
ముంబై: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తాజాగా సి–క్లాస్‌లో కొత్త తరం కార్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణమైన డీజిల్ ఇంజిన్‌తో ఇది పనిచేస్తుంది. ఇందులో సి 220డి ప్రైమ్ ధర రూ. 40 లక్షలు, సీ 220డి ప్రోగ్రెసివ్ రేటు రూ. 44.25 లక్షలు, టాప్ ఎండ్ సి 300డి ఏఎంజీ ధర రూ. 48.50 లక్షలుగా ఉంటుందని మెర్సిడెస్ బెంజ్ వెల్లడించింది. ప్రస్తుత సి–క్లాస్‌తో పోలిస్తే లేటెస్ట్ కారులో దాదాపు 50 శాతం మేర కొత్త మార్పులు చేసినట్లు, 6,500 పైచిలుకు కొత్త విడిభాగాలు ఇందులో ఉపయోగించినట్లు వివరించింది.
సి 220డి విక్రయాలు గురువారం నుంచి ప్రారంభం అయినట్లు, సి 300డి అమ్మకాలు మాత్రం డిసెంబర్ త్రైమాసికంలో ప్రారంభం కానున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ జాప్ తెలిపారు. భారత మార్కె ట్లో ప్రవేశపెట్టినప్పట్నుంచి ఇప్పటిదాకా 30,500 పై చిలుకు సి–క్లాస్ కార్లు యూనిట్లు అమ్ముడయ్యాయని, ఇక్కడ తమకు అత్యధిక విక్రయాలు ఉన్న టాప్ మోడల్స్‌లో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment