
కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లగ్జరీ కార్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జర్మనీకి చెందిన ప్రీమియం కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. దేశీయంగా ఎక్కువ కార్లను తయార చేయాలని, అదే సమయంలో కొనుగోలు దారుల స్థోమతకు తగ్గట్లు వాటి ధరల్ని తగ్గించాలని కోరారు.
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ పూణే జిల్లాలోని చకాన్ అనే పట్టణంలో కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ఆ కార్ల తయారీ యూనిట్‌లో ఉత్పత్తి చేసిన తొలి ఎలక్ట్రిక్ కారు ‘ఈక్యూఎస్ 580 4మేటిక్’ ను నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మెర్సిడెస్ సంస్థ కార్ల ఉత్పత్తిని పెంచితే వాటి ధరల్ని తగ్గించే అవకాశం ఉంది. మేం మధ్య తరగతి ప్రజలం, కార్ల ధరల్ని తగ్గించినప్పటికీ.. నేను మీ కార్లను కొనలేని’ నితిన్ గడ్కరీ అన్నారు. అంతకు ముందు నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పేద ప్రజలున్న ధనిక దేశం భారత్ అంటూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చాంశనీయ మయ్యాయి.
పేద ప్రజలున్న ధనిక దేశం
నాగపూర్‌లో భారత్ వికాస్ పరిషత్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడారు. ప్రపంచంలోనే మన దేశం అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించి ధనిక దేశంగా నిలిచింది. కానీ ప్రజలు మాత్రం ఇంకా పేదలుగానే ఉన్నారు. వాళ్లంతా ఆకలి, నిరుద్యోగం, కులతత్వం, అంటరాని తనం , ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు.
చదవండి👉 కేంద్రం కీలక ఆదేశాలు : కార్లలో 6 ఎయిర్ బ్యాగ్‌లు..తగ్గే ప్రసక్తే లేదు
Comments
Please login to add a commentAdd a comment