Watch: Nandamuri Kalyan Ram Amigos Movie Trailer Out Today - Sakshi
Sakshi News home page

Amigos Movie Trailer: 'ఓ రాక్షసున్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు కదరా'.. అమిగోస్ ట్రైలర్

Published Fri, Feb 3 2023 6:57 PM | Last Updated on Fri, Feb 3 2023 7:08 PM

 Nandamuri Kalyan Ram Amigos Trailer Out Today - Sakshi

నందమూరి కల్యాణ్‌ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'అమిగోస్'. బింబిసార తర్వాత సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 

ట్రైలర్ చూస్తే డోపుల్ గ్యాంగర్ అంటే మనిషి పోలిన మనుషులు కాన్సెప్ట్‌తోనే సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ట్రైలర్‌ చూస్తే సినిమాతో సరికొత్త థ్రిల్ పొందడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇటీవలే ఈ చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఫిబ్రవరి 10న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement