సాక్షి, ముంబై: మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో తన అప్డేటెడ్ 'సియాజ్' లాంచ్ చేసింది. ఇది డ్యూయెల్ టోన్ పెయింటింగ్ స్కీమ్ పొందటంతో పాటు అదనపు సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇది కేవలం ఆల్ఫా ట్రిమ్‌కి మాత్రమే పరిమితం చేయబడింది.
మారుతి సియాజ్ సెడాన్ ఇప్పుడు పెర్ల్ మెటాలిక్ ఓపులెంట్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్, పెర్ల్ మెటాలిక్ గ్రాండ్యుర్ గ్రే విత్ బ్లాక్ రూఫ్ మరియు డిగ్నిటీ బ్రౌన్ విత్ బ్లాక్ రూఫ్ అనే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. దీని మాన్యువల్ వేరియంట్ ధర రూ. 11.14 లక్షలు కాగా, ఆటోమేటిక్ ధర 12.34 లక్షలు (ధరలు, ఎక్స్-షోరూమ్).
అప్డేటెడ్ సియాజ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ISOFIX చైల్డ్ సీట్ యాంకరింగ్ పాయింట్ వంటి 20 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది.
ఇంజిన్ విషయానికి వస్తే, మారుతి సియాజ్ 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కలిగి 103 బిహెచ్‌పి పవర్ , 138 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ & 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.
ఫీచర్స్ పరంగా ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కలిగి ఉంది. ఈ సెడాన్ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న నెక్సా షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment