Auto Mobiles
-
భారత్‌లో హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి బైక్ - ధర & వివరాలు
2023 Hero Xtreme 160R 4V: భారతీయ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) ఎట్టకేలకు మరో కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర, అప్డేటెడ్ ఫీచర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్ & ధరలు దేశీయ మార్కెట్లో విడుదలైన హీరో మోటోకార్ప్ కొత్త బైక్ పేరు 'ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి'. ఇది స్టాండర్డ్, కనెక్టెడ్, ప్రో అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.27 లక్షలు, రూ. 1.32 లక్షలు & రూ. 1.36 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). డిజైన్ & ఫీచర్స్ 2023 ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి రీ డిజైన్ చేయబడిన ఫుల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతుంది, స్విచ్ గేర్ మునుపటి కంటే ఎక్కువ ప్రీమియంగా ఉంటుంది. ఈ బైక్ స్ప్లిట్ సీటు సెటప్ కలిగి రైడర్ అండ్ పిలియన్ ఇద్దరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. మోనోషాక్ షోవా 7 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ యూనిట్ వంటివి కేవలం టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి. మిగిలిన వేరియంట్లలో టెలిస్కోపిక్ ఫోర్క్ / మోనోషాక్ సెటప్ ఉంటాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో LCD డిస్ప్లే లభిస్తుంది. దీనికి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. కావున కాల్, నోటిఫికేషన్ అలర్ట్ వంటి వాటిని పొందవచ్చు. కాగా దీనికి సింగిల్ పీస్ సీటు, ఫోన్ మౌంట్, బార్ ఎండ్ మిర్రర్ వంటి యాక్ససరీస్ లభిస్తాయి. ఆసక్తి కలిగిని వినియోగదారులు బైకుని మరింత అందంగా చేయాలనుకుంటే ఈ యాక్ససరీస్ పొందవచ్చు. (ఇదీ చదవండి: ఏఐ చేసిన పనికి బిత్తరపోయిన జనం - అసలు విషయం ఏంటంటే?) ఇంజిన్ & పర్ఫామెన్స్ 2023 ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి బైకులోని 163 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఇప్పుడు ఎయిర్ కూల్డ్తో పాటు ఆయిల్ కూలర్‌ను పొందుతుంది. కావున ఇది ఆధునిక 4 వాల్వ్ హెడ్ పొందుతుంది. ఇది 16.9 bhp పవర్ 14.6 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్ల వరకు ఉంటుంది. బైక్ మొత్తం బరువు సుమారు 140 కేజీల కంటే ఎక్కువ. (ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!) ప్రత్యర్థులు భారతదేశంలో విడుదలైన కొత్త ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి ధరల పరంగా బజాజ్ పల్సర్, అపాచే ఆర్టిఆర్ 4వి బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది. సంస్థ ఈ బైక్ కోసం ఈ రోజు నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు జూలై రెండవ వారంలో మొదలయ్యే అవకాశం ఉంటుంది. -
కవలల కల నెరవేరింది.. కొత్త కారు కొన్న సంతోషం కళ్ళల్లో - వీడియో వైరల్
టిక్‌టాక్ ద్వారా ఫేమస్ అయిన వ్యక్తులలో 'చింకి మింకి' కవలలు కూడా ఉన్నారు. అంతే కాకుండా షార్ట్ ఫామ్ (short-form) వీడియోస్ చేస్తూ ప్రసిద్ధి చెందిన ఈ ట్విన్స్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్స్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా వీరు ఇటీవల ఒక ఆధునిక లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. చింకి మింకీగా ప్రసిద్ధి చెందిన వీరి అసలు పేర్లు 'సురభి మెహ్రా & సమృద్ధి మెహ్రా'. 2016లో టిక్‌టాక్ ద్వారా మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా తార స్థాయికి చేరింది. కొన్ని టీవీ షోల ద్వారా కూడా వీరు మరింత పేరు సంపాదించుకున్నారు. ఇటీవల ఈ ట్విన్స్ కొన్న చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'ఏఎంజి జిఎల్సి 43'. దీని ధర రూ. 87 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో వారు కారు ముందర డ్యాన్స్ చేయడం చూడవచ్చు. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఖరీదైన కార్ల జాబితాలో AMG GLC 43 ఒకటి. ఇది పోలార్ వైట్, అబ్సిడియన్ బ్లాక్, గ్రాఫైట్ గ్రే, డిజైనో హైసింత్ రెడ్, డిజైనో సెలెనైట్ గ్రే మాగ్నో, బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. (ఇదీ చదవండి: బోరు బావి నుంచి బంగారం.. భారీగా ఎగబడుతున్న జనం) మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి 43 లగ్జరీ ఫీచర్స్ కలిగి, వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. అంతే కాకుండా.. బ్లాక్ నప్పా లెదర్ స్టీరింగ్ వీల్, మెమరీ ఫంక్షన్, లంబర్ సపోర్ట్‌తో ఎలక్ట్రానిక్ ఫ్రంట్ సీట్లు, డ్రైవ్ మోడ్లు, మెర్సిడెస్ మీ కనెక్ట్, 64 కలర్డ్ యాంబియంట్ లైటింగ్, ప్రీమియం బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు ఇందులో లభిస్తాయి. (ఇదీ చదవండి: నాగ చైతన్య కొత్త ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?) ఈ జర్మన్ లగ్జరీ కారులో 3.0 లీటర్ వి6 టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 390 హెచ్‌పి పవర్, 520 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాగా టాప్ స్పీడ్ 250 కిమీ/గం. View this post on Instagram A post shared by Chinki Minki♥️ (@surabhi.samriddhi) -
Kia Carnival facelift: కియా మోటార్స్ నుంచి కొత్త కారు.. భారత్‌కి వస్తుందా?
భారతదేశంలో 7 సీటర్ విభాగంలో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన 'కియా కార్నివాల్' త్వరలోనే మరిన్ని కొత్త హంగులతో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే నాల్గవ తరం కియా కార్నివాల్ ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించింది. నాల్గవ తరం కియా కార్నివాల్ ఇండియన్ మార్కెట్లో ప్రారంభం కాలేదు, అయితే ప్రస్తుతం సౌత్ కొరియాలో టెస్టింగ్ దశలో ఉంది. ఈ లేటెస్ట్ కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ దాని మునుపటి మోడల్ కంటే కొత్త డిజైన్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ వంటి వాటిని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిజైన్ & ఫీచర్స్: కొత్త కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త కియా ఈవి9 మాదిరిగా ఉంటుంది. కావున వర్టికల్ హెడ్‌ల్యాంప్ డిజైన్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ కలిగి రీడిజైన్ బోనెట్ పొందుతుంది. అల్లాయ్ వీల్స్ దాదాపు మారే అవకాశం లేదు. రియర్ ఫ్రొఫైల్లో టెయిల్ లాంప్ కొత్తగా ఉంది. కారు పూర్తిగా కప్పబడి ఉండటం వల్ల మొత్తం డిజైన్ వెల్లడి కాలేదు. నాల్గవ తరం కియా కార్నివాల్ డిజైన్ కొంత వరకు వెల్లడైంది, కానీ ఫీచర్స్ గురించి ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు, రానున్న రోజుల్లో కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్స్ వెల్లడవవుతాయి. (ఇదీ చదవండి: గ్రేట్ ఆఫర్: రూ. 22,999కే ఐఫోన్ సొంతం చేసుకోండి: కానీ..!) పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్: కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్ గురించి అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే లేటెస్ట్ కార్నివాల్ ఎలక్ట్రిక్ మోటారుతో జత చేసిన 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందనుంది. ప్రస్తుతం ఈ ఎంపివి 2.2 లీటర్ డీజిల్, 3.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్సన్స్ కలిగి ఉంది. (ఇదీ చదవండి: Nokia C99: నోకియా నుంచి సరికొత్త మొబైల్: ప్రత్యర్థులకు చుక్కలే..) లాంచ్ టైమ్: కియా కార్నివాల్‌ను కంపెనీ ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో KA4 ఎంపివిగా ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది చివరి నాటికి దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది, అదే సమయంలో కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ 2024 జనవరి నాటికి గ్లోబల్ మార్కెట్లో విడుదలవుతుందని భావిస్తున్నారు. అంచనా ధర: కియా మోటార్స్ భారతీయ మార్కెట్లో కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ ఏడాది విడుదలకానున్న కియా కేఏ4 ధర రూ. 50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవవుతాయి. -
హోండా నుంచి మరో బైక్ 'సిబి350 కేఫ్ రేసర్' - వివరాలు
భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా CB350 లైనప్‌కి కొత్త నియో-రెట్రో మోటార్‌సైకిల్ జోడించడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. హైనెస్, ఆర్ఎస్ విడుదల చేసిన తరువాత, హోండా సిబి350 కేఫ్ రేసర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. హోండా సిబి350 కేఫ్ రేసర్ గురించి అధికారిక సమాచారం విడుదల కానప్పటికీ, ఇటీవల స్పెషల్ క్లోజ్డ్ డోర్ ఈవెంట్లో కనిపించింది. ఈ బైక్ సాధారణ మోడల్ మాదిరిగా కాకుండా.. చిన్న ఫ్లైస్క్రీన్, బ్యాక్ సీట్ కౌల్ వంటి వాటిని కలిగి ఉంటుంది. మెకానిజమ్స్ మొత్తం సిబి350కి సమానంగా ఉంటుంది. హోండా సిబి350 కేఫ్ రేసర్ 348 సిసి ఇంజిన్ కలిగి, 20.6 బీహెచ్‌పి పవర్, 30 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున పనితీరు పరంగా మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. సిబి350 కేఫ్ రేసర్ బైకులో హ్యాండిల్ బార్, ఫ్లుయెల్ ట్యాంక్ కొంత వెడల్పుగా ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇందులో క్రోమ్ ఫినిష్డ్ ఎగ్జాస్ట్, అల్లాయ్ వీల్స్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, యూఎస్బీ చార్జర్ వంటి ఫీచర్స్ ఉంటాయి. ప్రస్తుతానికి సిబి350 కేఫ్ రేసర్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు, అయితే ఈ వివరాలు అధికారికంగా ఆవిష్కరణ సమయంలో వెల్లడవుతాయి. (గమనిక: ఈ కథనంలో ఉపయోగించి హోండా సిబి350 ఫోటో అవగాహన కోసం మాత్రమే.) -
కొత్త మారుతి సియాజ్ వచ్చేసింది..సూపర్ సేఫ్టీ ఫీచర్లతో
సాక్షి, ముంబై: మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో తన అప్డేటెడ్ 'సియాజ్' లాంచ్ చేసింది. ఇది డ్యూయెల్ టోన్ పెయింటింగ్ స్కీమ్ పొందటంతో పాటు అదనపు సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇది కేవలం ఆల్ఫా ట్రిమ్‌కి మాత్రమే పరిమితం చేయబడింది. మారుతి సియాజ్ సెడాన్ ఇప్పుడు పెర్ల్ మెటాలిక్ ఓపులెంట్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్, పెర్ల్ మెటాలిక్ గ్రాండ్యుర్ గ్రే విత్ బ్లాక్ రూఫ్ మరియు డిగ్నిటీ బ్రౌన్ విత్ బ్లాక్ రూఫ్ అనే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. దీని మాన్యువల్ వేరియంట్ ధర రూ. 11.14 లక్షలు కాగా, ఆటోమేటిక్ ధర 12.34 లక్షలు (ధరలు, ఎక్స్-షోరూమ్). అప్డేటెడ్ సియాజ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ISOFIX చైల్డ్ సీట్ యాంకరింగ్ పాయింట్ వంటి 20 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే, మారుతి సియాజ్ 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కలిగి 103 బిహెచ్పి పవర్ , 138 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ & 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది. ఫీచర్స్ పరంగా ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కలిగి ఉంది. ఈ సెడాన్ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న నెక్సా షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. -
ఆటో రయ్.. రయ్..
సాక్షి, అమరావతి : కొన్ని నెలలుగా దేశ వ్యాప్తంగా ఆటో మొబైల్ అమ్మకాలు భారీగా క్షీణిస్తున్న దశలో రాష్ట్రంలో మాత్రం ఆటోల అమ్మకాలు పెరగడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆటో అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమ అమ్మకాలు 15.89 శాతం మేర క్షీణించినట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో మన రాష్ట్రంలో ఈ క్షీణత కేవలం 9.4 శాతానికి మాత్రమే పరిమితమైంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఐదు నెలల కాలానికి ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి భారీ వాహనాల వరకు దేశ వ్యాప్తంగా అమ్మకాలు 1.15 కోట్ల నుంచి 97.31 లక్షలకు పడిపోయాయి. కానీ ఇదే సమయంలో రాష్ట్రంలో అమ్మకాలు 5.10 లక్షల నుంచి 4.62 లక్షలకు మాత్రమే తగ్గాయి. ఆటో అమ్మకాల్లో భారీ వృద్ధి ఆర్థిక మాంద్యంతో ఒకపక్క వాహనాల విక్రయాలు తగ్గుతుంటే రాష్ట్రంలో ఆటో అమ్మకాలు 17.18 శాతం పెరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గడిచిన ఐదు నెలల్లో రాష్ట్రంలో 20,139 ఆటోలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో అమ్ముడైంది 17,187 మాత్రమే. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఆటోల అమ్మకాలు 2,33,865 నుంచి 2,16,907కు పడిపోవడంతో 7.25 క్షీణత నమోదైంది. మందగమనం నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వారు ఆటోలు నడుపుకోవడానికి ఆసక్తి చూపిస్తుండటంతో పాటు, విజయవాడలో సీఎన్జీ ఆటోలను ప్రవేశపెట్టడం వల్ల అమ్మకాలు పెరిగాయని డీలర్లు చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద కార్లు, ప్యాసింజర్ల వాహనాల అమ్మకాలు భారీగా పడిపోయాయి. కార్ల అమ్మకాలు 21 శాతం, సరుకు రవాణా వాహనాలు 24 శాతం, ప్యాసింజర్ల వాహనాల అమ్మకాలు 14.64 శాతం మేర క్షీణించాయి. రాష్ట్రంలో నిర్మాణ రంగ పనులు మందగించడం వాణిజ్య వాహనాల అమ్మకాలు తగ్గడానికి కారణమని డీలర్లు పేర్కొంటున్నారు. దసరా, దీపావళిపై ఆశలు గత నాలుగు నెలల నుంచి అమ్మకాలు తగ్గుతుండటంతో వచ్చే దసరా, దీపావళి పండుగలపై డీలర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ – అక్టోబర్ పండుగల సమయంలో కృష్ణా జిల్లాలో 4,000 ద్విచక్ర వాహనాలు విక్రయిస్తే సెప్టెంబర్ ముగుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 700 మాత్రమే విక్రయించామంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రముఖ ఆటోమొబైల్ డీలర్ సంస్థ ప్రతినిధి వాపోయారు. ప్రస్తుతం పండగల సీజన్‌కు తోడు కేంద్రం కార్పొరేట్ ట్యాక్స్‌ను భారీగా తగ్గించడంతో భారీ డిస్కౌంట్లు ఇవ్వడానికి ఆయా సంస్థలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇంతకాలం పన్నులు తగ్గుతాయని కొనుగోళ్లు వాయిదా వేసుకున్న వారు ఇప్పుడు జీఎస్టీ తగ్గింపు లేదనే స్పష్టత రావడంతో అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చినా.. పెట్రోలు, డీజిల్ వాహనాలను రద్దుచేసే ఆలోచన లేదని కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టత ఇవ్వడం వల్ల కూడా అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పండగల తర్వాత పరిశ్రమ కోలుకుంటుందన్న ఉద్దేశంతో గత నాలుగు నెలలుగా అమ్మకాలు లేకపోయినా ఉద్యోగులను తొలగించకుండా కొనసాగిస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. పండగల తర్వాత పరిస్థితిలో మార్పు లేకపోతే అప్పుడు ఉద్యోగుల తొలగింపు గురించి ఆలోచించాల్సి వస్తుందన్నారు. సంక్షోభంలో విస్తరిస్తాం... ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం సంక్షోభం వల్ల చిన్న డీలర్లు భారీగా దెబ్బ తింటున్నారు. దేశ వ్యాప్తంగా 15,000 మందికి పైగా డీలర్లు ఉంటే ఇప్పటి వరకు 300 మంది వరకు డీలర్‌షిప్‌లు వదులుకున్నారు. అమ్మకాలు లేక, బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్ అందక చిన్న డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణ్ మోటార్స్ ఎప్పుడూ ఇటువంటి సంక్షోభాల సమయంలోనే భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపట్టేది. ఈ సమయంలో తయారీ సంస్థల నుంచి ఆఫర్లు బాగుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఒకటి రెండు నెలల్లో పరిస్థితులను గమనించాకే విస్తరణపై ఒక స్పష్టత వస్తుంది. – ప్రభుకిషోర్, చైర్మన్, వరుణ్ గ్రూపు -
తిరువళ్లూరులో భారీ అగ్ని ప్రమాదం
-
భారీ అగ్ని ప్రమాదం..రూ.100 కోట్ల నష్టం
చెన్నై: తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని ఎల్ఎస్ ఆటో మొబైల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.100 కోట్ల నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం ప్రాధమికంగా అంచనా వేసింది. ఈ ఆటో మొబైల్ కంపెనీలో కారు స్పేర్ పార్ట్స్ తయారీ చేస్తారు. సుమారు 1500 కార్మికులు పని చేస్తున్నారు. శుక్రవారం వేకువజామున 1.30 సమయంలో ప్రమాదం జరిగింది. అప్పుడు 50 మంది కార్మికులు మాత్రమే పనిలో ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రమాదం జరగలేదు. కంపెనీ పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక మరేదైనా కారణమా అని కంపెనీ యాజమాన్యం వెల్లడించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పదవీ విరమణ.. పదవులు
విశ్లేషణ కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి ఒక ప్రైవేట్ ఆటోమొబైల్ సంస్థలో భారీ ప్యాకేజీతో చేరినప్పుడు అంత పెద్ద చెల్లింపులు వారి నైపుణ్యాల కోసం కాకుండా వారి పలుకుబడి కారణంగా దక్కాయన్న సందేహాలు తలెత్తాయి. ఇక్కడే పరస్పర ప్రయోజనాల మధ్య వైరుధ్యం తలెత్తడానికి ప్రాతిపదిక ఉంది. పూర్వ ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి బీజీ దేశ్‌ముఖ్ రిటైర్మెంట్ తర్వాత ఒక పెద్ద ప్రైవేట్ సంస్థలో చేరవచ్చా అని 1990లో నాటి ప్రధానిని అడిగారు. దశాబ్దాలపాటు ప్రభుత్వంలో సేవలందించిన ఆయన తనను అనుమతిస్తే పదవీ విరమణ తర్వాత కార్పొరేట్ రంగానికి వెళ్లాలని ఆకాంక్షించారు. నోటిమాటతో ఆమోదించడం నుంచి రాతపూర్వకంగా నిరాకరించడం వరకు ఆయన అభ్యర్థనకు ఆమోదం తెలిపే ప్రక్రియను ఉదాసీనత దెబ్బ తీసింది. దీనికి కారణాలు ఏవైనా కావచ్చు, కానీ రాజీనామా లేదా పదవీ విరమణ తర్వాత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు కార్పొరేట్ ఉద్యోగాలపై చేరడానికి సంబంధించిన ఉదాసీనతను తొలగించి, ప్రయోజనాల మధ్య వైరుధ్యాన్ని–కాన్‌ఫ్లిక్టింగ్ ఆఫ్ ఇంటరెస్ట్–క్రోడీకరిం చవలసిన అవసరాన్ని ఇలాంటి ఘటనలు నొక్కి చెబుతాయి. పాశ్చాత్య దేశాల్లో సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగం చేయడానికి మూలం ఈ ప్రయోజనాల మధ్య వైరుధ్యమే. చాలావరకు బ్రిటన్ చరిత్రలో పాలకులు, వారి అధికారుల మధ్య ఈ ప్రయోజనాల వైరుధ్యం విస్తృతంగా ఉండేది. 1660లో రాయల్ నేవీలో గొప్ప సంస్కర్త శామ్యూల్ పెపీస్ సైతం స్మగ్లింగ్‌లో పాత్ర పోషించాడని ఆరోపణలు వచ్చాయి. కానీ కాలానుగుణంగా పాలక సంస్కృతిలో మార్పు వచ్చింది. చక్రవర్తి కింద పనిచేసే మంత్రులు ఉన్నతోద్యోగ వర్గంలో సమర్థతను పెంచేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. అప్పట్లో బ్రిటన్ అనేక యుద్ధాల్లో మునిగి ఉన్నందున ప్రత్యేకించి పన్నుల సేకరణలో సమర్థ పాలన అత్యవసరమైంది. స్వతంత్ర న్యాయవ్యవస్థతోపాటు వికసిస్తున్న ప్రెస్ వల్ల కార్యనిర్వాహక వర్గానికి, దాని అధికార దుర్వినియోగానికి పరిమితులు విధిం చాయి. విద్యా వ్యాప్తి వల్ల, ప్రజల్లో తమ హక్కుల పట్ల అప్రమత్తత పెరి గింది. ఇక జాతీయ ఆడిటర్ ఆఫీసు ఏర్పాటుతో పాలనా వ్యవహారాల్లో అవినీతిని తగ్గించడానికి దారితీసింది. 20వ శతాబ్ది నాటికి బ్రిటన్‌లో అవినీతి గణనీయంగా బలహీనపడింది. కొంతమంది ఉన్నతోద్యోగులు పబ్లిక్ సర్వీసులోని సుగుణాలను, రిటైర్మెంట్ సమయంలో ప్రైవేట్ లాభంతో కలిపేశారు. తమ చర్యలు, వైఖరుల కారణంగా వీరు ప్రయోజనాల మధ్య వైరుధ్యం బారిన పడ్డారు. దీనికి బదులుగా సామాజిక చైతన్యపరులు, నేతలు వీటిపై ప్రశ్నలు సంధించినప్పుడు వారి వాదనలు వృద్ధికి, పెట్టుబడికి వ్యతిరేకం అని ఆరోపిస్తూ ప్రశ్నించినవారినే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తూ వచ్చారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడమే కాకుండా ప్రయోజనాల మధ్య వైరుధ్యం విషయంలో మన ఉదాసీన సంçస్కృతిని మార్చేవైపుగా సరైన న్యాయ యంత్రాంగాన్ని కూడా నెలకొల్పాల్సి ఉంది. ఇకపోతే, ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికారక సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏ) ఉదాహరణను తీసుకుంటే, వ్యవస్థలోని రెగ్యులేటరీ బోర్డులను స్వార్థ ప్రయోజనాలు క్రమేణా కమ్మేస్తూ వచ్చాయి. ఆహారభద్రతను పర్యవేక్షించడంలో ఈ రెగ్యులేటర్ సూత్రరీత్యా స్వతంత్రంగా ఉండాలని భావించారు కానీ, 2014 వరకు ఆహార పరిశ్రమ ప్రతినిధులే దీనికి సంబంధించిన శాస్త్రీయ కమిటీలలో నియమితులవుతూ వచ్చారు. పురుగు మందులు, ఆహారాన్ని లేబుల్ చేయడం, వేడి చేసి మళ్లీ కావలసిన రూపంలో చల్లబర్చడం వంటి అంశాల్లో ప్రమాణాల కల్పనలో అధికారులను అనుసంధానించేవారు. ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక సైన్స్ విభాగాల్లో పలు పరిశోధన ప్యానెళ్లకు కార్పొరేట్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలను నియమిస్తూ వచ్చారు. ఉదాహరణకు, మానవులపై జరిపే క్లినికల్ పరీక్షలకు చెందిన ఒక ప్యానెల్లో నియమితుడైన నిపుణుడు అతిపెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి చెందిన క్లినికల్ పరీక్షల విభాగాధిపతిగా ఉండటం గమనార్హం. ప్రభుత్వ నియమావళిలో ఎలాంటి విధానాలు లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందనుకోవద్దు. భారత ఉద్యోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో దీనికి సంబంధించి ఓ అధికారిక విధానం ఉంది. దీని ప్రకారం సీనియర్ ప్రభుత్వోద్యోగులు తమ రిటైర్మెంట్ తర్వాత వాణిజ్య రంగంలో ఉపాధి పొందాలంటే తప్పకుండా అనుమతి తీసుకోవలసిందే. కానీ, ఇలాంటి పరిమితిని మంజూరు చేయడం ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉండేది కానీ దీనిపై ఎలాంటి క్రోడీకరణ యంత్రాంగం ఉండేది కాదు. చిట్టచివరకు అలాంటి అభ్యర్థనలపై ప్రభుత్వాలు ఒక ఉదార వైఖరిని చేపట్టాయి. ఉదాహరణకు, ఒక రెవెన్యూ కార్యదర్శి ఒకటి కాకుండా అయిదు సంస్థల్లో పలుహోదాల్లో చేరడానికి అనుమతించారు. ట్రాయ్ మాజీ అధిపతి రిటైరైన కొద్ది నెలల్లోపే అపఖ్యాతి చెందిన ఒక కార్పొరేట్ లాబీయిస్ట్ ప్రమోట్ చేసిన సంస్థలో పనిచేయడానికి అనుమతించారు. ఇకపోతే, కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి ఒక ప్రైవేట్ ఆటోమొబైల్ సంస్థలో భారీ ప్యాకేజీతో చేరినప్పుడు అంత పెద్ద చెల్లింపులు వారి నైపుణ్యాల కోసం కాకుండా వారి పలుకుబడి కారణంగా దక్కాయన్న సందేహాలు తలెత్తాయి. ప్రయోజనాల మధ్య వైరుధ్యాన్ని తొలగిస్తూ నిబంధనలను అమలుచేస్తే అలాంటి బ్యూరోక్రాట్లు ప్రైవేట్ రంగంలో తమ అనుభవాన్ని ఉపయోగిస్తే తప్పులేదు. ప్రయోజనాల మధ్య వైరుధ్యంలో తమ పాత్రను బహిర్గతం చేయని వారిని శిక్షించేలా మనం చట్టం చేయవలసిన అవసరం ఉంది. ఇఎమ్‌ఎస్ నాచియప్పన్ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్ 2012 ప్రకారం, ఇలాంటి చట్టం న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ వంటి పాలనా రంగాలన్నింటికీ వర్తించాల్సి ఉంది. రిటైరయ్యాక ప్రైవేట్ రంగంలో చేరాలని ఆసక్తి ఉన్నవారు ముందస్తుగా రిటైర్ అయ్యేలా నిబంధనలను మార్చాలని, కనీసం అయిదేళ్ల పాటు ప్రవేట్ రంగంలో పనిచేయకుండా వారిపై ఆంక్షలు విధించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది కూడా. అప్పుడే రిటైరైన ఉన్నతాధికారి ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని తాను చేరే ప్రైవేట్ సంస్థకు ఉపయోగించలేడు. అదే సమయంలో అలాంటి సంస్థలలో చేరతామని రిటైర్డ్ అధికారులు చేసిన అభ్యర్థనలను తోసిపుచ్చడానికి కారణాలను కూడా స్పష్టంగా ఈ చట్టంలో పొందుపర్చాలి. అంతిమంగా పారదర్శకతా సంస్కృతిని పెంపొందించాల్సి ఉంది. ప్రజా ప్రతినిధులు ప్రైవేట్ వ్యవహారాల్లో పాలు పంచుకోలేదని స్పష్టం చేయడమే కాకుండా ఉన్నతాధికారులు కూడా తమ రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి ముందే బహిరంగ పర్చడం చాలా అవసరం. ఇలాంటి పారదర్శకత లేనిదే భారతీయ సమాజం, పాలనా వ్యవస్థ, దాని ప్రైవేట్ రంగం ఇన్ సైడర్ ట్రేడింగుతో ఘర్షిస్తూనే ఉంటుంది. -వరుణ్ గాంధీ వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు fvg001@gmail.com -
జూన్ కల్లా దేశీ జీప్ కంపాస్
ఎఫ్సీఏ ఇండియా ప్రెసిడెంట్ కెవిన్ ఫ్లిన్ న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ నాటికల్లా దేశీయంగా తయారు చేసిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం(ఎస్యూవీ) జీప్ కంపాస్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ఆటోమొబైల్ సంస్థ ఎఫ్సీఏ ఇండియా ప్రెసిడెంట్ కెవిన్ ఫ్లిన్ వెల్లడించారు. పుణెకి దగ్గర్లోని రంజన్‌గావ్ ప్లాంట్‌లో తమ తొలి మేడిన్ ఇండియా జీప్ కంపాస్ వాహనాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దీని ధర రూ.16–20 లక్షల శ్రేణిలో ఉండొచ్చని అంచనా. సుమారు రూ.20–30 లక్షల శ్రేణిలో ఉన్న హ్యుందాయ్ టక్సన్, టయోటా ఫార్చూనర్ వంటి వాటికి పోటీనివ్వొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే జీప్ పోర్ట్‌ఫోలియోలో రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ వాహనాలు ఉన్నాయి. వీటి ధర రూ.56 లక్షల నుంచి రూ.1.1 కోట్ల దాకా ఉంది. ఇవి ప్రస్తుతం కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్ కింద దిగుమతవుతున్నాయి. జీప్ కాంపాస్‌లో పెట్రోల్, డీజిల్ వేరియేషన్స్ ఉంటాయని, మ్యాన్యువల్.. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో లభ్యమవుతాయని ఫ్లిన్ వివరించారు. ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ అనుబంధ సంస్థ అయిన ఎఫ్సీఏ ఇండియా.. జీప్ కంపాస్ ప్రాజెక్టుపై 280 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. -
ఉద్యోగాలపై ఆటోమేషన్ పిడుగు
► ప్రతీ 10 ఉద్యోగాలకు నాలుగు మాయం ► వాటిలో ఒకటి మన దేశం నుంచే ► 2021 నాటికి గడ్డు పరిస్థితులు న్యూఢిల్లీ: ఆటోమేషన్ (యాంత్రీకరణ) ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ఒకవైపు పెరుగుతున్న యువ జనాభాకు అనుగుణంగా అదనపు ఉపాధి అవకాశాల అవసరం ఏర్పడగా... మరోవైపు యాంత్రీకరణ కారణంగా ఎన్నో రంగాల్లో భారీగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 10 ఉద్యోగాల్లో నాలుగు ఆటోమేషన్ కారణంగా మాయం కానున్నాయని నిపుణుల అంచనా. ఇంజనీరింగ్, తయారీ, ఆటోమొబైల్స్, ఐటీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లోకి ఇప్పటికే ఆటోమేషన్ అడుగు పెట్టేసింది. ఈ ఆటోమేషన్ పరిమాణం పెరుగుతున్న కొద్దీ దిగువ స్థాయి ఉద్యోగాలపై వేటు పడుతుందని నిపుణుల విశ్లేషణ. రానున్న మూడు నుంచి నాలుగేళ్లలో ఆటోమేషన్ పరంగా చెప్పుకోదగ్గ మార్పు చూడొచ్చని పీపుల్ స్ట్రాంగ్ సీఈవో పంకజ్ బన్సాల్ పేర్కొన్నారు. ముం దుగా అత్యధిక ప్రభావం పడే రంగాల్లో తయారీ, ఐటీ, ఐటీ ఆధారిత రంగం, సెక్యూరిటీ సేవలు, వ్యవసాయ రంగాలుంటాయని ఆయన చెప్పారు. మన దగ్గర 23 శాతం కనుమరుగు... ‘‘2021 నాటికి మా అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 ఉద్యోగాల్లో నాలుగు ఆటోమేషన్ కారణంగా కనుమరుగు అవుతాయి. ఇలా కోల్పోయే ప్రతీ నాలుగు ఉద్యోగాల్లో ఒకటి భారత్ నుంచి ఉంటుంది. అంటే ఒక్క మనదేశంలోనే 23 శాతం ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మన దేశంలో ఏటా 55 లక్షల ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. ఉద్యోగాలకు తగ్గ నైపుణ్యాల లేమి కారణంగా ఈ స్థాయిలో ఉద్యోగాల భర్తీ ఉండడం లేదు. ఆటోమేషన్ ఈ అంతరాన్ని మరింత పెంచనుంది’’ అని పంకజ్ బన్సాల్ వివరించారు. అసెంబ్లింగ్(పరికరాల అమరిక) విభాగంలో ఐదేళ్ల క్రితం 1,500 ఉద్యోగాలుంటే అవిప్పుడు 500కు తగ్గాయని, కంపెనీల దృష్టి నైపుణ్యాలపై శిక్షణ నుంచి ఆటోమేషన్ వైపు మళ్లిందని కెల్లీ ఓసీజీ ఇండియా దేశీయ డైరెక్టర్ ఫ్రాన్సిస్ పదమదన్ తెలిపారు. ఆటోమేషన్తో అన్ని ఉద్యోగాలకు ముప్పు ఉండదని ఫ్రాన్సిస్ అభిప్రాయం. యంత్రాల పర్యవేక్షణకు ఉద్యోగుల అవసరం ఉంటుందని, కేవలం దిగువ స్థాయి ఉద్యోగాలకే ముప్పు ఉంటుందన్నారు. అయితే, తక్కువ నైపుణ్యాలుండి, ఎక్కువ పనిభారం ఉండే ఉద్యోగాలను ఆటోమేషన్ గల్లంతు చేస్తుందని నిపుణులు అంటున్నారు.