
హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. ఈ మూవీకి ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. ఈ చిత్రం విడుదల జులై 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా హ్యాపీ బర్త్‌డే ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. దర్శకు ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా బుధవారం ట్రైలర్ లాంచ్ అయ్యింది. కాగా థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. సరికొత్త పాత్రలు, విభిన్న కథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం తూపాకీల చూట్టు తిరగనుందని తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment