రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో చక్కని పరిష్కారం | Homeo treatment for Rheumatoid, Arthritis | Sakshi
Sakshi News home page

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో చక్కని పరిష్కారం

Published Fri, Sep 6 2013 12:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో చక్కని పరిష్కారం

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో చక్కని పరిష్కారం

మానసికమైన ఒత్తిడి, మనోవ్యాకులత, బాధలు, భయాలు, ఆందోళన వలన శరీరంలోని రసాయనాలలో ఎన్నో మార్పులు జరిగి అనేక వ్యాధులకు గురి చేస్తాయనే విషయం అందరికి విదితమే. అయితే వీటివలస కేవలం హార్మోన్ల అసమతుల్యత, హైపర్ టెన్షన్, కొన్నిరకాల సైకో-పామాటిక్ డిజార్డర్స్ మాత్రమే కాదు సున్నితంగా ప్రతిస్పందించే వారిలో జన్యుపరమైన మార్పులకు దారి తీయవచ్చును, అందువలననే ఈ మధ్యకాలంలో ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిని ఎక్కువగా చూస్తున్నాం. ఈ తరహా వ్యాధులలో ప్రధానమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఖ.అ). ఈ వ్యాధిబారిన పడేవారిలో అధిక శాతం మంది స్త్రీలే అవ్వడం గమనార్హం.
 
 స్త్రీ-పురుషులలో యాభైఏళ్ళలో నొప్పులు మొదలవుతాయి. ఇది వయస్సు పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలోక్యాల్షియం తగ్గిపోవడం వలన వస్తూ ఉంటుంది. దీనిని ‘ఆస్టియో ఆర్థరైటిస్’’ అంటారు. ఇందుకు భిన్నంగా ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే యువతులలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులు రావడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. అయితే ఇది పురుషుల్లోను, పిల్లల్ల్లో కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్స్ డిసీజ్’ అని అంటారు.
 
 లక్షణాల తీవ్రతలో వివిధ మార్పులు కన్పిపిస్తాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్ళను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్ళనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా ద్విపార్శకంగా చేతులో, కాళ్ళలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు.
 
 దీనివలన శారీరకంగా, మానసికంగా రోగి కృంగిపోవడం జరుగుతుంది. ఈ వ్యాధి భుజాలు, మోకాళ్లు, వెన్నుపూసలలోని కీళ్ళు ఇలా ఏ జాయింట్‌లోనైనా లక్షణాలు కనిపించవచ్చు.
 
 గుండె, ఊపిరితిత్తుల పైన ఉండే పొరపైన, రక్తం పైన వ్యాధి ప్రభావం చూపుతుంది. రక్తనాళాలలో వచ్చే మార్పుల వలన శరీరం పైన చిన్న చిన్న గాయాల మాదిరిగా ఏర్పడతాయి. కంటిలోని పొరలు, నోరు ప్రభావితమైనప్పుడు పొడిబారిపోవడం, ఎరుపెక్కి మంట రావడం జరుగుతుంది. దీనిని ‘జోగ్రెన్స్ సిండ్రోమ్’ గా పరిగణిస్తారు.


 రక్తంలో ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గిపోవడం వలన అనీమియా స్ల్పీన్ అనే ఉదర భాగంలోని అవయవం వాచినప్పుడు దీనిని ‘ఫెల్టీస్ సిండ్రోమ్’ అని అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్‌లో మోచేతుల పైన, తొడల పైన వచ్చే చిన్న చిన్న గడ్డలను ‘రుమటాయిడ్ నాడ్యుల్స్’ అంటారు. వ్యాధి నిర్ధారణలో వీటిని కూడా పరిగణిస్తారు.
 
 రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. వ్యాధి లక్షణాలను బట్టి, రక్తంలో రుమటాయిడ్ ఫాక్టర్ అనే పరీక్ష పాజిటివ్‌గా రావడం X - రేస్‌లో వచ్చే మార్పులను ఆధారంగా చేసుకొని, డిఫార్మటిస్‌ని పరిశీలించి వ్యాధిని నిర్థారిస్తారు. రుమటాయిడ్ ఫాక్టర్ నెగటివ్‌గా ఉన్న వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించడం, అనేక ఇతర వ్యాధులలో రుమటాయిడ్ ఫాక్టర్ పాజిటివ్‌గా రావడం వలన కేవలం ఈ పరీక్ష ద్వారా ఖచ్చితమైన నిర్ధారణ చెయ్యలేము. రుమటాయిడ్ ఫాక్టర్ అనే ఆటోయాంటీ బాడీ సిస్టమ్ స్ల్కీరోసిన్, ఎస్.ఎల్.ఇ. మొదలగు ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధులలో కూడా పాజిట్‌గా వస్తుందని తెలుసుకోవాలి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీవ్రతను, వాడే మందుల యొక్క ప్రభావాన్ని అంచనా వెయ్యడానికి ఇ.ఎస్.ఆర్ సి.ఆర్.పి. వంటి పరీక్షలు చేయించుకోవాలి.
 
 ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్ వలన, స్టిరాయిడల్ మందుల వలన నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు.
 
 కీళ్ళనొప్పులు అంటే ఇంత నరకమా?

 నాపేరు రాజగోపాల్. నేను రిటైర్డ్ ఆఫీసర్‌ని. నేను సర్వీస్‌లో ఉండగా నాకు ఎటువంటి నొప్పులు ఉండేవి కావు. ఆ తర్వాతే నాకు ఈ కీళ్లనొప్పులు మొదలయ్యాయి. కీళ్ళనొప్పులంటే ఇంత నరకమా? అనిపించింది. సరిగా నడవలేక, కూర్చోలేక, ఎక్కడికీ వెళ్ళలేక చాలా ఇబ్బందిపడేవాడిని. ఎన్నోరకాల మందులు వాడినా ఫలితం కనిపించలేదు. అప్పుడు పాజిటివ్ హోమియోపతికి వెళ్ళాను. వీరిచ్చిన ట్రీట్‌మెంట్ వలన, సలహాల వలన నాకు ఇప్పుడు ఏ బాధా లేదు. నాకు ఇంతటి రిలీఫ్‌ను ఇచ్చిన పాజిటివ్ హోమియోపతి డాక్టర్లకు చాలా థాంక్స్...
 
 డా॥టి. కిరణ్‌కుమార్
 పాజిటివ్ హోమియోపతి
 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
 వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగుళూరు - చెన్నై
 అపాయింట్‌మెంట్ కొరకు 9246199922

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement