సూర్య, ధన్య బాలకృష్ణ జంటగా రాబోతున్న చిత్రం రామ్(ర్యాపిడ్ యాక్షన్ మిషన్). దేశభక్తి కథాంశంగా ఈ చిత్రాన్ని మిహిరామ్ వైనతేయ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో దీపికాంజలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య హీరోగా పరిచయం కానున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. సైంధవ్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో దేశభక్తి చాటి చెప్పే కథాంశంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో దేశ భక్తిని చాటే ఎన్నో డైలాగ్స్ చాలా ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. త్రివర్ణ పతాకాన్ని చూపించే గన్ షాట్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్‌లోని సన్నివేశాలు చూస్తే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment