పాలీ ఆర్థరైటిస్ నుంచి విముక్తి సులభమే... | Arthritis: It is curable. | Sakshi
Sakshi News home page

పాలీ ఆర్థరైటిస్ నుంచి విముక్తి సులభమే...

Published Mon, Aug 12 2013 11:47 PM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM

పాలీ ఆర్థరైటిస్ నుంచి విముక్తి సులభమే...

పాలీ ఆర్థరైటిస్ నుంచి విముక్తి సులభమే...

కీళ్ల నొప్పులకు ప్రధాన కారణం ఆర్థరైటిస్. సాధారణంగా ఎముకలు అరిగిపోవడం వల్ల కీళ్లనొప్పులు రావడం చాలామందిలో చూస్తుంటాం. ఈ సమస్య మోకాళ్లు, భుజాలు, మడమలు, మణికట్టు వంటి ప్రదేశాల్లో వచ్చే అవకాశం ఎక్కువ. ఐదు కంటే ఎక్కువ కీళ్లకు వచ్చే సమస్యను పాలీ ఆర్థరైటిస్ అంటారు.
 
 కారణాలు :  
 రుమటాయిడ్ ఆర్థరైటిస్
 సొరియాటిక్ ఆర్థరైటిస్  
 సిస్టమిక్ ల్యుపస్ అరిథమిటోసిస్ (ఎస్‌ఎఈ)  
 పాలీ మయాల్జియా రుమాటికా  
 ఇన్ఫెక్షన్స్  
 క్యాన్సర్  
 అతి మూత్రవ్యాధి లేదా డయాబెటిస్
 
 లక్షణాలు:  
 నొప్పి  
 వాపు
 సమస్య ఉన్న ప్రదేశంలో ఎర్రబారడం  
 కదలికలు కష్టంగా ఉండటం  
 ఎముకలు వంకర్లుపోవడం
 కీళ్లు పట్టేసినట్లుగా ఉండటం


 నిర్ధారణ పరీక్షలు :  ఆర్‌ఏ ఫ్యాక్టర్  ఏఎస్‌ఓ టైటర్  కీళ్ల జాయింట్ల ఎక్స్-రే సీబీపీ, ఈఎస్‌ఆర్  ఎఫ్‌బీఎస్, ఆర్‌బీఎస్, పిఎల్‌బిఎస్  ఏఎన్‌ఏ - సీరమ్ క్యాల్షియమ్
 
 తీసుకోవాల్సిన జాగ్రత్తలు
 అధికబరువు తగ్గించుకోవాలి, ఓ మోస్తరు బరువు ఉన్నవారు మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
 
 సరైన ఫిజియోథెరపిస్టును సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి  
 
 వ్యాయామాలు చేయడం మంచిదే కాని కీళ్లు అతిగా కదలడానికి ఆస్కారం ఉన్నవి, కీళ్లకు శ్రమ కలిగించే వ్యాయామాలు చేయకూడదు. సులభంగా చేయదగినవి మాత్రమే చేయాలి.
 
 చికిత్స: పాలీ ఆర్థరైటిస్ సమస్యకు హోమియోలో బ్రయోనియా, కాల్చికమ్, లెడమ్‌పాల్, రస్టాక్స్, లైకో, మెర్క్‌సాల్, ఫైఫాస్, కాల్కేరియా ఫాస్ మందులు వాడాల్సి ఉంటుంది.
 
 బ్రయోనియా : సన్నగా, దృఢంగా ఉండి తొందరగా చిరాకుపడేవారికి ఇది మంచి మందు. ఎప్పుడూ తాము చేసే వృత్తి గురించి మాట్లాడుతుంటారు. తొందరగా ఇంటికి వెళ్లాలనుకుంటారు. కీళ్లు పట్టేసినట్లు ఉండి, గుచ్చినట్లుగా నొప్పులు వస్తాయి. విశ్రాంతికి తగ్గుతాయి. దాహం ఎక్కువ, మలబద్దకం, వేడిని భరించలేకపోవడం వంటి లక్షణాలకు బ్రయోనియా ఉపయోగించాలి.
 
 కాల్చికమ్: గౌట్‌కు మంచి మందు. నీరసం, శరీరం లోపల చల్లగా ఉండటం, కీళ్లవాపు, నొప్పి, పట్టేసినట్లుగా ఉండటం, తిమ్మిర్లు, నొప్పి, ఒక కీలు నుంచి మరొక కీలుకు మారుతూ ఉండటం, కాళ్ల్లు చేతులు చల్లబడటం వంటి లక్షణాలకు కాల్చికమ్ బాగా పని చేస్తుంది.
 
 లెడమ్‌పాల్:
పదునైన వస్తువుల వల్ల అయిన గాయాలకు ఇది మంచిమందు, శరీరంలో వేడి తగ్గడం, నొప్పి శరీరం కింది నుంచి పైకి పాకడం, కీళ్లవాపు, వేడి, కీలు కదిలినప్పుడు చప్పుడు రావడం వంటి లక్షణాలతో పాటు చల్లటి నీళ్లలో కాళ్లు పెడితే కొంత ఉపశమనం కలిగినప్పుడు ఈ మందు బాగా పనిచేస్తుంది.
 
రస్టాక్స్: ఒకచోట కుదురుగా కూర్చోలేరు. ఉత్సాహంగా ఉండరు. ఆత్మహత్య గురించి ఆలోచనలు, రాత్రిపూట భయం, గుండెదడ, అధికశ్రమ, బరువులు మోయడం వల్ల వచ్చిన సమస్య, కీళ్లనొప్పులు, వాపులు, చేతులు కాళ్లు పట్టినట్లుగా ఉంటాయి. చల్లటిగాలిని భరించలేరు. తిమ్మిర్లు, సయాటికా వంటి సమస్యలు ఉంటాయి. కీళ్లను కదలిస్తే కొంత ఉపశమనం ఉంటుంది.
 
లైకోపోడియమ్:
దిగులు, ఒంటరిగా ఉండాలంటే భయం, కొత్త పనులు చేయడానికి ఇష్టపడరు. భయం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, మతిమరపు, తీపి పదార్థాలు ఎక్కువగా ఇష్టపడటం, కీళ్లనొప్పి, వాపు, కాళ్లూ, చేతులు బరువుగా ఉండటం, కీళ్ల దగ్గర చిరిగినట్లుగా నొప్పి, పాదాల నొప్పి, కాలివేళ్లు, పిక్కలు రాత్రివేళ కొంకర్లు పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. సమస్య కుడిపక్క, వేడివాతావరణంలో ఎక్కువగా ఉంటుంది.


 మెర్క్‌సాల్: వీరు అధిక వేడిని లేదా చల్లదనాన్ని భరించలేరు. జవాబు త్వరగా ఇవ్వరు. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. తమకు ఏదో దూరమవుతోందని భావిస్తారు. ఈ లక్షణాలు ఉన్నవారికి మెర్క్‌సాల్ మంచి ఔషధం.
 
డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement