‘‘మీరు మీ పెద్దబ్బాయిని అనాథలా వదిలేసారని అంటున్నారు.. దానికి మీరు ఏం చెబుతారు..’ (రమ్యకృష్ణకు ఎదురయ్యే ప్రశ్న)’ అనే డైలాగ్‌తో ‘గుంటూరు కారం’ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ‘అతడు, ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటించారు.
సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ‘చూడంగానే మజా వచ్చిందా’, ‘హార్ట్ బీట్ పెరిగిందా’, ‘ఈల వేయాలనిపించిందా’, ‘ఆట చూస్తావా..! అంటూ మహేశ్ బాబు చెప్పే డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి. రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, జయరాం కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment