Ritesh Rana Interesting Comments On Happy Birthday Movie In Media Meet, Deets Inside - Sakshi
Sakshi News home page

Ritesh Rana: ‘హ్యాపీ బర్త్ డే'లో సరికొత్త ప్రపంచాన్ని చూస్తారు

Published Sat, Jul 2 2022 4:19 PM | Last Updated on Sat, Jul 2 2022 6:29 PM

Ritesh Rana Talk About Happy Birthday Movie - Sakshi

‘ప్రస్తుతం మన సమాజంలో గన్స్ లీగల్ కాదు. అందరి దగ్గర గన్స్  ఉండటం కష్టం. అందుకే ఒక ఫేక్ వరల్డ్ క్రియేట్ చేద్దామనే ఆలోచన వచ్చింది. సర్రియల్ కామెడీ జోనర్‌లో ‘హ్యాపీ బర్త్‌డే’ మూవీ ఉంటుంది. కథ మొత్తం లాజికల్‌గానే ఉంటుంది. కానీ కథ జరిగే ప్రపంచం మాత్రం ఊహాజనితంగా ఉంటుంది’ అని దర్శకుడు రితేష్‌ రానా అన్నారు. మత్తువదలరా లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత రితేష్‌ రానా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించారు. క్లాప్ ఎంటర్ టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన  ఈ చిత్రం జులై 8న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా రితేష్‌ రానా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

ట్రైలర్ చూసిన చాలా మందికి అర్ధం కాలేదనే మాట వినిపిస్తుంది ? 
ఆసక్తికరంగా ఉండాలి కథ అర్ధం కాకూడదనే ఉద్దేశంతోనే ట్రైలర్ కట్ చేశాం. ఈ కథ ఎలాంటి ప్రపంచంలో జరుగుతుందనేది చెప్పి, పాత్రలని పరిచయం చేశాం. కథ ఏమిటనేది సినిమా చూస్తే అర్ధమౌతుంది. 

'మత్తువదలరా' టెక్నికల్ టీమ్ నే ‘హ్యాపీ బర్త్ డే’లో కొనసాగించడానికి కారణం ?
టెక్నికల్ టీమ్ అంతా పదేళ్ళుగా ప్రయాణిస్తున్నాం. అదే టీమ​ ఉంటే ఒక సౌకర్యం ఉంటుంది. ఒకరిని ఒకరం అర్ధం చేసుకుంటాం. టీమ్‌లో మంచి సింక్ ఉన్నపుడు బెస్ట్ అవుట్ పుట్ వస్తుందని నమ్ముతాను. 
 

ఇలాంటి సినిమాలు ఇది వరకు వచ్చాయా ? ఏదైనా ప్రేరణ ఉందా ?
ఇలాంటి జోనర్ సినిమా రాలేదు. స్క్రీన్ ప్లే మాత్రం నాన్ లీనియర్ గా చేశాం. క్వెంటిన్ టరాన్టినో 'ఫుల్ప్ ఫిక్షన్' తరహాలో స్క్రీన్ ప్లే వుంటుంది. కథ చాప్టర్ వైజ్ వెళుతుంటుంది. 

'మత్తువదలరా'లో చేసిన నరేష్, సత్య, వెన్నెల కిషోర్ .. హ్యాపీ బర్త్ డే లో తీసుకోవడానికి కారణం ? 
మా అందరి మధ్య మంచి సింక్ కుదిరింది. అలాగే ఈ పాత్రలకు వారే యాప్ట్.  

గన్స్ మీద కథ చేశారు కదా .. ఎన్ని రకాల గన్స్ వాడారు ? 
దాదాపు అన్ని రకాల గన్స్ వాడాం. సెల్ ఫోన్స్ ఎలా అయితే కలర్స్ లో దొరుకుతున్నాయో అలా కలర్ ఫుల్ గా గన్స్ ఉండాలనే ఆలోచన తో డిఫరెంట్ కలర్స్ లో గన్స్ తయారు చేశాం. రెంట్ లో వచ్చే గన్స్ అన్నీ దాదాపుగా వాడేశాం. 

ట్రైలర్ లో రాజశేఖర్ పోస్టర్ చూపించడానికి కారణం ?
రాజశేఖర్ గారి సినిమా పేరు ఆయుధం. సినిమాలో రైతు బజార్ లా గన్ బజార్ ని మినిస్టర్ పెడతారు. గల్లీగల్లీకి గన్ బజార్  ఉంటుంది. ఆయుధం సేల్ అని కొంచెం ఫన్నీగా ఉండేలా పెట్టాం. 

లావణ్య త్రిపాఠి ని ఎంపిక చేయడానికి కారణం ? 
లావణ్య త్రిపాఠి  ఇప్పటివరకు ఇలాంటి సినిమా చేయలేదు. ఆమె బయట చాలా జోవియల్ గా ఉంటారు. ఒక టీవీ షో లో తనని చూసి ఈ క్యారెక్టర్ రాశాను. ఈ పాత్ర ఆమెకు కొత్తగా ఉండటంతో పాటు సరిగ్గా నప్పింది. ఈ కథని లావణ్య త్రిపాఠి లీడ్ చేస్తారు.మిగతా పాత్రలన్నీ ముఖ్యమే. 

ఇలాంటి కథలు ఓటీటీకి బావుంటాయా ? థియేటర్ కా ? 
థియేటర్ ఎక్సపిరియన్స్ కి బాగుంటాయి. ఈ సినిమా థియేటర్ కోసమే తీశాం.  300 వందల మంది కలసి నవ్వుకోవడంలో ఓ కిక్ వుంటుంది. తర్వాత ఓటీటీలో కూడా వర్క్ అవుతుంది. 

మత్తువదలరా లో ఒక కొత్త తరహా కామెడీ చూపించారు ? ఇందులో ఎలాంటి కొత్తదనం  ఉంటుంది ? 
హ్యాపీ బర్త్ డే చాప్టర్ వైజ్‌ ఉంటుంది. కామెడీలో ఉన్న జోనర్స్ అన్నీ ఒకొక్క చాప్టర్ లో టచ్ చేశాం. ఏడు చాప్టర్లు  ఉంటే.. విజువల్ కామెడీ, వ్యంగ్యం, పేరడీ, ఇలా ఒకొక్క చాప్టర్ లో ఒక్కో తరహా కామెడీ ప్రయత్నించాం. 

మ్యూజిక్ కి ఎంత ప్రాధాన్యత  ఉంది ? 
చాలా ప్రాధన్యత  ఉంది. సినిమా చాలా క్రేజీ గా తీశాం. మ్యూజిక్ డబుల్ క్రేజీ గా ఇచ్చారు కాల భైరవ.   

పాన్ తెలుగు సినిమా అన్నారు కదా ? పాన్ ఇండియా పై సెటైరా ? 
సెటైర్ కాదండీ. ప్రమోషన్స్ లో సరదాగా నవ్వుకోవడానికి అలా పెట్టాం. సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగులో రిలీజ్ అవుతుందని చెప్పడానికి అలా  సరదాగా పాన్ తెలుగు సినిమా అన్నాం. 

కామెడీ అన్ని చోట్ల వర్క్ అవుట్ అవుతుంది కదా .. మిగతా భాషల్లో ఎందుకు ప్రయత్నించలేదు.?  
కొన్ని నటులని బట్టి  ఉంటుంది. సత్య, వెన్నెల కిషోర్ మనకి బాగా తెలిసిన నటులు. హిందీలో ఎలా  ఉంటుందో తెలీదు. తెలుగు అనుకునే ఈ సినిమా చేశాను. 

చాలా పాత్రలు ఉన్నపుడు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా .. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు ? 
ఎక్కువ పాత్రలు ఉన్నపుడు కాస్త కన్ఫ్యూజన్ వచ్చే మాట వాస్తవమే. స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ గా ఉండటంలో  కూడా ఇది వస్తుంది. అయితే సినిమా చూసినప్పుడు మాత్రం ఎలాంటి కన్ఫ్యూజన్ వుండదు. ఇది చాలా టిపికల్ స్క్రీన్ ప్లే. 

ఇందులో చాలా పాత్రలు ఉన్నాయి కదా ఎవరు ఎక్కువగా హైలెట్ అవుతారని భావిస్తున్నారు ? 
అందరూ హైలెట్ అవుతారు. అందరికీ సమాన ప్రాధన్యత  ఉంటుంది. అయితే లావణ్యని ఇప్పటివరకూ ఇలాంటి పాత్రలలో చూడలేదు కాబట్టి ఆమె పాత్ర ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం  ఉంటుందని భావిస్తున్నా. ఆమెకు మంచి ప్రశంసలు దక్కుతాయని అనుకుంటున్నాను. 

హ్యాపీ బర్త్ డే టైటిల్ గురించి ? 
ఇందులో లావణ్య గారి పేరు హ్యాపీ. ఆమె బర్త్ డే రోజు కథలో కీలక అంశాలు జరుగుతాయి కాబట్టి హ్యాపీ బర్త్ డే అని పెట్టాం.  

డిఫరెంట్ జోనర్స్ ఎంచుకోవడానికి కారణం ? 
మత్తువదలరా లిమిటెడ్ బడ్జెట్ లో చేసి ఒక ఎంట్రీ కార్డ్ గా నన్ను నేను నిరూపించుకోవడానికి చేశా. ఇది విజయం సాధించింది. నాకు ఎప్పుడూ కొత్తగా రాయాలనే ఉంటుంది. హ్యాపీ బర్త్ డే కూడా డిఫరెంట్ కథ. నిర్మాతలకు చాలా నచ్చింది. 

ప్రయోగాత్మక చిత్రాలు చేస్తారా ? కమర్షియల్ సినిమాలు చేసే ఆలోచన ఉందా ? 
హ్యాపీ బర్త్ డే కూడా కమర్షియల్ సినిమానే. గన్స్ ఫైట్స్ పాటలు అన్నీ ఉన్నాయి( నవ్వుతూ). అయితే ఒక ఫార్ములా కాకుండా కొంచెం వైవిధ్యమైన ప్రజంటేషన్ ఉంటుంది. 

మత్తువదలరా విజయం తర్వాత చాలా అవకాశాలు వచ్చుంటాయి కదా.. మళ్ళీ మైత్రీ మూవీ మేకర్స్ తోనే  చేయడానికి కారణం ? 
మైత్రీ మూవీ మేకర్స్ తో పని చేయడం చాలా సౌకర్యంగా వుంటుంది. నా స్టయిల్ వాళ్లకి తెలుసు. సినిమాపై మంచి ప్యాషన్ వున్న నిర్మాతలు. 

కొత్త సినిమాలు గురించి ? 
రెండు కథలు లాక్ అయ్యాయి. ఇవి కూడా చాలా కొత్తగా  ఉంటాయి. ఏది ముందు సెట్స్ పైకి తీసుకెళ్ళాలో ఇంకా డిసైడ్ కాలేదు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement