హోమియోపతితో సంతాన సాఫల్యం
బోసినవ్వులతో, కేరింతలతో, చిలిపి చేష్టలతో పసిపిల్లలు నడయాడే ఇల్లు స్వర్గతుల్యం అవుతుంది. మరి ఆ పిల్లల సవ్వడి ఇంట్లో వినబడకపోతే, అమ్మా, నాన్నా అనే పిలుపులకు కొందరు తల్లిదండ్రులు నోచుకోకపోతే... ఆ అదృష్టం మనకు లేదా అని బాధపడాల్సిన అవసరం లేదు. హోమియో చికిత్స ద్వారా సంతాన సాఫల్యానికి అవకాశాలున్నాయి.
సంతానలేమికి కారణాలు
సంతానం లేకపోతే చాలామంది దానికి మహిళలోనే లోపం ఉందని నిర్ధారణకు వస్తారు. కానీ సంతానలోపానికి కారణం దంపతులిద్దరిలోనూ ఉండవచ్చు. అందుకే నిర్దిష్టంగా కారణం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
స్త్రీలలో: వయసు 32-35 దాటిన స్త్రీలలో అండాశయ సామర్థ్యం తగ్గుతుంది. పీసీఓడీ, గర్భాశయ సమస్యలు, ట్యూబులు మూసుకుపోవడం, పీఐడీ, థైరాయిడ్, డీఎమ్, టీబీ వంటి సమస్యలు, ఎండోమెట్రియాసిస్ మొదలైనవి మహిళల్లో సంతానలేమికి కారణాలు.
పురుషుల్లో: వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం లేదా అసలు లేకపోవడం, హార్మోన్ల అస్తవ్యస్తత, వరిబీజం, డయాబెటిస్, మూత్రనాళంలో అడ్డు... మొదలైనవి సంతానలేమికి పురుషుల్లో కారణాలు. కొంతమంది పురుషుల్లో వీర్యకణాల సంఖ్య సరిపడా ఉన్నా వాటిలో చలనం తక్కువగా ఉండటం, వాటి ఆకృతి (మార్ఫాలజీ)లో తేడా వంటి అంశాలను గమనించాల్సి ఉంటుంది. కొందరిలో వీర్యకణాల సంఖ్య, చలనం అన్నీ బాగానే ఉంటాయి. భార్యలో కూడా లోపాలు ఉండవు. వీర్యకణాలు అండాన్ని సమీపిస్తాయి. కానీ ఫలదీకరణ జరగదు. ఇందుకు విటమిన్-కె లోపం, వీర్యకణాలకు ఫలదీకరణ శక్తి లోపించడం వంటివి కారణం.
చికిత్స:
హోమియో చికిత్స ద్వారా సంతానలేమికి కారణమైన అన్ని అంశాలకూ పరిష్కారం లభ్యమవుతుంది. చాలామందికి గర్భం వస్తుంది కానీ నెలలు నిండకుండానే గర్భస్రావం అవుతుంటుంది. అటువంటివారికి కూడా హోమియో ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తే గర్భం నిలుస్తుంది. అయితే ఆయా అంశాలను బట్టి కాన్‌స్టిట్యూషన్ పద్ధతిలో వైద్యం అవసరమవుతుంది.
డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి.,
హోమియోకేర్ ఇంటర్నేషనల్