సీఎన్‌జీ విభాగంలోకి మరో వెహికల్!.. లాంచ్ ఎప్పుడంటే? | TVS Jupiter 125 CNG Coming Soon in India | Sakshi
Sakshi News home page

సీఎన్‌జీ విభాగంలోకి మరో వెహికల్!.. లాంచ్ ఎప్పుడంటే?

Published Fri, Jul 12 2024 2:15 PM | Last Updated on Fri, Jul 12 2024 3:32 PM

TVS Jupiter 125 CNG Coming Soon in India

ఇటీవల బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్‌జీ బైక్ ఫ్రీడమ్ 125 లాంచ్ చేసింది. ఈ తరుణంలో టీవీఎస్ కంపెనీ కూడా ఈ విభాగంలో స్కూటర్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. సంస్థ 2025 నాటికి మార్కెట్లో జుపిటర్ సీఎన్‌జీ స్కూటర్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

టీవీఎస్ కంపెనీ తన జుపిటర్ స్కూటర్‌ను సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేయడానికి యూ740 పేరుతో ఓ ప్రాజెక్ట్ ప్రారంభించింది. రాబోయే ఈ స్కూటర్ 125 సీసీ ఇంజిన్ పొందనున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. టీవీఎస్ జుపిటర్ సీఎన్‌జీ ఈ ఏడాది చివరినాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

టీవీఎస్ సీఎన్‌జీ స్కూటర్ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత నెలకు సుమారు 1000 యూనిట్లను విక్రయించనున్నట్లు సమాచారం. వాతావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కంపెనీ లాంచ్ చేయనున్న ఈ సీఎన్‌జీ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement