తాగేసి మహిళ బ్యాగ్‌పై మూత్రం పోశాడు!
తాగేసి మహిళ బ్యాగ్‌పై మూత్రం పోశాడు!
Published Sat, Oct 22 2016 2:39 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM
ఒడిషా నుంచి వచ్చిన ఓ వ్యాపారి తప్పతాగి.. కోల్‌కతా విమానాశ్రయంలో ఓ మహిళ బ్యాగ్‌పై మూత్రం పోయడంతో అతడిని పోలీసులు అరెస్టుచేశారు. ప్రభాకర్ దొర అనే ఈ వ్యాపారి కోల్‌కతా నుంచి చెన్నై వెళ్లేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ అతడు మోతాదుకు మించి తాగేయడంతో.. అతడిని విమానం నుంచి దింపేశారు. అతడిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకొచ్చి, తర్వాత మరో విమానం వచ్చేవరకు ఆగాలని చెప్పారు. అప్పటిలోగా అతడి పరిస్థితి అదుపులోకి వస్తుందని ఇండిగో సిబ్బంది భావించారు.
రాత్రి 11 గంటలకు చెన్నై వెళ్లడానికి చిట్ట చివరి విమానం ఉంది. దాంతో మిగిలిన ప్రయాణికులతో పాటు దొర కూడా బోర్డింగ్ ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే అతడి మత్తు అప్పటికి ఇంకా దిగలేదు. దాంతో.. ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో అక్కడే ఉన్న ఓ మహిళ బ్యాగ్‌పై మూత్రవిసర్జన చేశాడు. దాంతో తీవ్రంగా ఆగ్రహించిన సదరు మహిళ ఎయిర్‌పోర్టు మేనేజర్ గదిలోకి వెళ్లి, ఫిర్యాదుచేశారు. దాంతో దొరను పోలీసులకు అప్పగించారు. రాత్రంతా జైల్లోనే ఉన్న ప్రభాకర్ దొరను తెల్లవారిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్‌పై విడుదలయ్యాడు.
Advertisement
Advertisement