భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా CB350 లైనప్‌కి కొత్త నియో-రెట్రో మోటార్‌సైకిల్ జోడించడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. హైనెస్, ఆర్ఎస్ విడుదల చేసిన తరువాత, హోండా సిబి350 కేఫ్ రేసర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.
హోండా సిబి350 కేఫ్ రేసర్ గురించి అధికారిక సమాచారం విడుదల కానప్పటికీ, ఇటీవల స్పెషల్ క్లోజ్డ్ డోర్ ఈవెంట్‌లో కనిపించింది. ఈ బైక్ సాధారణ మోడల్ మాదిరిగా కాకుండా.. చిన్న ఫ్లైస్క్రీన్, బ్యాక్ సీట్ కౌల్ వంటి వాటిని కలిగి ఉంటుంది. మెకానిజమ్స్ మొత్తం సిబి350కి సమానంగా ఉంటుంది.
హోండా సిబి350 కేఫ్ రేసర్ 348 సిసి ఇంజిన్ కలిగి, 20.6 బీహెచ్‌పి పవర్, 30 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున పనితీరు పరంగా మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది.
సిబి350 కేఫ్ రేసర్ బైకులో హ్యాండిల్ బార్, ఫ్లుయెల్ ట్యాంక్ కొంత వెడల్పుగా ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇందులో క్రోమ్ ఫినిష్డ్ ఎగ్జాస్ట్, అల్లాయ్ వీల్స్, సెమీ డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్, యూఎస్‍బీ చార్జర్ వంటి ఫీచర్స్ ఉంటాయి. ప్రస్తుతానికి సిబి350 కేఫ్ రేసర్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు, అయితే ఈ వివరాలు అధికారికంగా ఆవిష్కరణ సమయంలో వెల్లడవుతాయి.
(గమనిక: ఈ కథనంలో ఉపయోగించి హోండా సిబి350 ఫోటో అవగాహన కోసం మాత్రమే.)
Comments
Please login to add a commentAdd a comment