హెడ్‌లైన్ చదివిన వెంటనే మీకు అనుమానం రావొచ్చు, 11 ఏళ్ల వయసేంటి, కోటి సంపాదన ఏంటి అని. అయితే ఇది అక్షరాలా నిజం. ఆస్ట్రేలియాకు చెందిన 'పిక్సీ కర్టిస్' (Pixie Curtis) నెలకు కోటి రూపాయలకంటే ఎక్కువ సంపాదిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది.
పిక్సీ కర్టిస్ తన తల్లి ఏర్పాటు చేసిన కంపెనీలో ఊహ తెలిసినప్పటి నుంచి పనిచేస్తోంది. ఈ కంపెనీలో చిన్నారి పిక్సీ.. నెలకు 1,33,000 ఆస్ట్రేలియన్ డాలర్లు జీతం తీసుకుంటోంది. నెలకు భారీ మొత్తంగా శాలరీ తీసుకున్న వారి జాబితాలో పిక్సీ కూడా స్థానం సంపాదించింది. ఈ అమ్మాయి ఇప్పుడు మైనరే అయినా.. ఖరీదైన కారు వాడుతోంది. సొంతంగా డ్రైవింగ్ రాకపోయినా రోజూ ఇంటికి, ఆఫీసుకి ఖరీదైన బెంజ్ కారులో తిరుగుతుంది.
పిక్సీ కర్టిస్ ఆఫీసులో పిల్లలకు సంబంధించిన హెయిర్ క్లిప్‌లు, రకరకాల హెడ్ బ్యాండ్స్ డిజైన్ చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంది. పిక్సీ డిజైన్ చేసిన క్లిప్ లకు భారీగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలను దృష్టిలో పెట్టుకుని పిక్సీ డిజైన్ చేస్తోన్న హెడ్ బ్యాండ్స్ అంటే చాలా మంది కొనేందుకు పోటీ పడతారు. ఇలాంటి వినూత్నమైన ప్రోడక్ట్స్ తయారీతో కంపెనీ పెద్ద ఎత్తున లాభాలను ఆర్జిస్తోంది, అంతే కాకుండా కంపెనీలో జరిగే బోర్డు మీటింగులకు కూడా ఈ చిన్నారి హాజరవుతుంది.
ప్రస్తుతం చిన్నారి పిక్సీ కోట్లలో సంపాదిస్తున్నప్పటికీ చదువు ముఖ్యం కాబట్టి, ఆమె తల్లి పిక్సీని కొన్నాళ్ల పాటు ఉద్యోగానికి విరామం ఇవ్వమంటోంది. రోజూ ఆఫీసుకు వచ్చేకంటే కొన్నాళ్ల పాటు చదువుకోవాలని చెబుతోంది. ఇటీవల తన 10వ బర్త్‌డేని పిక్సీ.. దాదాపు 40,000 డాలర్ల ఖర్చుతో చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. బర్త్‌డే గిఫ్ట్‌గా తన తల్లి పిక్సీకి లగ్జరీ బెంజ్ కారు ఇచ్చింది. ఇదంతా చదివి పిల్ల కాదు పిడుగు అంటారా.. అది మీ ఇష్టం.
Comments
Please login to add a commentAdd a comment