సరికొత్త హైబ్రిడ్ కారు, లీటరుకు 100 కి.మీ. | Eolab concept car Renaults hybrid runs 100 km on just a litre | Sakshi
Sakshi News home page

సరికొత్త హైబ్రిడ్ కారు, లీటరుకు 100 కి.మీ.

Published Thu, Feb 4 2016 2:34 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

సరికొత్త హైబ్రిడ్ కారు, లీటరుకు 100 కి.మీ.

సరికొత్త హైబ్రిడ్ కారు, లీటరుకు 100 కి.మీ.

న్యూఢిల్లీ:  పర్యావరణ అనుకూలమైన వాహనాలు తయారీలో  విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  ఈ దశలో కంపెనీల మధ్య పోటీ కూడా బాగా పెరిగింది. కేంద్రప్రభుత్వం సైతం ఇలాంటి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లనే ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో ఓ సరికొత్త కారును  రూపొందించింది. ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పో లో రెనో తన కొత్త హైబ్రిడ్ కారును ప్రదర్శించింది.  అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ హ్యాచ్ బ్యాక్ కారు లీటరు పెట్రోలుతో సుమారు వంద కిలోమీటర్లు నడుస్తుందని ధీమాగా చెబుతోంది. హై ఎండ్ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఈ కాంపాక్ట్ కార్ పెట్రోలు ఇంజిన్‌, ఎలక్ట్రిక్ మోటార్‌ రెండింటితోనూ పనిచేస్తుందట.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం... రెనో ఆవిష్కరించిన ఈ కాంపాక్ట్ కారు మిగతావాటితో పోలిస్తే బరువు తక్కువగా ఉంటుంది. దీని బరువు వెయ్యి కిలోల లోపే ఉండటం వల్ల ఇంధనం వినియోగం గణనీయంగా తగ్గుతుందని తెలిపింది. అల్యూమినియం, స్టీలు, మెగ్నీషియం లాంటి లోహాలను ఈ కారు తయారీలో వాడడంతో బరువు తగ్గిందని రెనో పేర్కొంది. అయితే రెనో ఒక శాంపిల్‌గా మాత్రమే ఈ కారును ఆటో ఎక్స్‌పో లో చూపింది. కానీ  మార్కెట్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ధర ఎంత వివరాలను మాత్రం ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement