Ram Charan New Luxury Car Mercedes Maybach GLS600, Video Viral - Sakshi
Sakshi News home page

Ram Charan: ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్న ఈ కారు ధరెంతంటే..

Published Mon, Sep 13 2021 9:15 AM | Last Updated on Mon, Sep 13 2021 2:55 PM

Ram Charan New Luxury Car Mercedes Maybach GLS600 Video Viral - Sakshi

Ram Charan New Car: మన స్టార్‌ హీరోలకు లగ్జరీ కార్లు అంటే మక్కువ ఎక్కువ. మార్కేట్లోకి వచ్చిన కొత్తరకం మోడల్‌ కార్లను ఎప్పుడెప్పుడు తమ ఇంటిముందు పార్క్‌ చేయాలాని ఎదురు చూస్తుంటారు. అందుకే కొత్తరకం కారు వచ్చిందంటే చాలు క్షణం అలస్యం చేయకుండా కొనేస్తారు. ఈ మధ్యే యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థ ‘లంబోర్ఘిని’ ఊరూస్‌ మోడల్‌ లగ్జరీ కారును  కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా పవర్ స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా మరో న్యూ బ్రాండ్‌ బెంజ్‌ లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. ఈ కారును చరణ్‌ ప్రత్యేకంగా డిజైన్‌ చేసుకున్నాడట. ఈ కారు పేరు మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్‌ 600.

చదవండి: ‘మా’ బాధ్యత పెద్ద హీరోల మీద కూడా ఉంది: ప్రకాశ్‌ రాజ్‌

కొద్దిసేపటి క్రితమే ఈ కారు డెలివరి కావడంతో చరణ్‌ దాన్ని హ్యండోవర్‌ చేసుకున్నాడు. అనంతరం తన టీంతో కలిసి గ్రాండ్‌గా ఓపెన్‌ చేసి తన కొత్త బ్లాక్‌ కలర్‌ బెంజ్‌ కారులోనే చరణ్‌ ఇంటికి బయలుదేరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ట్రక్‌ నుంచి దింపుతూ మొదలైన ఈ కారు వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.  హై సెక్యూరిటీ, అధునాతన టెక్నాలజీతో చరణ్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఈ కారు ధర రూ. 2.5 కోట్లు ఉంటుందట. అయితే చెర్రి దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉన్న సంగతి తెలిసిందే.

చదవండి: జీవితమే పెద్ద ఛాలెంజ్‌, బాధగా ఉన్నా స్వీకరించాల్సిందే: అరియానా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement