
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ, శోభన, అన్నా బెన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. భైరవ పాత్రలో ప్రభాస్, సుమతి పాత్రలో దీపిక, అశ్వత్థామ పాత్రలో అమితాబ్, సుప్రీమ్ యాక్సిన్‌గా కమల్ కనిపిస్తారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ‘కల్కి 2898 ఏడీ’ ఈ నెల 27న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘సమయం వచ్చింది. భగవంతుడి లోపల సమస్త సృష్టి ఉంటుందంటారు. అలాంటిది మీ కడుపున భగవంతుడే ఉన్నాడు, నేను కాపాడతా..’ (అమితాబ్), ‘ఎన్ని యుగాలైనా... ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు... మారలేడు’ (కమల్) ‘ఒక పెద్ద బౌంటీ... వన్ షాట్... కాంప్లెక్స్‌కి వెళ్లిపోతా..., సరే... ఇంక చాలు, ఈసారి ప్రిపేరై వచ్చాను... దా’ అనే డైలాగ్స్‌తో పాటు ‘మాధవా...’ అనే పాట కూడా ఈ ట్రైలర్‌లో వినిపిస్తుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment