తల్లిదండ్రులకు సందీప్‌ కానుక | Sundeep Kishan Gifts Car To His Parents | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులకు సందీప్‌ కానుక

Published Mon, Dec 2 2019 5:57 PM | Last Updated on Mon, Dec 2 2019 6:30 PM

Sundeep Kishan Gifts Car To His Parents - Sakshi

హీరో సందీప్‌ కిషన్‌ తన తల్లిదండ్రులను ఓ కానుక అందజేశారు. బెంజ్‌ జీఎల్‌ఈ 350డీ మోడల్‌ కారును తన తల్లిదండ్రులకు అందజేసిన సందీప్‌.. వారిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. తనను, తన ఇష్టాలను ఎంతో ఓపికగా భరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘నన్ను, నా ఎంపికలను ఎంతో ఓపికగా భరించినందుకు అమ్మ, నాన్నకు ధన్యవాదాలు.  నా వృతిల్లో ఉన్న ఒడిదుడుకులను అర్థం చేసుకోవడం ఎంతో కష్టమో నాకు తెలుసు. ఈ కానుకను మీకు అందజేయడానికి చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాను.. లవ్‌ యూ. డాడీ మీరు ఎంతో జాగ్రత్తగా కారు డ్రైవ్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆయన షేర్‌ చేశారు. 

కాగా, సందీప్‌ నటించిన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌ చిత్రం ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఏ1 ఎక్స్‌ప్రెస్‌ చిత్రంలో నటిస్తున్నారు. హాకీ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి డెన్నిస్‌ జీవన్‌ కనుకొల దర్శకత్వం వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement