Celebrity Twins Chinki Minki Buy Mercedes AMG GLC 43 - Sakshi
Sakshi News home page

కవలల కల నెరవేరింది.. కొత్త కారు కొన్న సంతోషం కళ్ళల్లో - వీడియో వైరల్

Published Mon, Mar 27 2023 2:56 PM | Last Updated on Mon, Mar 27 2023 3:33 PM

Celebrity twins chinki minki buys mercedes amg glc 43 details - Sakshi

టిక్‌టాక్ ద్వారా ఫేమస్ అయిన వ్యక్తులలో 'చింకి మింకి' కవలలు కూడా ఉన్నారు. అంతే కాకుండా షార్ట్ ఫామ్ (short-form) వీడియోస్ చేస్తూ ప్రసిద్ధి చెందిన ఈ ట్విన్స్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్స్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా వీరు ఇటీవల ఒక ఆధునిక లగ్జరీ కారుని కొనుగోలు చేశారు.

చింకి మింకీగా ప్రసిద్ధి చెందిన వీరి అసలు పేర్లు 'సురభి మెహ్రా & సమృద్ధి మెహ్రా'. 2016లో టిక్‌టాక్ ద్వారా మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తార స్థాయికి చేరింది. కొన్ని టీవీ షోల ద్వారా కూడా వీరు మరింత పేరు సంపాదించుకున్నారు. ఇటీవల ఈ ట్విన్స్ కొన్న చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'ఏ‌ఎం‌జి జి‌ఎల్‌సి 43'. దీని ధర రూ. 87 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో వారు కారు ముందర డ్యాన్స్ చేయడం చూడవచ్చు.

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఖరీదైన కార్ల జాబితాలో AMG GLC 43 ఒకటి. ఇది పోలార్ వైట్, అబ్సిడియన్ బ్లాక్, గ్రాఫైట్ గ్రే, డిజైనో హైసింత్ రెడ్, డిజైనో సెలెనైట్ గ్రే మాగ్నో, బ్లూ కలర్స్‌లో లభిస్తుంది.

(ఇదీ చదవండి: బోరు బావి నుంచి బంగారం.. భారీగా ఎగబడుతున్న జనం)

మెర్సిడెస్ బెంజ్ జి‌ఎల్‌సి 43 లగ్జరీ ఫీచర్స్ కలిగి, వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. అంతే కాకుండా.. బ్లాక్ నప్పా లెదర్‌ స్టీరింగ్ వీల్, మెమరీ ఫంక్షన్, లంబర్ సపోర్ట్‌తో ఎలక్ట్రానిక్ ఫ్రంట్ సీట్లు, డ్రైవ్ మోడ్‌లు, మెర్సిడెస్ మీ కనెక్ట్, 64 కలర్డ్ యాంబియంట్ లైటింగ్, ప్రీమియం బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు ఇందులో లభిస్తాయి.

(ఇదీ చదవండి: నాగ చైతన్య కొత్త ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?)

ఈ జర్మన్ లగ్జరీ కారులో 3.0 లీటర్ వి6 టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 390 హెచ్‌పి పవర్, 520 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాగా టాప్ స్పీడ్ 250 కిమీ/గం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement