రివర్స్ గేర్‌లో కార్ల అమ్మకాలు | Auto Expo 2014: Auto fair continues to draw automobile enthusiasts | Sakshi
Sakshi News home page

రివర్స్ గేర్‌లో కార్ల అమ్మకాలు

Published Wed, Feb 12 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM

రివర్స్ గేర్‌లో కార్ల అమ్మకాలు

రివర్స్ గేర్‌లో కార్ల అమ్మకాలు

గ్రేటర్ నోయిడా: కార్ల అమ్మకాలు రివర్స్ గేర్‌లోనే కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కార్ల విక్రయాలు 8% తగ్గాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) వెల్లడించింది. గతేడాది జనవరిలో 1,73,449 కార్లు అమ్ముడవగా, ఈ ఏడాది జనవరిలో 1,60,289 కార్లు విక్రయమయ్యాయని సియాం డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ తెలిపారు. కార్ల అమ్మకాలు తగ్గడం ఇది వరుసగా నాలుగోనెల అని, ప్యాకేజీ ఇవ్వక తప్పదని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 వాణిజ్య వాహనాల అమ్మకాలు దారుణంగా పడిపోయాయని సేన్ చెప్పారు. భారీ, మధ్యతరహా వాణిజ్య వాహనాల విక్రయాలు వరుసగా 23 నెలల పాటు క్షీణిస్తూనే ఉన్నాయంటూ... ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఓట్-ఆన్ అకౌంట్‌లో వాహన పరిశ్రమకు తోడ్పాటునందించే చర్యలుంటాయన్న ఆశాభావాన్ని  వ్యక్తం చేశారు. 2008-09 నాటి పరిస్థితులతో పోల్చితే ఇప్పటి పరిస్థితులు మరింత అధ్వానంగా ఉన్నాయని, అప్పుడు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, ఇప్పడు కూడా అదే తోడ్పాటును ఆశిస్తున్నామని చెప్పారు.

వాణిజ్య వాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని  ప్రస్తుతమున్న 12% నుంచి 8 శాతానికి తగ్గించాలని ఇప్పటికే భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ ఆర్థిక  శాఖకు లేఖ రాశారు. ఆటో ఎక్స్‌పో ఆశలు: మారుతీ అమ్మకాలు 7%, హ్యుందాయ్ 3%, టాటా మోటార్స్ 24% చొప్పున పడిపోయాయని సేన్ చెప్పారు. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 4%, స్కూటర్ల అమ్మకాలు 28% చొప్పున పెరిగాయన్నారు. ఈ ఆటో ఎక్స్‌పోలో కంపెనీలు కొత్తగా  70 వాహనాలను ఆవిష్కరించాయని, దీంతోనైనా అమ్మకాలు పుంజుకోగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement