2023 Hero Xtreme 160R 4V: భారతీయ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) ఎట్టకేలకు మరో కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర, అప్డేటెడ్ ఫీచర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వేరియంట్స్ & ధరలు
దేశీయ మార్కెట్లో విడుదలైన హీరో మోటోకార్ప్ కొత్త బైక్ పేరు 'ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వి'. ఇది స్టాండర్డ్, కనెక్టెడ్, ప్రో అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.27 లక్షలు, రూ. 1.32 లక్షలు & రూ. 1.36 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).
డిజైన్ & ఫీచర్స్
2023 ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వి రీ డిజైన్ చేయబడిన ఫుల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతుంది, స్విచ్ గేర్ మునుపటి కంటే ఎక్కువ ప్రీమియంగా ఉంటుంది. ఈ బైక్ స్ప్లిట్ సీటు సెటప్ కలిగి రైడర్ అండ్ పిలియన్ ఇద్దరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. మోనోషాక్ షోవా 7 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ యూనిట్ వంటివి కేవలం టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి. మిగిలిన వేరియంట్లలో టెలిస్కోపిక్ ఫోర్క్ / మోనోషాక్ సెటప్ ఉంటాయి.
ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో LCD డిస్‌ప్లే లభిస్తుంది. దీనికి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. కావున కాల్, నోటిఫికేషన్ అలర్ట్ వంటి వాటిని పొందవచ్చు. కాగా దీనికి సింగిల్ పీస్ సీటు, ఫోన్ మౌంట్, బార్ ఎండ్ మిర్రర్ వంటి యాక్ససరీస్ లభిస్తాయి. ఆసక్తి కలిగిని వినియోగదారులు బైకుని మరింత అందంగా చేయాలనుకుంటే ఈ యాక్ససరీస్ పొందవచ్చు.
(ఇదీ చదవండి: ఏఐ చేసిన పనికి బిత్తరపోయిన జనం - అసలు విషయం ఏంటంటే?)
ఇంజిన్ & పర్ఫామెన్స్
2023 ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వి బైకులోని 163 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఇప్పుడు ఎయిర్ కూల్డ్‌తో పాటు ఆయిల్ కూలర్‌ను పొందుతుంది. కావున ఇది ఆధునిక 4 వాల్వ్ హెడ్ పొందుతుంది. ఇది 16.9 bhp పవర్ 14.6 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్ల వరకు ఉంటుంది. బైక్ మొత్తం బరువు సుమారు 140 కేజీల కంటే ఎక్కువ.
(ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!)
ప్రత్యర్థులు
భారతదేశంలో విడుదలైన కొత్త ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వి ధరల పరంగా బజాజ్ పల్సర్, అపాచే ఆర్టిఆర్ 4వి బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది. సంస్థ ఈ బైక్ కోసం ఈ రోజు నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు జూలై రెండవ వారంలో మొదలయ్యే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment