగానే ఇవన్నీ చేస్తారు. నిద్రలోని ఒక దశ అయిన... కనుపాపలు చలించని స్థితి (నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్-నాన్ ఆర్ఈఎమ్) దశలో కనిపించే సమస్య ఇది. నిద్రలో నడవడం కూడా ఈ తరహా సమస్య కిందికే వస్తుంది. ఏదైనా ఒక సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తూ అది తాము పరిష్కరించలేని సమస్య అని బాగా ఆందోళనపడ్డప్పుడు ఒక్కోసారి ఇలా ప్రవర్తిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్లు లేచి, ఈ నైట్టై దశలో 1-2 నిమిషాలు ఉంటారు. తర్వాత మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. వాళ్లకు సాంత్వన కలిగిస్తే ఈ పరిస్థితి క్రమంగా తగ్గిపోతుంది. అలాంటి స్థితిలో ఉన్న పేషెంట్‌ను చూసి, తల్లిదండ్రులు ఆందోళనపడటం చాలా సాధారణం. అయితే మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు. చాలామంది పిల్లల్లో ఈ సమస్య యుక్తవయసు రాగానే తగ్గుతుంది. వాళ్లు ఒకప్పుడు అలా ప్రవర్తించారన్న అంశమే వాళ్లకు గుర్తుండదు. అలాంటి వాళ్లలో అదేమీ మానసిక రుగ్మత కాదు. ఆరుగురిలో ఒక్కరికి మాత్రమే పెద్దయ్యాక కూడా ఈ పరిస్థితి వస్తుంటుంది. యుక్తవయస్కుల్లో కూడా ఈ సమస్య వస్తుందంటే... బహుశా వాళ్లు యాంగ్జైటీ లేదా డిప్రెషన్‌తో బాధపడుతూ ఉండవచ్చు. ఒక్కోసారి నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, దీర్ఘకాలికంగా ఉండే మైగ్రేన్, స్లీప్ఆప్నియా వంటి సమస్యలు కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. మీపాప ఏదైనా సమస్య గురించి ఆందోళన పడుతున్నా, ఏదైనా పరిస్థితి గురించి భయపడుతున్నా... ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలమనే భరోసాను ఆమెకు ఇవ్వండి. మీరు స్లీప్ స్పెషలిస్ట్‌ను సంప్రదించండి. - డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్,కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42. గత కొంతకాలంగా నా మోకాళ్లు తీవ్రంగా నొప్పి పెడుతున్నాయి. డాక్టర్‌ను కలిస్తే కొన్ని పరీక్షలు చేయించి, నాకు ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పి, మందులు రాశారు. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏమిటి? దీనికి హోమియోలో మందులు ఉన్నాయా? - కె.ఎస్.ఆర్. హైదరాబాద్ మన శరీరంలో ఉండే అన్ని కీళల్లో ప్రధానమైనవి మోకాలి జాయింట్లు. ఇవి నడవడానికి, పరుగెత్తడానికీ, మెట్లెక్కడానికీ, వివిధ కదలికలన్నింటికీ సహాయపడతాయి. తొడ ఎముక (ఫీమర్), దిగువ కాలి ఎముక (టిబియా) రెండూ కలిసి మోకాలి జాయింటుగా ఏర్పడి ఉంటాయి. ఈ రెండు ఎముకల చివరి భాగాలు కలిసిన ప్రాంతంలో కార్టిలేజ్ అనే నున్నటి మృదులాస్థి ఉండి, ఇవి మృదువుగా కదలడానికి సహాయపడుతుంది. మోకాలి జాయింటును చుడుతూ సైకోవియం అనే పొర ఉంటుంది. ఈ పొర సైకోవియల్ ఫ్లూయిడ్ అనే ద్రవాన్ని విడుదల చేస్తుంటుంది. ఈ సైకోనియం పొరపై క్యాప్సూల్ అనే మరో గట్టిపొర ఉంటుంది. ఇది మోకాలి జాయింటును స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ఎలా వస్తుందంటే..? ఆర్థరైటిస్ మొదలైన కొన్ని రోజులకు కార్టిలేజ్ క్రమంగా అరిగిపోవటం ఆరంభమవుతుంది. దీంతో క్రమేపీ అది పలుచగా మారుతుంది. దీనికితోడు ఎముకలలో కణజాలం వాపునకు గురై ఎముకల చివరి భాగాలు పెరిగి పోవడంతో ఇది ఆస్టియో ఫైట్స్గా మారిపోతాయి. దీని ప్రభావంతో సైకోనియం పొర ఉబ్బి అదనపు ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఫలితంగా మోకాలి కీలులో వాపు, మోకాలిలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇది మోకాళ్లలోనే కాకుండా చేతి వేళ్లు, వెన్నుపూస, తుంటి, కాలివేళ్లు మొద లైన చోట్ల కూడా కనిపించవచ్చు. కారణాలు: 40 సంవత్సరాలు దాటిన వారిలో ముఖ్యంగా స్త్రీలలో ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఊబకాయం, వంశపారంపర్య చరిత్ర తదితర కారణాల వల్ల, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాథమిక దశలో ఉన్న వారికి కూడా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: కీళ్లనొప్పి, వాపు, బిగుసుకుపోవడంతోపాటు ఉదయం నిద్రలేచిన వెంటనే నడవడం చాలా కష్టంగా ఉంటుంది. వీటికి తోడు కీళ్ల దగ్గర రాపిడి శబ్దాలు, చేతితో ఆ ప్రాంతాన్ని తాకిన ప్పుడు వేడిగా అనిపించడం, కింద కూర్చున్నప్పుడు తీవ్రమైన ఇబ్బంది, ఈ నొప్పి మూలాన నడిచే తీరులో సైతం తేడా వస్తుంది. నిర్థారణ: రోగలక్షణాలను బట్టి, రక్తపరీక్ష, మోకాలి నుండి నీరు తీసి పరీక్ష చేయడం ద్వారా, ఎక్స్‌రే, ఎమ్మారై, సీటీ స్కాన్... హోమియో చికిత్స: హోమియో కేర్ ఇంటర్నేషనల్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానంలో ఆస్టియో ఆర్థరైటిస్‌ను తగ్గించడంలోనూ, కీళ్ల కదలికలను సురక్షితంగా ఉంచడంలోనూ సత్ఫలితాలను సాధిస్తూ వస్తోంది. రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ప్రభావవంతమైన చికిత్స ఇవ్వడం ద్వారా వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 22 ఏళ్లు. నాకు కొంత కాలం క్రితం కాళ్లలో వాపులు రావడం, తరచూ వాంతులు అవుతుండటంతో వైద్యులను సంప్రదించాను. వైద్యపరీక్షలు చేసి, నాకు క్రానిక్ కిడ్నీ సమస్య ఉన్నట్లు నిర్ధారణ చేశారు. వెంటనే డయాలసిస్ ప్రారంభించారు. గత మూడు నెలలుగా వారానికి మూడుసార్లు డయాలసిస్ చేస్తున్నారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఉత్తమమని వైద్యులు చెప్పారు. నా బ్లడ్‌గ్రూపు ఓ పాజిటివ్. మా కుటుంబంలో ఎవరికీ ఆ బ్లడ్ గ్రూపు లేదు. బ్లడ్‌గ్రూపు కలవకపోతే కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉంటుందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - ఎస్.వి.ఆర్. హైదరాబాద్ కిడ్నీ దాత, స్వీకర్త ఒకే బ్లడ్ గ్రూపు కలిగి ఉంటే కిడ్నీ మార్పిడి చేయవచ్చు. అయితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దాత, స్వీకర్తల బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయడం వీలువుతుంది. ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే ఆధునిక వైద్య ప్రక్రియ ద్వారా బ్లడ్‌గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయవచ్చు. ఈ ప్రక్రియలో వేర్వేరు బ్లడ్‌గ్రూపుల్లోని యాంటిజెన్‌ను కలిసేలా చేస్తారు. ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిష్ణాతులైన వైద్యులు, అధునాతన సదుపాయాలు అందుబాటులో ఉన్న ఆసుపత్రుల్లోనే చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా చేసిన కిడ్నీ మార్పిడి కూడా మామూలుగా బ్లడ్ గ్రూప్‌లు కలిసినప్పుడు నిర్వహించే శస్త్రచికిత్సల్లాగా మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయి. మీలాగా బ్లడ్‌గ్రూపులు కలవకపోవడం వల్ల కిడ్నీ మార్పిడి చేయించుకోలేక దీర్ఘకాలికంగా డయాలసిస్‌పైనే ఆధారపడుతున్న ఎంతోమందికి ఏబీఓ ఇన్కాంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. డాక్టర్ ఊర్మిళ ఆనంద్ సీనియర్ నెఫ్రాలజిస్ట్, యశోద హస్పిటల్స్, సికింద్రాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు ఎనిమిదేళ్లు. చాలాకాలంగా ఆయాసం, దగ్గుతో బాధపడుతోంది. ఏమీ తినలేకపోతుంది. కొద్దిగా కారం తిన్నా కడుపులో మంట అని ఏడుస్తోంది. డాక్టర్‌ను కలిశాం. మందులు వాడుతున్నా ఇంకా దగ్గు వస్తూనే ఉంది. మా పాప సమస్య పూర్తిగా తగ్గడానికి ఏం చేయాలో తెలియజేయండి. - పవన్, విజయవాడ మీ పాపకు సాధారణ ఆస్తమాతో పాటు దాని అనుబంధ సమస్యగా యాసిడ్ పెప్టిక్ డిసీజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కడుపునొప్పి (ముఖ్యంగా రాత్రిపూట), వికారం (నాసియా), బరువు సరిగా పెరగకపోవడం వంటి లక్షణాలు యాసిడ్ పెప్టిక్ డిసీజ్‌లో ఉంటాయి. ఇక మీ పాపకు ఉన్న మొదటి సమస్య ఆస్తమా ఇటీవల చాలామందిలో కనిపిస్తోంది. దాదాపు 20 శాతం నుంచి 25శాతం మందిలో ఆస్తమాకు - యాసిడ్ పెప్టిక్ డిసీజ్ (ఏపీడీ/జీఈఆర్) తోడవుతున్నట్లు చాలా అధ్యయనాల వల్ల తెలుస్తోంది. ఇలాంటి పిల్లల్లో భోజనం తర్వాత దగ్గు పెరుగుతుంటుంది. రాత్రివేళ దగ్గు, ఆయాసం వంటి లక్షణాలతో పాటు రిఫ్లక్స్ (తిన్న ఆహారం వెనక్కు రావడం) వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో మానసిక ఒత్తిడి కడుపులోని యాసిడ్ స్రావాలను పెంచుతుంది. కొన్ని రకాల డ్రగ్స్, ఆహారాలు, ఇన్ఫెక్షన్స్, ఆటో ఇమ్యూన్ వ్యాధుల వల్ల పొట్ట, పేగులలో అల్సర్స్ వచ్చే అవకావం ఉంది. కొన్నిసార్లు ఆస్తమా చికిత్సకు వాడే కొన్ని మందుల వల్ల కూడా రిఫ్లక్స్ పెరిగి పేగుకు సంబంధించిన లక్షణాలు ఎక్కువ కావడం జరుగుతుంటుంది. మీ పాపకు పూర్తిస్థాయి ఆస్తమా చికిత్స అవసరం. దాంతోపాటు అసిడిటీతో, గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్‌కు సంబంధించిన మందులు వాడటం ముఖ్యం. ఆహారంలో అసిడిటీని కలిగించే కాఫీ, పుల్లని పండ్లు, మసాలాలు నివారించడం అవసరం. నిద్ర పోవడానికీ, భోజనానికీ మధ్య కనీసం మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. పడుకునే సమయంలో మిగతా శరీరం కంటే తల కాస్త పైన ఉండేలా చూసుకోవాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో పాప లక్షణాలను చాలావరకు తగ్గించవచ్చు. అయితే లక్షణాలు పెరుగుతుంటే మాత్రం ఎండోస్కోపీ చేసి సివియర్ యాసిడ్ పెప్టిక్ డిసీజ్ ఉందా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. బేరియమ్ స్టడీతో పాటు ఎండోస్కోపిక్ ఇవాల్యుయేషన్ ద్వారా పాప సమస్యలకు కారణాన్ని తెలుసుకోవచ్చు. మీరు మరోసారి మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఎముక క్యాన్సర్‌కు హోమియో వైద్యం
క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రారంభదశలోనే గుర్తించి, అనుభవజ్ఞుడైన హోమియో వైద్యుని ఆధ్వర్యంలో చికిత్స జరిగితే వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. కాన్స్టిట్యూషనల్ హోమియోవైద్యం ద్వారా క్యాన్సర్ కణాన్ని నియంత్రణలో ఉంచవచ్చు. రేడియోథెరపీ, కీమోథెరపీ తీసుకుంటూనే హోమియో చికిత్సనూ అనుసరిస్తే... ఇతర దుష్ర్పభావాలు రాకుండా అరికట్టవచ్చు. కొన్ని ముఖ్యమైన హోమియో మందులు హెక్లాలావా: ‘ఆస్టియోసార్కోమా’ వంటి ఎముక క్యాన్సర్, దవడ ఎముక, చీలమండ లోపలి ఎముక (టిబియా)లో వచ్చే క్యాన్సర్లకు వాడదగిన ఔషధం. హైడ్రాస్టిస్ కెనడెన్సిస్: పూర్తి క్యాన్సర్ దశలో వాడదగిన ఔషధం. ఇది ముఖ్యంగా ఎముకలు, నాలుక, ఉదరం, జననాంగాలపై వచ్చే క్యాన్సర్లలో ఉపయోగపడుతుంది. క్యాన్సర్ చికిత్స తర్వాత వచ్చే కండరాల బలహీనతను అధిగమించడానికి ఉపయోగపడుతూనే కండరాల పటుత్వాన్నీ పెంచుతుంది. కాల్కేరియా ఫాస్: వివిధ రకాల క్యాన్సర్ మందులు పూర్తిస్థాయిలో పనిచేయకుండా ఉన్నప్పుడు వాటిని క్రియాశీలం చేసేందుకు కాల్కేరియా ఫాస్ చక్కగా పనిచేస్తుంది. చిన్నపిల్లల్లో ఎదుగుదల లోపాలు లేదా ఎముకల ఫ్రాక్చర్లు త్వరగా తగ్గిపోడానికీ, చిన్నపిల్లల్లో వచ్చే ఎముక క్యాన్సర్లు తగ్గడానికి పనిచేస్తుంది. మెజీరియం: ఇది ఎముక, దాని చుట్టూ ఉండే కవచంపైన ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఎముక నుంచి ఏర్పడే ద్రవంతో కూడిన సిస్టిక్ ట్యూమర్, నుదురు, దవడ ఎముకల్లో వచ్చే చీముగడ్డల నివారణకు ఉపయోగపడుతుంది. సవాయిరోగాన్ని (సిఫిలిస్‌ను) అణచివేయడం వల్ల వచ్చే కపాల వాపు, కపాలంపై వచ్చే కణుతులకు చక్కగా పనిచేస్తుంది. ఫాస్ఫరస్: ఎముక క్యాన్సర్ ముఖ్యంగా తొడ ఎముక (ఫీమర్), కాలిచీలమండ లోపలి ఎముక (టిబియా) పెరుగుదల ఉన్నవారిలో, చీముతో కూడిన కాలి పుండ్లు ఉన్నవారిలో ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కారణంగా అధిక రక్తస్రావం జరగడం, ఎముక చుట్టూ ఉండే కవచం పుండుగా మారి ఊడిపోవడం... ఎముక గరుకుగా మారడం, మంటతో కూడిన నొప్పులు, జ్వరం, చల్లటిపదార్థాలు తీసుకోవాలనిపించడం, అస్థిమితం వంటి వాటికి ఇది మంచి మందు. రేడియం బ్రోమాటం: మొటిమలు, డర్మటైటిస్ అనే చర్మవ్యాధి కి, ఎముకల్లో నొప్పులు, కీళ్లనొప్పులు, ఎముక క్యాన్సర్‌కు పనిచేస్తుంది. ఆరమ్ మెట్: క్యాన్సర్‌తో మనోవ్యాకులతకు గురై ఆత్మహత్య చేసుకోవాలనిపించేవారికి పనిచేస్తుంది. సింఫైటమ్: అన్నిరకాల ఎముక సంబంధ వ్యాధులు... ముఖ్యంగా ఎముక వాపు, దవడవాపు, సార్కోమా వంటి సమస్యలకు వాడదగిన మందు. అంతేకాకుండా సింఫైటమ్ను ఎముక చీలికలు లేదా ఫ్రాక్చర్లు త్వరగా మానడానికి ప్రథమ చికిత్సగా వాడతారు. నరాల నొప్పి, మోకాలి నొప్పి, టెండన్స్ ఇబ్బందులకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. -
నడుమునొప్పికి హోమియోకేర్ పరిష్కారం
నడుమునొప్పి అంటేనే భయం... ఏకాస్త వంగాలన్నా, కదలాలన్నా భయం. సగటున సుమారు 40 నుండి 50 శాతం జనాభాలో జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నడుమునొప్పి వస్తుంది. కాని ప్రస్తుత జీవనవిధానాల వలన ఇది 80 శాతం జనాభాను ప్రభావితం చేస్తోంది. సాధారణంగా ఇది 20 నుండి 40 సంవత్సరాల వయస్సు వారిలో ఎక్కువ శాతం మొదలవుతుంది. ఒక్కసారి నడుమునొప్పి వస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కారణాలు సాధారణంగా ఒకే పొజిషన్లో ఎక్కువగా కూర్చోవడం ఎక్కువ దూరం ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించడం వెన్నుకు దెబ్బ తగలటం వెన్నుకు సంబంధించిన ఎముకలు, కండరాలు, డిస్క్, నరాల సమస్యల వలన నడుమునొప్పి రావచ్చు వెన్నుపూస క్షయ, osteomyelitis కు గురికావడం గర్భాశయ వ్యాధుల వలన, అండాశయ వ్యాధుల వలన నడుమునొప్పి రావచ్చు గర్భధారణ సమయంలో కూడా స్త్రీలలో నడుమునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది నడుమునొప్పికి సంబంధించిన వెన్ను మరియు డిస్క్ సమస్యలు యాంగ్యులర్ టియర్: వయస్సు పైబడే కొద్ది మరియు వెన్ను మీద అధిక ఒత్తిడి పడినప్పుడు వెన్నుపూస (వర్టిబ్రా) మధ్య ఉండే ఇంటర్ వర్టిబ్రల్. డిస్క్‌లోని ఒక భాగం చిరగటాన్ని ఆన్యూలర్ టియర్ అంటారు. ఇలా చిరిగిన ఆన్యూలర్ వాపునకు గురై నడుమునొప్పికి దారి తీస్తుంది. దీనినే డిస్క్ ‘డీజనరేటివ్ డిసీజ్’ అంటాము. హెర్నియేటెడ్ డిస్క్: దీనినే డిస్క్ ప్రొలాప్స్ అని కూడా అంటారు. బలహీనపడిన డిస్క్ అంచు చిరిగి, దాని మధ్యభాగంలో ఉండే మెత్తని న్యూక్లియస్ బయటకు తోసుకొని రావడాన్ని Herniation అంటారు. ఇలా Herniate అయిన డిస్క్ వెన్ను నుండి బయటకు వచ్చే నరాలను నొక్కినప్పుడు వచ్చే లక్షణాలను ‘సయాటికా’ (Sciatica) అంటారు. స్పాండిలోలిస్థిసిస్: ఇందులో వెన్నులోని ఎముకలు పరిమితికి మివంచి ముందుకు కాని వెనకకు కాని జారటాన్ని స్పాండిలోలిస్థిసిస్ అంటారు. ఇది వెన్నులోని ఎముకలు (వర్టిబ్రా) ను పట్టి ఉంచె లిగమెంట్లు సాగటం మరియు వర్టిబ్రాలోని ఒక భాగం విరగటం వలన వస్తుంది. స్పాండిలోలిస్థిసిస్ తీవ్రంగా ఉంటే నరాఉల మెలికపడటం మరియు నరాల పై వర్టిబ్రా వత్తిడి వలన తీవ్రమైన నడుము నొప్పికి, ఇతర లక్షణాలకు దారితీస్తుంది. స్పైనల్ స్టీనోసిస్: వెన్నులోపల ఉండే స్పైనల్ కానల్ అనే నాళం ఇరుకుగా మారటం లేదా మూసుకుపోవటాన్ని స్పైనల్‌స్టీనోసిస్ అని అంటాము. ఇది తీవ్రంగా ఉంటే నాళంలో ఉండే వెన్నుపాము వత్తిడికి గురై తీవ్రమైన వెన్నునొప్పితోపాటు, కాళ్ళు పడిపోవడం, తిమ్మిర్లు రావడం, మొద్దుబారటం, మలమూత్రాల విసర్జన మీద నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. యాంకిలోసింగ్ స్పాండిలోసిస్ Ankylosing spondilitis ఇది వెన్నుపూస దీర్ఘకాలిక వాపునకు గురి కావడం వలన వస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డీసీజ్. ఇది ఎక్కువగా తుంటి కీలు (sacro ilian joint), వెన్నుపూసను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా యుక్తవయస్సులో ఉన్న వారికి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన వారి వెన్నుపూసలోని ఎముకలు బిగుసుకు పోయి నడుము కదలికలు కష్టతరం అవుతాయి. దీనినే "Bamboo spine' అని అంటారు. వర్టిబ్రా (Fracture): వెన్నుకు దెబ్బ తగలటం లేదా దీర్ఘకాలికంగా Osteoporosis వలన వత్తిడికి గురి అయినప్పుడు వెన్నులోని వర్టిబ్రా విరిగిపోయే ప్రమాదం ఉంది. దీనివలన తీవ్రమైన వెన్నునొప్పి, నరాలకు సంబంధించిన వ్యాధి లక్షణాలు వస్తాయి. లక్షణాలు సాధారణం నుండి తీవ్రమైన నడుము నొప్పి నడుము పట్టేయడము. వెన్నులోని ఎముకలతో పాటు నరాలు కూడా వ్యాధి బారినపడితే నొప్పి నడుములో ప్రారంభమై పిరుదుల్లోకి, అక్కడినుండి తొడల్లోకి, కాళ్ళు, పాదాల వరకు వ్యాపిస్తుంది. కాళ్ళలో తిమ్మిర్లు, పాదాలలో మంటలు రావడం, మొద్దుబారటం వంటి లక్షణాలు ఉంటాయి. నడుమునొప్పి దీర్ఘకాలికంగా ఉండి, జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది క్షయ, కాన్సర్ లక్షణాలు అయి ఉండవచ్చు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు సీబీపీ, ఆర్ ఫ్యాక్టర్ ఎక్స్‌రే సిటీస్కాన్ ఎమ్మారై స్కాన్ హెచ్ఎల్ఏ-బీ27 ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చేయటం వలన వ్యాధి తీవ్రత ఇతర తీవ్రమైన వ్యాధులను గుర్తించవచ్చు. నడుము నొప్పికి గల కారణాన్ని గుర్తించి సరయిన చికిత్స తీసుకోవడమే కాకుండా రోజువారి వ్యాయామం, Strech Excersices, చేయడం, కూర్చునే, నిద్రపోయే పొజిషన్‌ను తగిన విధంగా మార్చుకొని సరిచేసుకోవడం వలన నడుము నొప్పిని అదుపు చేయవచ్చు. హోమియోకేర్ వైద్యం హోమియోకేర్ ఇంటర్ నేషనల్లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్యపద్ధతి ద్వారా వెన్నునొప్పి, సయాటికా, కాళ్ళతిమ్మిర్లు, పాదాల మంటలనే కాకుండా మూల కారణాన్ని గుర్తించి వైద్యం చేయడం ద్వారా వెన్నుపూసను దృఢంగా చేసి మరల నడుము సమస్యలు రాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
హార్మోన్ సమస్యలు- హోమియో చికిత్స
ఈ మధ్యకాలంలో హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతానలేమి, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక జబ్బుల గురించి వింటున్నాము. ఇవన్నీ హార్మోన్ అసమతుల్యతల వలన వచ్చే జబ్బులే. ఇవి కాకుండా ఇంకా చాలా హార్మోన్లు మానవ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిలో ముఖ్యమైన హార్మోన్ సమస్యల గురించి చర్చించుకుందాం. హార్మోన్లు పాలీపెస్టైడ్తో నిర్మితమైన రసాయన వాహకాలు. ఇవి శరీరంలో ఒక ప్రాంత కణజాలం, అవయవాల నుండి ఉత్పత్తి అయి, వివిధ శరీర భాగాలకు రక్తం ద్వారా ప్రవహించి నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేసి జీవప్రక్రియల సమతుల్యతకు తోడ్పడుతాయి. ఈ హార్మోన్లు ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ గ్రంథుల నుండి ఉత్పత్తి అవుతాయి. ఇవి మానవ శరీరంలో సూక్ష్మ మోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ, వీటి ప్రభావం వలన శరీరంలోని వివిధ సాధారణ జీవనక్రియలైన జీర్ణక్రియ, శారీరక, మానసిక ఎదుగుదల, ప్రత్యుత్పత్తి, మానసిక సమతుల్యత, జీవక్రియలకు తోడ్పడతాయి. మానవుడిలో ఈ హార్మోన్లు అసమతుల్యతకు గురి అయినప్పుడు తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతాడు. వివిధ హార్మోన్లు-వాటి అసమతుల్యతల వలన వచ్చే జబ్బులు థైరాయిడ్ హార్మోన్లు (T3, T4) ఇవి థైరాయిడ్ గ్రంథి నుండి ఉత్పత్తి అవుతాయి. కానీ, వీటి ప్రభావం 90 శాతం మానవుడి జీవనక్రియలపై ఉంటుంది. వీటి అసమతుల్యత వలన హైపోథైరాయిడ్, హైపర్‌థైరాయిడ్, గాయిటర్ అనే దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. హైపోథైరాయిడ్ లక్షణాలు: బరువు పెరగడం, జుట్టు రాలడం, నీరసం, మతిమరుపు, ఋతుచక్ర సమస్యలు మొదలైన వాటికి దారితీస్తుంది. హైపర్‌థైరాయిడ్ లక్షణాలు: బరువు తగ్గడం, నీరసం, గుండెదడ, కాళ్ళు చేతులు వణకడం మొదలైన సమస్యలకు దారి తీస్తుంది. గాయిటర్: గొంతుకింద ఉండే థైరాయిడ్ గ్రంథి వాపునకు గురి అవటాన్ని గాయిటర్ అంటాము. ఇది ముఖ్యంగా అయోడిన్ లోపం వలన వస్తుంది. ఇది హైపో, హైపర్ థైరాయిడ్ సమస్యలతో కూడుకుని ఉండవచ్చు. హోమియోకేర్ వైద్యం ప్రస్తుత పరిస్థితులలో మానవుడి జీవన విధానం, అధిక ఒత్తిడికి గురికావడం వలన ఎక్కువ శాతం థైరాయిడ్ బారిన పడటం గమనించాము. థైరాయిడ్ సమస్యలకు జీవితకాలం మందులు వాడే అవసరం లేకుండా, ఈ సమస్య రావడానికి గల మూలకారణాన్ని గుర్తించి వ్యక్తిత్వానికి అనుగుణంగా సరి అయిన హోమియో వైద్యం చేయడం ద్వారా థైరాయిడ్, హార్మోన్ సమస్యలను సంపూర్ణంగా నయం చేయవచ్చు. స్త్రీలలో ఉండే హార్మోన్లు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, ప్రొలాక్టిన్, ఆక్సిటాసిన్ హార్మోన్లు స్త్రీలలో రజస్వల, ఋతుచ్రకం, ద్వితీయ లైంగిక లక్షణాలు (Secondary Sexual Characters) సంతానోత్పత్తి, ప్రసవంలో ఉపకరిస్తాయి. ఈ హార్మోన్లు అసమతుల్యతల వలన స్త్రీలలో ఋతుచక్ర సమస్యలు (Menstrual Disorders, PCOD) హిర్సుటిజం (అవాంఛిత రోమాలు) మరియు సంతానలేమి సమస్యలు వస్తాయి. స్త్రీలలో మెనోపాజ్, రజస్వల అయ్యే సమయంలో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెనోపాజ్‌లో హార్మోన్ హెచ్చుతగ్గుల వలన Hot Flushes, మానసికఅశాంతి, నీరసం, కీళ్ళు, కండరాల నొప్పులు వస్తాయి. టెస్టోస్టిరాన్: ఇది పురుషులలో ఉండే హార్మోన్. దీని అసమతుల్యతల వలన శీఘ్రస్కలనం, అంగస్తంభన సమస్యలు, శుక్రకణ సమస్యలు, సంతానలేమి సమస్యలు వస్తాయి. హోమియోకేర్ వైద్యం హార్మోన్ సమస్యలు ఒక దానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. వీటికి హోమియో కేర్ వైద్యంతో ఎలాంటి హార్మోన్లు బయటినుండి ఇవ్వకుండా హార్మోన్ అసమతుల్యతలను సరిచేయడం వలన ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా ఋతుచక్ర సమస్యలు, పీసీఓడీ సమస్యలు, సంతానలేమి, శుక్రకణ సమస్యలను సంపూర్ణంగా నయం చేయవచ్చును. డయాబెటిస్ ఇన్సెపిడిస్: ఇది ADH (యాంటీ డైయూరెటిక్ హార్మోన్) లోపం వలన వస్తుంది. దీనిని అతి మూత్ర వ్యాధి అంటారు. డయాబెటిస్ మెల్లిటస్: ఇది క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ లోపం వలన లేదా తక్కువ మోతాదులో ఉత్పత్తి కావడం వలన వస్తుంది. ఇది రెండు రకాలు. టైప్-1 డయాబెటిస్: ఇది ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవటం వలన వస్తుంది. దీనిని జువైనల్ డయాబెటిస్ మెల్లిటస్ అని అంటారు. ఈ వ్యాధి ఉన్న వారు పూర్తిగా ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడవలసి వస్తుంది. టైప్-2 డయాబెటిస్: ఇది ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గటం వలన వస్తుంది. ఇది ఎక్కువగా 30 సంవత్సరాలు పైబడిన వారిలో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, ఈమధ్యకాలంలో యుక్త వయస్సులో ఉన్న వారికి కూడా వస్తోంది. డయాబెటిస్తో బాధపడే వారి రక్తంలోని చక్కెర శాతాన్ని సరిగ్గా నియంత్రణ చేయకపోవటం వలన దీర్ఘ కాలంలో డయాబెటిస్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, రెటినోపతి, గుండె సమస్యలు, అంగస్తంభన సమస్యలు లాంటి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. డయాబెటిస్‌కి హోమియోకేర్‌లో పరిష్కారం డయాబెటిస్‌ను తొందరగా గుర్తించి, తొలిదశలో హోమియోకేర్ ప్రత్యేక ‘హార్మోన్ సెల్ మరియు కాన్స్టిట్యూషనల్’ విధానం ద్వారా సంపూర్ణంగా నయం చేసే అవకాశం ఉంది. హోమియోపతి చికిత్స ద్వారా దీర్ఘకాలికంగా డయాబెటిస్తో బాధపడే వారికి ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా వ్యాధిని అదుపులో ఉంచటమే కాకుండా, కాంప్లికేషన్స్‌ను నివారించవచ్చు. కార్టికోస్టిరాయిడ్స్: ఇవి అడ్రినల్ గ్రంథి నుండి విడుదల అవుతాయి. ఇవి అన్ని ముఖ్యమైన జీవనక్రియల్లో, రోగ నిరోధక వ్యవస్థల్లో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దీని అసమతుల్యత వలన కుషింగ్స్ మరియు అడిసన్స్ వ్యాధులు వస్తాయి. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. హార్మోన్ సమస్యలకుహోమియోకేర్ వైద్యం హోమియోకేర్ సొంతమైన ప్రత్యేక ‘హార్మోన్ సెల్’ మరియు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ పద్ధతుల ద్వారా అన్ని హార్మోన్ సమస్యలకు కచ్చితమైన, ఎటువంటి దుష్ఫలితాలు లేని వైద్యం అందించి, ఇక మళ్ళీ జీవితంలో తిరగబెట్టకుండా సంపూర్ణంగా నయం చేసే అవకాశం ఉంటుంది. -
చిన్నకీళ్లను ప్రభావితం చేసే రుమటాయిడ్ ఆర్థరైటిస్...
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను వాడుకభాషలో వాతం అంటారు. దీని బారిన పడ్డవారు కీళ్లనొప్పులతో బాధపడుతుంటారు. కానీ వారికి ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని తెలియదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది క్రానిక్ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. అంటే జీవక్రియల అసమతౌల్యత వల్ల మన వ్యాధినిరోధకశక్తే మనపట్ల ప్రతికూలంగా పనిచేయడం వల్ల ఇది వస్తుంది. మన శరీరంలోని వివిధరకాల కణజాలాలు, అవయవాలు, కీళ్లు (సైనోవియల్ జాయింట్స్), ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, హృదయం, రక్తనాళాలు, చర్మంపై ఈ వ్యాధి తాలూకు దుష్ర్పభావం ఉంటుంది. సాధారణంగా కీళ్లనొప్పులు వచ్చిన ప్రతిసారీ నొప్పి నివారణ మందులు వాడి, దాని నుంచి ఉపశమనం పొందుతుంటారు. కానీ మందులు ఆపివేయగానే నొప్పులు మళ్లీ తిరగబెడతాయి. ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి చికిత్స చేయించుకుని, వ్యాధిని అంకురం నుంచి సమూలంగా తొలగించుకోకపోతే... వ్యాధి తీవ్రత పెరిగి, కీళ్ల అమరికలో మార్పులు వచ్చి అది వైకల్యానికి దారితీస్తుంది. కాబట్టి సంపూర్ణంగా నయమయ్యేవరకు చికిత్స చేయించుకోవాలి. ఎవరెవరిలో... ఇది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరిలోనైనా కనిపించే అవకాశం ఉంది. కానీ యుక్తవయసులో ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. మగవారిలో కంటే ఆడవారిలో ఇదివచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువ. రుతుక్రమం ఆగిన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. వంశపారంపర్యంగానూ వచ్చే అవకాశాలు ఎక్కువే. అయితే చిన్నపిల్లల్లో వచ్చే ఈ వ్యాధిని జువినైల్ ఆర్థరైటిస్ అంటారు. లక్షణాలు వ్యాధిప్రభావం మన కణజాలంతో పాటు అవయవాలపై కూడా ఉన్నప్పటికీ ప్రధానంగా కీళ్లు (సైనోవియల్ జాయింట్స్)పై వ్యాధి మరింతగా ప్రభావం చూపుతుంది. కీళ్లలో ఉండే సైనోవియల్ మెంబ్రేన్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్కు గురికావడం వల్ల కీళ్ల వాపు, నొప్పి, వేడిగా అనిపించడం వంటి లక్షణాలు కనపడతాయి. శరీరంలోని ఇరుపార్శ్వాలలో ఉండే కీళ్లలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపించడం అన్నది ఈ వ్యాధి ముఖ్య లక్షణం. లక్షణాలు ముందుగా చిన్న కీళ్లు అయిన కాలివేళ్లు (మెటాటార్సో ఫాలింజియల్ జాయింట్స్), చేతివేళ్లు (మెటా కార్పో ఫాలింజియల్ జాయిడ్స్, ఇంటర్ ఫాలింజియల్ జాయింట్స్), మణికట్టు ఆ తర్వాత పెద్ద కీళ్లయిన భుజాలు, మోకాలు, తుంటి... ఈ వరసలో వ్యాపిస్తుంటాయి. దీర్ఘకాలం పాటు కీళ్లు ఇన్ఫ్లమేషన్కు గురికావడం వల్ల ఫైబ్రస్ కణజాలం ఏర్పడి, కొన్ని కీళ్లు వైకల్యానికి గురి అవుతాయి. దీన్నే డిఫార్మిటీ(స్) అంటారు. దీనిలో... బౌటనీర్ డిఫార్మిటీ, స్వాన్ నెక్ డిఫార్మిటీ, అల్నార్ డిఫార్మిటీ ముఖ్యమైనవి. వీటివల్ల కీళ్లు తమ సాధారణ అమరికను, కదలికలను కోల్పోతాయి. కీళ్లపై చర్మం లోపల చిన్న చిన్న కణుతులు వస్తాయి. వీటినే ‘రుమటాయిడ్ నాడ్యూల్స్’ అంటారు. ప్లూరా ఇన్ఫ్లమేషన్కు గురి అయి, ఫైబ్రోసిస్ కావడం వల్ల రుమటాయిడ్ లంగ్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి బారిన పడ్డవారిలోని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం (అథెరోస్క్లిరోసిస్) వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. పైన పేర్కొన్న లక్షణాలే కాకుండా సాధారణంగా జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, రక్తహీనత మొదలైన ఇతర లక్షణాలూ ఉండవచ్చు. రోగి నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఆర్-ఫ్యాక్టర్, పీఆర్పీ, ఏఎన్ఏ, యాంటీ-సీసీపీ (సైక్లిక్ సిట్రులినేటెడ్ పెప్టైడ్) మొదలైన పరీక్షలు వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. హోమియో చికిత్స: చాలారకాల ఆటో-ఇమ్యూన్ జబ్బులు సైకోసొమాటిక్ డిజార్డర్స్ కిందకి వస్తాయి. అన్నిరకాల సైకోసొమాటిక్ డిజార్డర్స్‌కి హోమియోలో చక్కని పరిష్కారం లభిస్తుంది. అందులో ఒకటైన రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు కూడా హోమియోలో సంపూర్ణ చికిత్స ఉంది. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్‌కి ఇతర చికిత్స విధానాల్లో శాశ్వత నివారణ లేదు. కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభ్యమవుతుంది. కానీ హోమియోలో పూర్తి చికిత్స అందుబాటులో ఉంది. అయితే ఈ మందుల్ని రోగి వ్యక్తిగత లక్షణాలు, స్వరూప స్వాభావాల ఆధారంగా నిపుణుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను గుర్తించడం ఎలా...? ఈ వ్యాధి వచ్చినప్పుడు ముఖ్యంగా చిన్న కీళ్లు దానిబారిన పడతాయి. ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో నొప్పి, వాపు ఉండటాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్‌గా చెప్పవచ్చు. ఉదయాన్నే నిద్రలేవగానే కీళ్లు బిగుసుకుపోయి, సాధారణ కదలికలకూ సాధ్యం కాని విధంగా ఉంటాయి. దాదాపు రెండుగంటల పాటు అలా ఉన్న తర్వాత నిదానంగా అవి వదులవుతాయి. శరీరంలో ఇరువైపులా ఒకేవిధంగా కీళ్లు... నొప్పులకు, వాపునకు గురవుతాయి. చలికాలంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కీళ్ల ప్రాంతంలో చర్మం కింద ఫైబ్రస్ కణజాలం పెరగడంతో అది బయటకు చిన్న కణుతుల్లా కనిపిస్తుంటాయి. దీర్ఘకాలికంగా వ్యాధి ఉన్నప్పుడు కీళ్లనొప్పులతోపాటు కీళ్ల వైకల్యం (జాయింట్ డిఫార్మిటీ) రావచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ -
హోమియో వైద్యంతో పార్శ్వపు నొప్పి మాయం
ప్రతి వంద మందిలో 15 నుండి 20 మంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. ఇది సాధారణంగా 15 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పార్శ ్వపు నొప్పితో (Migraine) బాధ పడుతున్నారా అని తెలుసుకోవటం ఎలా =నెలలో 5 కంటే ఎక్కువసార్లు తలనొప్పి రావటం =తలనొప్పి 4 గంటల నుండి 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది =కనీసం రెండు సార్లు అయినా తలలో ఏదో ఒక వైపు నొప్పి రావటం =వాంతులు అవటం, శబ్దం లేక వెలుతురు భరించలేకపోవటం వంటి లక్షణాలు తలనొప్పితో పాటు కానీ తలనొప్పి ముందు కానీ ఉండడటం =AURAతో కూడిన తలనొప్పి- అంటే... తలనొప్పి వచ్చే ముందు... కళ్లు మసకబారటం, కళ్ల ముందు వెలుతురు కనిపించటం, మెరుపులు ప్రకాశవంతమైన జ్యోతుల లాంటివి కనిపించటం మొదలగు లక్షణాలను కలిపి అ్ఖఖఅ అని అంటారు. పార్శ్వపు నొప్పి అనగా చాలా తీవ్రమైన తలనొప్పి ఉండటం మరియు ఏదో ఒక వైపు తలనొప్పి రావటం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. సాధారణంగా ఇది మెడ వెనుక భాగంలో ప్రారంభమై కంటి వరకు వ్యాపిస్తుంది. తలనొప్పి వచ్చే ముందు కళ్లు మసక బారటం, తల తిరగటం వంటి లక్షణాలతో తలనొప్పి వస్తుంది. కడుపులో వికారంగా ఉండటం లేదా వాంతులు కావటం వంటి లక్షణాలు పార్శ్వపునొప్పిలో సాధారణం. పార్శ్వపు నొప్పికి కారణమైన నిర్దిష్టమైన జీవప్రక్రియ వ్యవస్థ గురించి తగిన శాస్త్రీయ ఆధారాలు ఇప్పటికీ అందుబాటులో లేవు. కానీ తలలోని నరాలలో కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావటం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. పార్శ్వపు నొప్పి రావటానికి గల కారణాలు =శారీరక మరియు మానసిక ఒత్తిడి =నిద్ర లేకపోవటం =ఎక్కువసేపు ఆకలిగా ఉండటం మరియు సమయానికి భోజనం చేయక పోవటం =స్త్రీలలో హార్మోన్ హెచ్చు తగ్గుల వల్ల కూడా పార్శ్వపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా నెలసరి సమయంలోను, గర్భిణీ స్త్రీలలోను మరియు మెనోపాజ్ సమయంలో చూస్తూ ఉంటాము =అతి వెలుగు, గట్టి శబ్దాలు మరియు ఘాటైన సువాసనలు పార్శ్వపునొప్పికి కారణాలు కావచ్చు =పొగతాగటం లేదా ఇంట్లో పొగతాగే వారుండటం =మద్యం సేవించటం లేదా ఇతర మత్తు పదార్థాలు కూడా పార్శ్వపునొప్పికి కారణం కావచ్చు. పైన పేర్కొన్న కారణాలకు దూరంగా ఉండటం వల్ల కొంతవరకు తలనొప్పిని రాకుండా చేయటం లేదా అదుపులో ఉంచటం చేయవచ్చు. లక్షణాలు: పార్శ్వపు నొప్పిలో చాలా రకాల లక్షణాలు ఉంటాయి. వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు. =పార్శ్వపునొప్పి వచ్చే ముందు కనిపించే లక్షణాలు (PRODROME & AURA) ఈ లక్షణాలు పార్శ్వపునొప్పి వచ్చే కొన్ని గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. =చిరాకు, నీరసం, అలసట, నిరుత్సాహం. =కొన్ని రకాల తినుబండారాలను ఎక్కువగా ఇష్టపడటం =వెలుతురు మరియు శబ్దాన్ని తట్టుకోలేకపోవటం =కళ్లు మసక బారటం, కళ్ల ముందు మెరుపులు లేదా వెలుతురు కనిపించటం జరుగవచ్చు. వీటినే అ్ఖఖఅ అంటారు. 2. పార్శ్వపు నొప్పి సమయంలో వచ్చే లక్షణాలు (paInphase) =సాధారణం నుండి అతి తీవ్రమైన తలనొప్పి =తలలో ఒక వైపు ఎక్కువగా తలనొప్పి ఉండటం =పని చేస్తున్నప్పుడు నొప్పి తీవ్రత ఎక్కువ అవటం =నొప్పి సాధారణంగా 4 గంటల నుండి 72 గంటల వరకు ఉండవచ్చు. =కడుపులో వికారం లేదా వాంతులు అవటం 3. పార్శ్వపునొప్పి వచ్చిన తరువాత లక్షణాలు =చిరాకు ఎక్కువగా ఉండటం నీరసంగా ఉండటం =వికారం, వాంతులు, విరోచనాలు కావటం హోమియో కేర్ ఇంటర్ నేషనల్ నందు జెనెటిక్ కాన్స్టిట్యూషన్ వైద్య విధానం ద్వారా మరియు ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన కచ్చితమైన చికిత్స ద్వారా పార్శ్వపు నొప్పి తీవ్రతనే కాకుండా పార్శ్వపునొప్పిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఎటువంటి దుష్ఫలితాలు లేని మరియు వ్యాధిని సమూలంగా నిర్మూలించే ప్రత్యేక వైద్యం కేవలం హోమియోకేర్ ఇంటర్నేషనల్కే సొంతం. రోగ నిర్థారణ పరీక్షలు పార్శ్వపునొప్పిని నిర్థారించుకోవటానికి ఖచ్చితమైన రోగనిర్థారణ పరీక్షలు లేవు. రోగ లక్షణాలను బట్టి ఎక్కువసార్లు పార్శ్వపునొప్పిని నిర్థారించటం జరుగుతుంది. ఈసీజీ, సీటీ-బ్రెయిన్, ఎమ్మారై-బ్రెయిన్ మొదలగు పరీక్షలు చేయటం ద్వారా ఇతరత్రా తీవ్రమైన వ్యాధులు లేవని నిర్థారించుకోవటం వల్ల మైగ్రేన్ తలనొప్పిని నిర్థారించుకోవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
ఆర్థరైటిస్ హోమియో చికిత్స
ప్రస్తుత పరిస్థితిలో మానవుడి జీవిత విధానం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధ్దంగా ఉండడం వలన సరైన వ్యాయమం లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, పౌష్టికాహార లోపం వలన త్వరితగతిన మానవుడు ఆర్థరైటిస్‌కు గురి అవుతున్నాడు. అందుకే జనాభాలో 50 శాతం మంది 40 సం॥దాటినవారు ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2030 నాటికి గణనీయంగా పెరుగుతుందని వైద్యనిపుణుల అంచనా. ఆర్థరైటిస్ అంటే కీళ్ళలో ఉండే కార్టిలేజ్ (మృదులాస్థి) అనే మెత్తని రబ్బరుపదార్థం అరుగుదలకు గురి అవడం వలన ఎముకలలో రాపిడి ఏర్పడి ఇన్ఫ్లమేషన్కు దారి తీయడం. కారణాలు: అధికబరువు, వయస్సు, ఇన్ఫెక్షన్స్, వంశ పారంపార్యం, ఇన్ఫ్లమేటరీ కారణాలు, ప్రమాదాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మొదలైన కారణాల చేత రకరకాలుగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థరైటిస్‌లో రకాలు ఆస్టియో ఆర్థరైటిస్: ఇది ఎక్కువగా 40 సం॥వయస్సు దాటినవారిలో కార్టిలేజ్ అరుగుదల వలన ఎముకల మధ్య రాపిడి వలన వస్తుంది. ఈ డీజనరేటివ్ ఆర్థరైటిస్ మగవారితో పోలిస్తే ఆడవారిలో (ఆస్టియో ఆర్థరైటిస్) ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా నెలసరి ఆగిపోయిన ఆడవారిలో 70 శాతం మంది ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. ఆర్థరైటిస్ అనేది శరీరంలో ఏ కీళ్లలోనైనా ఏర్పడే అవకాశం ఉంది. కాని శరీర బరువునంతటినీ మోసే మోకాలులో అధికంగా కనబడుతుంది. లక్షణాలు: మోకాళ్లనొప్పి వాపు, చేతితో స్పర్శించినప్పుడు వేడిగా ఉండటం, నడుస్తున్నప్పుడు కిరకిరమని శబ్దం రావడం (క్రిస్ట్) కీళ్లు వాపుకు గురై కదలికలు తగ్గడం వలన నడవడానికి చాలా ఇబ్బంది పడటం, అధిక బరువు ఉన్న రోగిలో మోకాళ్లు అరుగుదలకు గురి అయి నడకలో మార్పు వచ్చి కుంటినట్లుగా నడవడం, కింద కూర్చోవడం.. ఇలా.. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా రోగి ఉదయం నిద్రలేచి నడవడం అంటే చాలా బాధతో కూడుకున్నటు వంటి పని అవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్: ఇదొక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది జీవనక్రియల్లో ఏర్పడే అసమతుల్యత వలన వస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఇది ఎక్కువగా 12 నుండి 45 సం॥వయస్సు వారిలో కనబడుతుంది. ఈ వ్యాధి ప్రధానంగా చిన్నకీళ్లైన మణికట్టు, చేతివేలు (మెటటార్సో ఫాలేంజియల్ జాయింట్స్), ఇంటర్ ఫాలెంజియల్ జాయింట్స్, మడిమ మెకార్సో ఫాలెంజియల్ జాయింట్స్‌లో ముందుగా ప్రభావితం అయి పెద్ద జాయింట్లకు వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి శరీరంలో ఇరువైపులా ఉండే కీళ్ళకు సమాంతరంగా వ్యాఫ్తి చెందుతుంది. (బై లేటరల్ సిమెట్రికల్) కీళ్ళు వాపునకు గురి అయి కదలికలు పూర్తిగా స్తంభించి కీళ్ళు వైకల్యానికి దారి తీస్తాయి. ఇది ఎక్కువగా శీతాకాలం లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కీళ్ళ కదలికలు పూర్తిగా స్తంభించి చాలా నొప్పిని కలిగిస్తాయి. గౌటి ఆర్థరైటిస్: ఇదొక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది జీవక్రియలో ఏర్పడి, ఉప ఉత్పన్నమైన యూరిక్ ఆసిడ్ అధిక మోతాదులో రక్తంలో చేరి సోడియంతో కలసి మోనో సోడియం సిట్రైట్ అనే స్ఫటికాలు ఏర్పడి కీళ్ళలో చేరడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. లక్షణాలు: ఇది కాలి బొటనవేలులో ఎక్కువగా కనిపిస్తుంది. కీలు వాపుకు గురి అయి తీవ్రమైన నొప్పిని, మంటను కలుగజేస్తుంది. ఈ వ్యాధి ఆల్కహాల్, డ్రైఫ్య్రూట్స్ అధిక మాంసకృత్తులు తీసుకుంటే వ్యాధి తీవ్రత అధికమవుతుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్: ఇది సిరినెగిటివ్ ఇన్ఫ్లమేటరి ఆర్థరైటిస్. సోరియాసిస్ ఉన్నవారిలో 30 శాతం మందికి సోరియాటిక్ ఆర్థరైటిస్‌తో బాధపడతారు. ఇందులో ముఖ్యంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా కీళ్ళలో వ్యాప్తి చెందుతాయి. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్: దీనినే సపోర్టివ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. రక్తం ద్వారా లేదా కీళ్ళ చుట్టూ ఉండే కణజాలం ఇన్ఫెక్షన్కి గురి అయినప్పుడు, ఇన్ఫెక్షన్ సైనోవియల్ కుంబ్రేన్లో చేరడం వలన ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ సంభవిస్తుంది. ఇది ఎక్కువగా ఆర్టిఫిషియల్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకునే వారిలో కనిపిస్తుంది. వీటన్నింటికీ హోమియోలో శాశ్వతమైన చికిత్సావిధానాలున్నాయి. హోమియో ట్రీట్మెంట్ పైన తెలిపిన అన్ని రకాల ఆర్థరైటిస్‌కు హోమియో వైద్యంలో చాలా మెరుగైన చికిత్స ఉంటుంది. మిగతా వైద్యవిధానాలతో పోలిస్తే నొప్పి తగ్గించడంలోనూ, కీళ్ళ కదలికను సురక్షితంగా ఉంచడంలోను హోమియో వైద్య విధానంలో మంచి చికిత్స ఉంటుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ విధానం ద్వారా కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా జాయింట్ కదలికలను సురక్షితంగా ఉంచడం ద్వారా రోగికి మెరుగైన ఫలితాలు వస్తాయి. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
కీళ్ళవ్యాధులు (Arthritis) శాశ్వత విముక్తి
కీళ్ళు శరీర కదలికలకు ఉపయోగపడతాయి. కీళ్ళవ్యాధులు చాలా రకాలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి ఆస్టియో ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్: కీళ్ళలో అరుగుదల మూలంగా వచ్చే వ్యాధిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ఎక్కువగా మోకాలి కీళ్ళలో కనిపిస్తుంది. కారణాలు: అధికబరువు, నలైభైఏళ్ళు దాటినవారు, వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంది. కీళ్ళపై దెబ్బ తగలడం, కీళ్ళను ఎక్కువగా ఉపయోగించడం, మెటబాలిక్ సంబంధించిన వ్యాధులు కలవారిలో (హీమోక్రోమటాసిస్, విల్సన్వ్యాధి), రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలవారిలో, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: కీళ్ళలో నొప్పి... కదలికల వలన ఎక్కువగా ఉండటం, స్టిఫ్నెస్ కలిగి ఉండటం, కీళ్ళలో కదలికలు జరిగినప్పుడు శబ్దాలు (Crepitus) రావడం జరుగుతాయి. జాగ్రత్తలు: క్యాల్షియం కలిగి ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం, విటమిన్ - డి కోసం ఉదయం సూర్యరశ్మిలో కాసేపు గడపడం, బరువుతగ్గడం, సరియైన వ్యాయామం చేయడం, ఎక్కువ బాధగా ఉంటే విశ్రాంతి తీసుకోవడం అవసరం. రుమటాయిడ్ ఆర్థరైటిస్: వ్యాధినిరోధకశక్తి (Immune Energy) తిరగబడటం వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి చిన్నకీళ్ళ నుంచి పెద్దకీళ్ళ వరకు ముఖ్యంగా చేతివేళ్ళు, మణికట్టు, మోకాలు, కాళ్ళవేళ్ళలో ఉంటుంది. నడివయస్సులో ఉన్నవారికి, స్త్రీలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. లక్షణాలు: కీళ్ళలో వాపు, నొప్పి, ఉదయం స్టిఫ్నెస్ ఉండటం, ఈ వ్యాధి శరీరానికి ఇరుపక్కల ఒకే రకమైన కీళ్ళలో ఒకేసారి రావడం (Symmetrical arthritis) జరుగుతుంది. ఇతర అవయవాలైన కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, రక్తం, నరాలు, చర్మం మీద ప్రభావం ఉంటుంది. యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండి క్రిస్టల్ డిపాజిట్ అవడం వలన గౌట్ (Gout) అనే కీళ్ళవ్యాధి వస్తుంది. ఇది చిన్న కీళ్ళలో ముఖ్యంగా కాలివేళ్లు, బొటనవేళ్ళ వాపు, నొప్పి, ఎర్రగా మారడం జరుగుతుంది. సోరియాసిన్ అనే చర్మవ్యాధి వలన కూడా చిన్నవేళ్ళలో వాపు, నొప్పి రావడం జరుగుతుంది. దీనిని సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. కీళ్ళు ఇన్ఫెక్షన్కు గురి అవడం వలన కూడా కీళ్ళలో నొప్పి రావడం జరుగుతుంది. దీని సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారు. (SLE) (సిస్టిమిక్టాపస్ ఎరిటిమెటస్) అనే వ్యాధి వలన కూడా కీళ్ళలో నొప్పి, వాపు వస్తుంది. దీనిలో వ్యాధినిరోధకశక్తి తిరగబెడుతుంది. పరీక్షలు: X-ray, RA, Factor, DBP, ESR, ASO tile, CRP, ANA, సీరమ్ యూరిక్ ఆసిడ్ వంటి రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. హోమియో వైద్యంలో రోగి యొక్క మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని సారూప్య ఔషధం వాడటం వలన కీళ్ళవ్యాధి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చును. హోమియోకేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కీళ్ళవ్యాధి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చును. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.