ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' భారతదేశంలో 2023 ఏప్రిల్ 01 నుంచి తమ ఉత్పతుల ధరలను భారీగా పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ త్వరలో మోడల్ శ్రేణిలో సుమారు 5 శాతం వరకు ధరల పెరుగుదలను ప్రకటించింది.
2022 డిసెంబర్ నెలలో కంపెనీ 5 శాతం ధరలను పెంచింది. ఆ తరువాత 2023లో ధరలను పెంచడం ఇదే మొదటిసారి. యూరోతో పోలిస్తే ఇండియన్ కరెన్సీ విలువ తగ్గడంతో పాటు ఇన్‌పుట్, లాజిస్టికల్ ఖర్చులు పెరగడం వల్ల ధరల పెరుగుదల జరిగిందని కంపెనీ ప్రకటించింది.
నిజానికి మెర్సిడెస్ బెంజ్ ఏ200 ధర రూ. 42 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ధరల పెరుగుదల తరువాత ఈ మోడల్ ధర రూ. 44 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంటుంది. జిఎల్ఎస్ 400డి 4మ్యాటిక్ ధర రూ. 10 లక్షలు పెరగనుంది. దీని కొత్త ధర రూ. 1.29 కోట్లు. అదే సమయంలో మేబ్యాచ్ ఎస్580 ధర రూ. 12 లక్షలు పెరగనుంది.
(ఇదీ చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైకులు వెనక్కి: కారణం ఏంటంటే?)
మెర్సిడెస్ బెంజ్ తమ ఉత్పత్తుల ధరలను పెంచడమే కాకుండా కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి కూడా తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ 2023లో 10 కొత్త మోడల్స్ విడుదల చేయడానికి సంకల్పించింది. ఇందులో క్యూ3 జిఎల్‌సి, జి-క్లాస్ వెర్షన్ వంటివి దేశీయ మార్కెటీలో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment