మాస్‌ మెకానిక్‌ | Vishwak Sen Mechanic Rocky Trailer Released | Sakshi
Sakshi News home page

మాస్‌ మెకానిక్‌

Published Mon, Oct 21 2024 12:12 AM | Last Updated on Mon, Oct 21 2024 12:12 AM

Vishwak Sen Mechanic Rocky Trailer Released

‘ఓ నటుడిగా నేనింత దూరం వచ్చానంటే ఇద్దరే కారణం. ఒకటి నేను...  రెండు... మీరు (అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి). ‘మెకానిక్‌ రాకీ’ సినిమా చూసుకున్నాను. చాలా బాగా వచ్చింది. రెండోసారి కూడా చూడాలనుకునేలా ఈ సినిమా ఉంటుంది.’’ అని విశ్వక్‌ సేన్‌ అన్నారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా, మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మెకానిక్‌ రాకీ’. 

రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం నవంబరు 22న విడుదల కానుంది. ఈ సినిమా తొలి ట్రైలర్‌ను ఆదివారం రిలీజ్‌ చేశారు. మాస్‌ యాక్షన్, లవ్, సెంటిమెంట్‌ అంశాలతో ఈ సినిమా ఉంటుందని ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. ఈ సందర్భంగా విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘రిలీజ్‌ సమయంలో మరో ట్రైలర్‌ను విడుదల చేస్తాం. అలాగే ఒక రోజు ముందుగానే పెయిడ్‌ ప్రీమియర్స్‌ వేస్తాం. నిర్మాత రామ్‌ తాళ్లూరి బాగా స΄ోర్ట్‌ చేశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్‌ చేయండి’’ అన్నారు రామ్‌ తాళ్లూరి, శ్రద్ధా శ్రీనాథ్, రవితేజ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement