చాలామంది హీరోహీరోయిన్లకు బైక్స్, కార్స్ అంటే కాస్త పిచ్చి ఉంటుంది. మార్కెట్ లోకి కొత్త మోడల్ వస్తే చాలు కొనేస్తుంటారు. లేదంటే మంచి సందర్భం చూసుకుని వాటిని సొంతం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఓ హీరోయిన్ ఖరీదైన కారు కొనేసేంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? కారు కొనడం ఎందుకంత స్పెషల్?
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అంటే చాలామందికి గుర్తొచ్చే పేరు కంగన రనౌత్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది. బాలీవుడ్ బడా హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచింది.
(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా)
గత కొన్నేళ్ల నుంచి చూసుకుంటే రాజకీయంగానూ కంగనా రనౌత్.. పలు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అందుకు తగ్గట్లే ఈమెకు బీజేపీ తరఫున మండి ఎంపీ టికెట్ కేటాయించారు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగానే కంగన కొత్త కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
తన నిర్మాణ సంస్థ మణికర్ణిక ప్రొడక్షన్స్ పేరుపై బెంజ్ మెబాజ్ జీఎల్ఎస్ ఎస్680 కారు కొనుగోలు చేసింది. అయితే దీని విలువ దాదాపు రూ.3 కోట్లు పైనే. మరోవైపు కంగన దగ్గర బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెజ్ బెంజ్, ఆడీ క్యూ8 కార్లు ఉన్నాయని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: Pushpa 2 Teaser: పుష్పరాజ్ మాస్ జాతర చూస్తారా?)
Comments
Please login to add a commentAdd a comment