
సోనియా, రగ్ధా ఇఫ్తాకర్
నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్‌పై చదలవాడ పద్మావతి నిర్మించారు. ఈ సినిమా గ్లింప్స్‌ని ‘మాతృదేవోభవ’ ఫేమ్ దర్శకుడు అజయ్ కుమార్, టీజర్‌ని నిర్మాత రామ సత్యనారాయణ, ట్రైలర్‌ని తెలుగు ఫిలింప్రోడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ విడుదల చేశారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ–‘‘వేటగాడు, అడవి రాముడు, దేవదాసు’ వంటి సినిమాల స్ఫూర్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. ఇప్పటి వరకు నాకున్న అనుభవంతో సమాజానికి ఉపయోగపడే ఓ మంచి కథతో సినిమా తీయాలని ‘రికార్డ్ బ్రేక్’ తీశా. ఇందులో చివరి 45 నిమిషాలు చాలా భావోద్వేగాలు ఉంటాయి. ఈ సినిమాకి విజయం అందించాలి’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో నటీనటులు నిహార్ కపూర్, రగ్ధ ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన, సోనియా, నాగార్జున, కథా రచయిత అంగిరెడ్డి శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కంతేటి శంకర్, నిర్మాణం: చదలవాడ బ్రదర్స్.
Comments
Please login to add a commentAdd a comment