
మార్కెట్‌లోకి రెండు కొత్త బెంజ్ ఎస్‌యూవీలు
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా తన ఏఎంజీ పోర్ట్‌ఫోలియోలో మరో రెండు ఎస్‌యూవీలను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా తన ఏఎంజీ పోర్ట్‌ఫోలియోలో మరో రెండు ఎస్‌యూవీలను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. మెర్సిడెస్–ఏఎంజీ జీ–63 ‘ఎడిషన్ 463’, మెర్సిడెస్–ఏఎంజీ జీఎల్‌ఎస్–63 అనే ఈ రెండు కార్ల ధరలు వరుసగా రూ.2.17 కోట్లు, రూ.1.58 కోట్లుగా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ పుణేవి. తాజా కార్ల ఆవిష్కరణతో కంపెనీ లగ్జరీ ఎస్‌యూవీ విభాగం మరింత పటిష్టంగా మారిందని, ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలోని ప్రొడక్టుల సంఖ్య ఎనిమిదికి చేరిందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా పేర్కొంది.