ఎదురుపడకుండా జాగ్రత్త పడ్డారు | Katrina Kaif, Ranbir Kapoor avoided each other at Auto Expo | Sakshi
Sakshi News home page

ఎదురుపడకుండా జాగ్రత్త పడ్డారు

Published Fri, Feb 5 2016 8:15 AM | Last Updated on Thu, Apr 4 2019 5:42 PM

ఎదురుపడకుండా జాగ్రత్త పడ్డారు - Sakshi

ఎదురుపడకుండా జాగ్రత్త పడ్డారు

ఈ మధ్యే బ్రేకప్ చెప్పేసుకున్న బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా, రణబీర్ కపూర్ ఒకరికొకరు ఎదురు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్పోకు ఒకే సమయంలో హాజరైన ఈ ఇద్దరు మాజీ ప్రేమికులు ఒకరి కంట ఒకరు పడకుండానే వెళ్లిపోయారు. బుధవారం ఉదయం 11.30 సమయంలో ఎక్స్ పోకు హాజరైన కత్రినా దాదాపు గంట పాటు అక్కడే గడిపారు.

అదే సమయంలో రణబీర్ కూడా ఎక్స్పోకు హాజరు కావటంతో ఈ ప్రేమజంట ఒకరికొకరు ఎదురుపడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని అక్కడున్న వారంతా ఎదురుచూశారు. అయితే రణబీర్ కూడా వస్తున్న విషయం ముందే తెలిసిందో లేక చూసింది చాల్లే అనుకుందో గాని కత్రినా ఎక్స్పో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఈ ఇద్దరు ప్రేమికులు ఎదురు పడితే ఎలా ఉంటుందో చూడాలనుకున్న జనాలకు మాత్రం నిరాశే మిగిలింది.

ఎక్స్పో చూసిన తరువాత రణబీర్ తన సినిమా షూటింగ్ కోసం బార్సీలోనా పయనమవ్వగా, కత్రిన మాత్రం తన లేటెస్ట్ సినిమా ఫితూర్ ప్రమోషన్ కోసం ఢిల్లీలోనే ఉండిపోయింది. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా ఫితూర్లో కత్రినా కైఫ్, ఆదిత్యారాయ్ కపూర్, టబులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement