ఆటో ఎక్స్పోలో టాప్-5 ఏంటో తెలుసా? | top 5 cars in auto expo | Sakshi
Sakshi News home page

ఆటో ఎక్స్పోలో టాప్-5 ఏంటో తెలుసా?

Published Thu, Feb 4 2016 7:58 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

ఆటో ఎక్స్పోలో టాప్-5 ఏంటో తెలుసా?

ఆటో ఎక్స్పోలో టాప్-5 ఏంటో తెలుసా?

కొత్తకొత్త కార్లు, బైక్‌లు, స్పోర్ట్స్ వెహికిల్స్ 2016 ఆటో ఎక్స్‌పోలో అదరహో అనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేక లక్షణాన్ని కలిగిఉండి చూపరుల కళ్లను కట్టిపడేస్తున్నాయి. అలా కట్టిపడేసే వాటిల్లో కూడా టాప్ 5 వెహికిల్స్ ఉన్నాయి? అవి ఎలాంటి ఫీచర్స్ తో ఉన్నాయో తెలుసుకోవాలనుందా? అయితే చూడండి..

ఫోక్స్ వాగన్ అమియో: భారత కార్ల మార్కెట్లో ఫోక్స్ వాగన్ పల్లకిలాంటిది. ఇప్పుడు ఈ కారు మారుతీ డిజైర్, హుందాయ్ ఎక్సెంట్, హోండా అమేజికి పోటీగా ఆటో ఎక్స్‌పో-2016ల్లో దూసుకెళ్తోంది. 1.2 లీటరు పెట్రోలు ఇంజిన్, 1.5 లీటరు డీజిలు ఇంజిన్ సామర్థ్యంతో ఈ న్యూ మోడల్ కారు మార్కెట్లోకి త్వరలో రాబోతుంది. ఈ ఫోక్స్ వాగన్ కారులో వాటర్ వేగాన్ని తట్టుకోవడంతోపాటు మిర్రర్ లింక్‌తో కనెక్ట్ అయిన టచ్ స్క్రీన్, ఆటోమాటిక్ హెడ్ లైట్స్, పర్ఫెక్ట్ వైఫర్స్ సిస్టమ్స్ ఈ కారు ప్రత్యేకతలు. 

టాటా కైట్ 5: ఆటో ఎక్స్‌పోల్లో ఆవిష్కరించిన కార్లలో కాంపాక్టు టాటా కైట్ ఫైవ్. 1.05 లీటరు డీజిల్ ఇంజిన్, 1.2 లీటరు పెట్రోలు ఇంజిన్, సామర్థ్యం కలిగి ఉన్న ఈ కారు 2017లోపు షోరూంల్లోకి ప్రవేశించనుంది. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారు మార్కెట్లోకి రానుంది. 

చెవ్రోలెట్ ఎసెన్‌షియా: మిగతా కార్లకు పోటీగా ఎసెన్‌షియా కంపెనీ కొత్త కాంపాక్టు చెవ్రోలెట్‌ను మార్కెట్లోకి  ప్రవేశపెట్టేందుకు సిధ్ధమవుతోంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, పార్కింగ్‌లో ఇబ్బందిలేకుండా ఉండేందుకు వెనుక కెమెరా, శాటిలైట్ నావిగేషన్ వంటి ఫీచర్స్‌తో ఆటో ఎక్స్‌పోల్లో అదరగొడుతోంది. కంపెనీ యూఎస్‌పీ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఈ మోడల్‌ను కూడా 2017లోనే మార్కెట్లోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  

జాగ్వార్ ఎక్స్‌ఈ: బీఎమ్‌డబ్ల్యూ, ఆడీ ఏ4, మెర్సిడస్ బెంజ్ సి క్లాస్ పోటీగా జాగ్వార్ ఎక్స్‌ఈ దూసుకుపోతోంది. 2.0 లీటరు పెట్రోలు ఇంజిన్ సామర్థ్యం కల్గిన ఎక్స్‌ఈ రూ. 39.90 లక్షల ఖరీదు. ఢిల్లీ ఆటో షోరూంల్లో లభ్యమవుతున్న ఈ కారును కేవలం రెండు రాష్ట్రాల్లోనే విడుదల చేశారు. జాగ్, న్యూ బేబీగా ఎక్స్‌ఈ చక్కర్లు కొడుతోంది.

బీఎమ్‌డబ్ల్యూ 7: బీఎమ్‌డబ్ల్యూ కంపెనీకి చెందిన కొత్త రకం సిరీస్  బీఎమ్‌డబ్ల్యూ 7.  2016 ఆటో ఎక్స్‌పోల్లో ప్రేక్షకుల మదిని కొల్లగొడుతున్న ఈ కారును అధిక మైలేజీని ఇవ్వడంతోపాటు స్పీడుల్లో దేనికి తీసిపోని విధంగా దీన్ని రూపొందించారు. బరువుపరంగా చూసిన ఇది చాలా తేలికైంది. వివిధ రకాలైన ఫీచర్స్‌తో ఆటో ఎక్స్‌పోల్లో అదరహో అనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement