
విజయ్
అతనొక కార్పొరేట్ దిగ్గజం. ఏ దేశానికి వెళ్లినా తనను ఎదిరించిన వాళ్లను అంతం చేస్తాడు. ఓటు వేయడం కోసం ఇప్పుడతను ఇండియాకి వచ్చాడు. పనిగట్టుకుని ఎన్నికల కోసం భారత్‌కి రావడానికి కారణమేంటి? ఇక్కడ ఏం చేశాడు? అన్నది తెరపైనే చూడాలంటున్నారు అశోక్ వల్లభనేని. విజయ్ హీరోగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మించిన చిత్రం ‘సర్కార్’. కీర్తీ సురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కథానాయికలు.
ఈ చిత్రాన్ని అశోక్ వల్లభనేని తెలుగులో విడుదల చేస్తున్నారు.నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అశోక్ వల్లభనేని మాట్లాడుతూ– ‘‘నవాబ్’ లాంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత మేం విడుదల చేస్తున్న చిత్రం ‘సర్కా ర్’. ‘కత్తి, తుపాకీ’ వంటి హిట్ చిత్రాల తర్వాత మురుగదాస్–విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు హ్యాపీగా ఉంది. రెహమాన్ చక్కని స్వరాలు అందించారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment